పెద్దేముల్: అన్ని అర్హతలు ఉండీ.. గతంలో పింఛన్లు అందుకున్న తమకు ప్రస్తుతం పింఛన్లు రావడంలేదంటూ రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలంలో పలువురు వృద్ధులు ఆందోళన నిర్వహించారు.
సోమవారం మద్యాహ్నం తాండూరు- సంగారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించిన పింఛన్ లబ్దిదారులు దాదాపు రెండు గంటలపాటు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. జాబితా నుంచి తమ పేర్లను అక్రమంగా తొలిగించారని, వెంటనే తమకు పింఛన్లు అందజేయాలని డిమాండ్ చేశారు. స్థానిక జడ్పీటీసీ సభ్యురాలు స్వరూప సహా పలువురు నేతలు పింఛనర్ల ఆందోళనకు మద్దతు పలికారు.
పింఛన్ల కోసం వృద్ధుల ఆందోళన
Published Mon, Aug 17 2015 4:24 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement