
జగన్ పర్యటనకు అనుమతి
వరంగల్ క్రైం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వరంగల్ పర్యటనకు సంబంధించి పోలీసు శాఖ నుంచి అనుమతి లభించింది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ నాయకులు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. ఇటీవల వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం విదితమే.
ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈనెల 12న జగన్ జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆ పార్టీ నేతలు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, మునిగాల విలియమ్స్, మునిగాల కల్యాణ్‌రాజ్, ఎర్రంరెడ్డి మహిపాల్‌రెడ్డి, అప్పం కిషన్ వరంగల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝాను కలిసి అనుమతి తీసుకున్నారు.