⇒ ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పేపర్‌లో లోపాలపై ఈసీ విచారణ
⇒ పీడీఎఫ్ ఫైలు ఓపెన్ చేసి ఫొటోల మార్పిడి?
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పేపర్‌లో ఫొటోల తారుమారు వ్యూహా త్మకంగానే జరిగినట్లు తెలుస్తోంది. ప్రింటింగ్ ప్రెస్‌లోనే గుర్తు తెలియని వ్యక్తులు అధికారులు పంపిన పీడీఎఫ్ ఫైలును ఓపెన్ చేసి ఫొటోల మార్పిడికి పాల్పడినట్లు ఎన్నికల సంఘం ప్రాథమికంగా గుర్తించింది. హైదరా బాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ నియో జకవర్గానికి ఈ నెల 9న పోలింగ్ జరగాల్సిన ఎన్నికల్లో వినియోగించిన బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల ఫొటోలు తారుమారు కావడంతో ఎన్నికను రద్దు చేసిన ఈసీ.. ఈ నెల 19న రీపోలింగ్‌కు ఆదేశించింది. బ్యాలెట్ పత్రంలో ఉద్దేశపూర్వకంగా ఫొటోల మార్పిడి జరిగినట్లు భావి స్తోంది.
బ్యాలెట్ పేపర్ మొదటి ప్రూఫ్‌ను ఎన్నికల సంఘానికి పంపినపుడు అందులో 5 అక్షరదోషాలు గుర్తించి.. వాటిని సరిచేసి తిరిగి ముద్రణకు పంపించారు. ప్రింటింగ్ ప్రెస్ సిబ్బంది రెండో ప్రూఫ్‌లో అక్షరదోషాలను సరిదిద్దడమే కాకుండా పీడీఎఫ్‌లో ఫొటోలు కూడా మార్పి డి చేసి ధ్రువీకరణ కోసం ఎన్నికల అధికారులకు పం పారు. మొదటి ప్రూఫ్‌లో ఫొటోల్లో ఎలాంటి తప్పులు దొర్లలేదు కాబట్టి.. తొలుత గుర్తించిన అక్షర దోషాల మీద దృష్టి పెట్టి అంతా సవ్యంగానే ఉందని ఓకే చేశారు. దీంతో బ్యాలెట్ పేపర్ యథావిధిగా ప్రింటింగ్‌కు వెళ్లింది. ఎన్నికల అధికారులు పంపిన పీడీఎఫ్‌ను ఓపెన్ చేసే అధి కారం ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందికి ఉండదు.
ఇక్కడ మాత్రం పీడీఎఫ్ ఫైలును కూడా ఓపెన్ చేసినట్లు అధికా రులు గుర్తించారు. అత్యంత భద్రత కలిగిన ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లోకి సామాన్యులు రావడం అంత సులువు కాదు. అంటే ఇవి బయటకు వెళ్లినట్లు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. నిర్దిష్టంగా ఈ వ్యవహారంలో అక్రమా లకు పాల్పడిందెవరనే దానిపై దృష్టి సారించారు.
ప్రింటింగ్ ప్రెస్‌లోనే ఫొటోల తారుమారు
Published Tue, Mar 14 2017 5:06 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement