మహబుబాబాద్: మహబుబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను బావిలో పడేసి తాను కూడా బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. మహిళను స్థానికులు రక్షించారు. ఈ సంఘటన జిల్లాలోని వేమ్నూరు గ్రామంలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది.
గ్రామానికి చెందిన సరిత మానసిక పరిస్థితి సరిగ్గాలేదు. ఈక్రమంలో తన ఇద్దరు చిన్నారులు సంజన(3), ధన(2)లను వ్యవసాయ బావిలో తోసేసి ఆమె కూడా అందులో దూకింది. ఇది గుర్తించిన స్థానికులు వారిని రక్షించడానికి యత్నించగా.. అప్పటికే ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.
ఇద్దరు పిల్లలను బావిలో పడేసిన తల్లి
Published Sun, Feb 12 2017 10:26 AM | Last Updated on Sat, Aug 25 2018 5:41 PM
Advertisement
Advertisement