పోకలగూడెం.. పాలన మృగ్యం
- సర్పంచ్ అనర్హత వేటుపై వీడని సందిగ్ధం
- హైకోర్టు ఆదేశాలూ బేఖాతరు
- కలెక్టర్ దగ్గర ఫైల్.. నెలల తరబడి నిలిచిన పరిపాలన
చండ్రుగొండ : మండలంలోని పోకలగూడెం పంచాయతీలో పాలన ప్రతిష్టంభించింది. పంచాయతీలో పాలన నిలిచిపోవడంతో సుమారు 6,000 మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ పంచాయతీ సర్పంచ్ గుగులోత్ రాములపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. నియమ నిబంధనల ప్రకారం సర్పంచ్ ఎన్నికల్లో రెండోస్థానంలో ఉన్న అభ్యర్థికి పాలన పగ్గాలు అప్పజెప్పాలని ఆర్డీవో కోర్టు తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఈ ఫైల్ జిల్లా కలెక్టర్ ఆధీనంలో ఉంది. ఐదునెలలుగా అక్కడే మగ్గుతు న్నా దీనిపై ఇప్పటి వరకు ఓ స్పష్టత రాలేదు. పాత కలెక్టర్ కూడా బదిలీ అయ్యూరు. ఆయనస్థానంలో కొత్తగా వచ్చిన కలెక్టర్ లో కేష్‌కుమార్‌అరుునా దీనికి పరిష్కారమార్గం చూపుతారోనని స్థానికులు ఎదురుచూస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
2013 జులైలో పంచాయతీకి ఎన్నికలు జరిగా రుు. ఈ ఎన్నికల్లో గుగులోత్ రాములు విజయం సాధించారు. 1995 తరువాత రాములు కు ముగ్గురు సంతానం ఉన్నారని ప్రత్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పంచాయతీరాజ్ ఎన్నికల నియమావళి ప్రకారం రాములు ఎన్నికల్లో పోటీకి అనర్హుడని 2015 మే6 న కొత్తగూడెం ఆర్డీఓ, డివిజన్ ఎన్నికల అధికారి అమయ్‌కుమార్ తీర్పు చెప్పారు. సదరు తీర్పుపై రాము లు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులోనూ రాములకు చుక్కెదురైంది. ఆర్డీఓ కోర్టు తీర్పును హైకోర్టులోని రెండు బెంచ్‌లు ఏకీభవించాయి. బంతి జిల్లా అధికారుల కోర్టులో పడింది. కానీ నెలలు గడుస్తున్నా జిల్లా అధికారులు ఈ అం శంపై చర్యలు తీసుకోకపోవడంతో పంచాయతీ పాలన అస్తవ్యస్తంగా మారింది. అభివృద్ధి పనులు నిలి చిపోయూరుు. మంచినీ రు,వీధి దీపాలు, పారి శుధ్యం అధ్వాన్నంగా మారింది.
కలెక్టర్‌గారూ స్పందించరూ..
పోకలగూడెం పంచాయతీ విషయంలో అధికారపార్టీ ఒత్తిడితోనే ఇన్నాళ్లుగా కోర్టు తీర్పు అమలు కావడం లేదనే ఆరోపణలున్నాయి. గత క లెక్టర్ టేబుల్‌పై నాలుగునెలల పాటు మగ్గిన ఫైల్‌పై నూతన కలెక్టర్ లోకేష్‌కుమారైనా స్పం దించాలని స్థానికులు కోరుతున్నారు.