సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా తగ్గింది. 2014-15 ఆర్థిక సంవత్సర ఆరంభంలోని ఏప్రిల్, మే నెలల్లో ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యంలో సగానికి మాత్రమే ఆదాయం లభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ. 4,766.79 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్‌లో రూ. 333.61 కోట్లను లక్ష్యంగా పెట్టుకోగా రూ.181.5 కోట్లు వచ్చింది. మే నెలలో రూ.357.44 కోట్లను లక్ష్యంగా పెట్టుకోగా రూ.183.73 కోట్లు మాత్రమే లభించింది.
జిల్లాల వారీగా లక్ష్యాలను పరిశీలిస్తే ఖమ్మం, ఆదిలాబాద్, రంగారెడ్డి, నల్లగొండల్లో ఆదాయం భారీగా పడిపోయింది. ఖమ్మం జిల్లాలో రూ.9.17 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం రూ. 4.36 కోట్లను మాత్రమే ఆర్జించింది. అలాగే ఆదిలాబాద్‌లో 58 శాతం, రంగారెడ్డి తూర్పులో 58 శాతం, నల్లగొండలో 52 శాతం తక్కువగా ఆదాయం నమోదైంది. రాష్ట్ర విభజనకు ముందుగా అమ్మకాలు, కొనుగోళ్లు స్తంభించిపోయాయని, అందుకే ఆదాయం తగ్గిపోయిందని అధికారులు చెబుతున్నారు. జూన్, జూలై నెలలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. ఈ రెండు నెలల్లోకూడా పరిస్థితి మెరుగుపడలేదని తెలుస్తోంది.
భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
Published Tue, Aug 5 2014 2:33 AM | Last Updated on Sun, Apr 7 2019 3:34 PM
Advertisement