Printing Press
-
కర్నూలు ప్రెస్‌కు అరుదైన అవకాశం
కర్నూలు(సెంట్రల్): కర్నూలులోని ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణ కేంద్రం(రీజనల్ ప్రింటింగ్ ప్రెస్)కు అరుదైన అవకాశం లభించింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల ఎన్నికలకు సంబంధించిన సర్విస్ బ్యాలెట్ పేపర్లు, ఈవీఎంలపై అతికించే బ్యాలెట్ పేపర్లు, ఎన్నికలకు అవసరమైన ఇతర అన్ని రకాల పేపర్లను ఇక్కడే ముద్రిస్తున్నారు. విజయవాడలోని గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ పనిచేయకపోవడంతో ఈ ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల బ్యాలెట్ పేపర్లు, ఇతర పేపర్లను ముద్రించే బాధ్యతను కర్నూలు రీజనల్ ప్రింటింగ్ ప్రెస్‌కు అప్పగించారు. విజయవాడలో ప్రెస్ మూతబడటంతో... ప్రస్తుతం మన రాష్ట్రంలో కర్నూలు, విజయవాడలో మాత్రమే ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మె ల్యే, ఎంపీ ఎన్నికలకు సంబంధించి అవసరమైన అన్ని రకాల బ్యాలెట్లు, పేపర్లను ఈ ప్రెస్‌లలోనే ముద్రిస్తారు. గతంలో విజయవాడ ప్రింటింగ్ ప్రెస్‌లో కోస్తాంధ్రా, ఉత్తరాంధ్రలకు సంబంధించిన అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల బ్యాలెట్ పేపర్లను ముద్రించేవారు. కర్నూలులోని ఎన్ఆర్పేటలో ఉన్న రీజనల్ ప్రింటింగ్ ప్రెస్‌లో రాయలసీమ జిల్లాలకు సంబంధించిన బ్యాలెట్, ఇతర పేపర్లను ముద్రించేవారు. అయితే, ఇటీవల విజయవాడ ప్రింటింగ్ ప్రెస్ మూతపడటంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కర్నూలులోనే ముద్రిస్తున్నారు. ఈ మేరకు నామినేషన్ల ఉపసంహరణ తర్వా త 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి బరిలో ఉన్న అభ్యర్థులు, వారి గుర్తులతో కూడిన బ్యాలెట్ పేపర్ల ముద్రణ ముమ్మరంగా సాగుతోంది. సుమారు 150 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా 24 గంటలు పనిచేస్తూ సకాలంలో బ్యాలెట్లు, ఇతర పేపర్ల ముద్రణకు కృషి చేస్తున్నారు. -
ప్రింటింగ్ ప్రెస్ ఓనర్.. రోడ్డు పక్కన కర్రీస్ అమ్ముతూ ప్రత్యక్షం.. అసలేం జరిగింది!
కోవిడ్ మహమ్మారి దెబ్బకు లాక్డౌన్ విధించడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయినప్పటికీ కోట్లలో ప్రజలు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ఈ వైరస్ దాదాపు ప్రతి ఒక్కరి జీవితాలను మార్చేసిందనే చెప్పాలి. దీని ప్రభావంతో కొందరికి ఉద్యోగాలు కోల్పోగా.. మరికొన్ని సంస్థలు నష్టాల బాటలో నడవడంతో వ్యాపారాలను బంద్ చేయాల్సి వచ్చింది. ఇదే తరహాలో, గతంలో ప్రింటింగ్ ప్రెస్‌కు యజమానులుగా ఉన్న ఓ జంట లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ నడుపుకుంటూ జీవనం గడుపుతున్నారు. ఈ ఫోటోను ఫుడ్ బ్లాగర్ జతిన్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఉద్యోగం కన్నా వ్యాపారమే మిన్న ఓ జంట ఫరీదాబాద్‌లోని గేట్ నంబర్ 5 సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ కాలనీలో ఉన్న వారి స్టాల్లో నిలబడి కర్రీస్ అమ్ముతూ ఉంటారు. ఇంతలో ఓ వ్యక్తి ఆ జంట దగ్గరకీ వెళ్లి చూడగా వారిద్దరూ గతంలో ప్రింటింగ్ ప్రెస్ యజమానులు. షాకైన ఆ వ్యక్తి ఆ జంటను ఏం జరిగిందని అడగగా ఈ మేరకు సమాధానం వచ్చింది. "నేను ప్రింటింగ్ ప్రెస్‌ని నడిపేవాడిని, కానీ లాక్డౌన్ కారణంగా వ్యాపారం జరగలేదు. దీంతో ఆర్థికంగా చాలా వరకు నష్టపోయాను. రాను రాను ప్రెస్ నష్టాలు పెరుగుతూ పోయింది. దీంతో చేసేదేమి లేక ప్రెస్‌ను మూసేశాను. ఆ తర్వాత బతుకు బండి నడిపేందుకు కొంతకాలం ఉద్యోగం చేసాను. అయితే మా రోజువారీ ఖర్చులకు అవసరమైన డబ్బు ఉద్యోగం ద్వారా సంపాదించే జీతంతో సరిపోయేవి కావు. దీంతో ఉద్యోగం వదిలేసి ఏదైనా చిన్న వ్యాపారం చేయాలనుకున్నాను. నాకు, నా భార్యకు వంట చేయడం బాగా తెలుసు, అందుకే ఈ పుడ్ స్టాల్ పెట్టుకున్నాని తెలిపారు. ప్రస్తుతం వీరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆ జంటను అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Jatin singh (@foody_jsv) -
ఆర్కే జీవిత చరిత్రపై పుస్తకాల ముద్రణ
అంబర్‌పేట (హైదరాబాద్): మావోయిస్టు దివంగత అగ్ర నేత రామకృష్ణ (ఆర్కే) పేరుతో పుస్తకం ముద్రిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సదరు ప్రింటింగ్ ప్రెస్పై దాడి చేసి పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అంబర్‌పేట అలీకేఫ్ చౌరస్తా ప్రాంతంలో రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి నవ్య ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రింటింగ్ ప్రెస్‌లో రామకృష్ణ జీవితంపై పుస్తకం ముద్రిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేసి పుస్తకాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ పుస్తకాల్లో మావోయిస్టు భావజాలం ఉందని డీసీపీ వెల్లడించారు. పుస్తకాలు, ప్రింటింగ్ ప్లేట్లు, పెన్‌డ్రైవ్‌లను తీసుకెళ్లారు. ప్రింటింగ్ ప్రెస్ యజమాని రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, రామకృష్ణారెడ్డి పీవోడబ్ల్యూ నేత సంధ్య భర్త కావడం గమనార్హం. భర్త జ్ఞాపకాలతో పుస్తకం వేసుకుంటే తప్పా? ‘నా భర్త, కొడుకు ఇద్దరు చనిపోయారు. వారి జ్ఞాపకాలను ఒక పుస్తకం రూపంలో తెద్దాం అనుకున్నా. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకొచ్చా. ఈనెల 14న సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రామకృష్ణ సంస్మరణ సభ ఉంది. భర్త, కొడుకు జ్ఞాపకాలను పుస్తక రూపంలో తీసుకొస్తే తప్పేముంది. వీరి జ్ఞాపకాలు చాలా పత్రికల్లో వచ్చాయి కూడా. వాటినే పుస్తక రూపంలో తీసుకొస్తే దాన్ని తప్పుబట్టి పోలీసులు సీజ్ చేయడం దారుణం’అని ఆర్కే భార్య శిరీష వాపోయారు. -
ఎంసెట్ ‘ప్రశ్నపత్రం లీకేజీ’లో ట్విస్ట్
-
ఎంసెట్ కేసులో ఏ-1 ఎవరు?
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంలో కీలక వ్యక్తులు ఒక్కొక్కరు బయటకు వస్తున్న తీరు సీఐడీని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నాలుగు రోజుల క్రితం వరకు సాదాసీదా మాఫియా అని భావించగా.. తాజాగా కార్పొరేట్ విద్యా సంస్థలతో నేరుగా, పరోక్షంగా సంబంధాలు కలిగి ఉన్న వారు నిందితులుగా బయటపడటం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు తీరును బట్టి కీలక సూత్రదారి, ఏ1గా కమిలేశ్ కుమార్ సింగ్ అని భావించిన సీఐడీ, తాజాగా బయటపడ్డ పరిణామాలతో యూటర్న్ తీసుకుంది. కమిలేశ్ మృతి చెందడం, అతడు కాకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కేసులో కీలక నిందితులుగా ఉండటంతో ఏ1గా ఎవరిని చేర్చాలన్న దానిపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ఈ కేసులో కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందిన కీలక ఉద్యోగులు, వారి బంధువుల పాత్ర వెలుగులోకి వచ్చే అవకాశం ఉండటంతో సీఐడీ అన్ని కోణాల్లో విచారణ మొదలుపెట్టింది. ఇక్కడ ప్రశ్నలు.. అక్కడ ప్రింటింగ్ హైదరాబాద్ జేఎన్టీయూలో రూపొందించిన ప్రశ్నపత్రం ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీకైంది. ఈ ప్రశ్నపత్రం రూపొందించడానికి మూడు నెలల ముందు నుంచే ఓ మాఫియా ప్రతిక్షణం ప్రశ్నపత్రాన్ని ఫాలో అప్ చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ ప్రశ్నపత్రం రూపొందించడం పూర్తవడం, ప్రింటింగ్ ప్రెస్‌కు పలానా రోజు వస్తుందని తెలుసుకోవడం, ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసే అటెండర్ రావత్ దాన్ని బయటకు తేవడం వెనుక తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులే ఉన్నారని సీఐడీ తాజాగా> నిర్ధారణకు వచ్చింది. ప్రశ్నపత్రం, సంబంధిత వ్యవహారాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్న ఇక్కడి వ్యక్తులే దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్న కమిలేశ్ గ్యాంగ్‌కు పని అప్పగించి ఉంటారని సీఐడీ అనుమానిస్తోంది. జేఎన్టీయూ నుంచి ప్రశ్నపత్రానికి సంబంధించి వివరాలు వెల్లడించడానికి ఓ కార్పోరేట్ విద్యా సంస్థ భారీగా డబ్బులు ముట్టజెప్పిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు కార్పొరేట్ కాలేజీలకు విద్యార్థులను చేర్పించే బ్రోకర్‌గా పని చేస్తున్న వ్యక్తి డబ్బు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం కోసం సీఐడీ అన్వేషణ మొదలుపెట్టింది. ప్రశ్నపత్రం ఎవరికి అవసరం? ఇది అందుకున్న విద్యార్థులు ఏయే కళాశాలల్లో చదివారు? వారికి ప్రత్యేకంగా క్యాంపుల్లో శిక్షణ ఇచ్చిందెవరన్న కోణంలో దర్యాప్తు మొదలైంది. ఇక్బాల్.. కమిలేశ్.. ???.. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు ప్రాథమిక విచారణలో తేలిన అంశాల ఆధారంగా 2016లో ఏ1గా మహ్మద్ ఇక్బాల్ ఖాన్ అని భావించారు. కానీ అతడి అరెస్ట్ జరిగిన తర్వాత నిందితుల జాబితా పెరుగుతూ వచ్చింది. పాత్రధారులు, సూత్రధారులు, బ్రోకర్లు... ఇలా నిందితుల జాబితా 90కి చేరింది. దీనితో ముందుగా కేసులో ఉన్న వారందరిని అరెస్ట్ చేసి వారి వాంగ్మూలం తీసుకుని, దర్యాప్తులో వెలుగులోకి వచ్చే లింకుల ద్వారా ఏ1 నిందితుడిని గుర్తించాలని భావించారు. దీనికి తగ్గట్టుగానే 2017 ఏప్రిల్ 16న అరెస్టయిన శివబహుదూర్ సింగ్ అలియాస్ ఎస్బీసింగ్ లింకుతో ఏ1గా కమిలేశ్ అని నిర్ధారణకు వచ్చారు. కానీ కమిలేశ్ విచారణ, మృతి తర్వాత మరికొంత మందిని సీఐడీ అరెస్ట్ చేసింది. ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది. గత దర్యాప్తు అంశాలకు తాజా దర్యాప్తు పరిణామాలకు పొంతన లేకపోవడంతో సీఐడీ అధికారులు కంగుతిన్నారు. శ్రీచైతన్య కాలేజీ మాజీ డీన్, నారాయణ కాలేజ్ ఏజెంట్ అరెస్ట్ తర్వాత ప్రశ్నపత్రం లింకు మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచే బయటపడినట్టు తెలుసుకొని ఏ1 ఎవరన్న దానిపై విశ్లేషణ చేస్తున్నారు. మార్చుకోవచ్చు.. కేసు దర్యాప్తు తుది దశకు చేరే నాటికి కీలక నిందితుడు ఎవరో తేల్చి, చార్జిషీట్ సమయంలో ఏ1 నిందితుడి పేరుతో ఎఫ్ఐఆర్ సవరించుకునే అధికారం సంబంధిత దర్యాప్తు అధికారికి ఉంటుంది. ఇప్పుడు సీఐడీ కూడా అదే చేయబోతోంది. దాదాపు 100కు చేరువవుతున్న నిందితుల జాబితా వరుస క్రమాన్ని కూడా ఆధారాల ద్వారా ఓ క్రమపద్ధతికి తీసుకువచ్చి చార్జిషీట్ దాఖలు సమయంలో కోర్టుకు తెలపనుంది. ప్రింటింగ్ ప్రెస్‌లో ఆ పేపరే ఎలా? దేశవ్యాప్తంగా చాలా తక్కువ సంఖ్యలో సెక్యూరిటీ ప్రింటింగ్‌లకు అనుమతులుంటాయి. అందులో కొన్నింటికి కీలకమైన ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలకు టెండర్లు దాఖలు చేసి, ఆడిటింగ్ పూర్తి చేసిన తర్వాత ప్రింటింగ్ ఆర్డర్ ఇస్తారు. సంబంధిత ప్రింటింగ్ ప్రెస్‌లు చాలా పకడ్బందీగా, అత్యంత భద్రత నడుమ, సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటాయి. ఎంసెట్ ప్రశ్నపత్రం ప్రింటైన న్యూఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్న అటెండర్ రావత్ పెద్దగా చదువుకోలేదని సీఐడీ గుర్తించింది. మరి అలాంటి వ్యక్తి కేవలం తెలంగాణకు చెందిన ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాన్ని తీసుకువచ్చి నిందితులకు ఎలా ఇచ్చాడు? తెలుగు వ్యక్తులకు సంబంధం లేకుండా ప్రశ్నపత్రాన్ని అంత సులభంగా బయటకు ఎలా తెచ్చాడు? అనే దానిపై ఇప్పుడు సందేహాలు మొదలయ్యాయి. తొలుత రావత్‌కు ప్రశ్నపత్రం ఇచ్చిన వ్యక్తి, ఆ తర్వాత ఆదే ప్రశ్నపత్రాన్ని కమిలేశ్‌కు ఇచ్చి క్యాంపు నడపాలని చెప్పిన వ్యక్తి.. ఒకరేనని సీఐడీ అనుమానిస్తోంది. ఈ రెండు పనులు పూర్తి చేసిన వ్యక్తే కేసులో ఏ1గా ఉంటాని సీఐడీ ఉన్నతాధికారులు తేల్చిచెబుతున్నారు. ప్రశ్నపత్రం తయారీ, లీక్ కుట్ర, ప్రింటింగ్ ప్రెస్, పేపర్ బయటకు తేవడం, కమిలేశ్‌కు ఇవ్వడం.. ఇవన్నీ చేసింది ఒకరే కాబట్టి ఏ1గా సంబంధిత వ్యక్తే అవుతాడని న్యాయ సలహా సైతం సీఐడీ తీసుకుంది. -
నీలోఫర్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నాంపల్లిలోని నిలోఫర్ ఆస్పత్రి సమీపంలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి పక్కనే ఉన్న తులసి ప్రింటింగ్ ప్రెస్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. నీలోఫర్ ఆస్పత్రి ప్రహరీ గోడకి అనుకుని ఉన్న ఎస్ఎస్వీ ప్రింటర్స్తో పాటు మరో మూడు ప్రెస్‌లలో మంటలు వ్యాపించాయి. ఉదయం అయిదు గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ప్రింటింగ్ ప్రెస్‌లో ఉన్న యంత్రాలు, పేపర్లు పూర్తిగా దగ్దం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా పక్కనే నిలోఫర్‌లోని పిల్లల వార్డుతో పాటు పలు అపార్ట్మెంట్లు కూడా ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది గంటలోపే మంటలను అదుపులోకి తెచ్చారు. మరోవైపు దట్టమైన పొగలు అలుముకోవడంతో ఆస్పత్రిలో రోగులతో పాటు, అటెండర్లు ఆందోళన చెందారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా ఆస్పత్రి చుట్టూ ఉన్న మరి కొన్ని ప్రింటింగ్ ప్రెస్‌లలో ఫైర్ సేఫ్టీ నిబంధనలపై అధికారులు తనిఖీలు చేపట్టారు. ఒకవేళ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పక తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. -
నగరంపై 125 ఏళ్ల ముద్ర
సాక్షి, హైదరాబాద్: నాడు నిజాం సంస్థానంలో వేడుకలు జరిగితే ఆహ్వాన పత్రాలు ఎక్కడ ముద్రించే వారో తెలుసా..? నిజాం ఫర్మానాలు ఎక్కడ ప్రింట్ అయ్యేవో తెలుసా..? ఇప్పుడంటే ప్రింటింగ్‌లో కొత్తకొత్త టెక్నాలజీలు దూసుకొస్తున్నాయి.. మరి నాడు ఏ టెక్నాలజీ వాడారు? మన భాగ్యనగరంలో ప్రింటింగ్ శకం ఎప్పుడు మొదలైంది? సరిగ్గా 125 ఏళ్ల కిందట హైదరాబాద్‌లో తొలి ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభమైంది. దాని పేరు షమ్సుల్ ఇస్లాం ప్రెస్. 1892లో డిసెంబర్ నెలలో అప్పటి ప్రముఖ మార్కెట్ అయిన ఛత్తాబజార్‌లో దీన్ని ప్రారంభించారు. నేడు అదే ప్రాంతంలో ఒకటి కాదు రెండు కాదు.. 300కుపైగా ప్రింటింగ్ ప్రెస్‌లు ఏర్పాటయ్యాయి. ఇలా ఒకేచోట ఇన్ని ప్రింటింగ్ ప్రెస్‌లు ఉండటం, వాటి ద్వారా వేలాది మందికి ఉపాధి పొందడం దేశంలోనే కాదు ప్రపంచంలోనే మరెక్కడా లేదనడం అతిశయోక్తి కాదు! విజిటింగ్ కార్డు మొదలుకొని... వెడ్డింగ్ కార్డులు, బ్రోచర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, బ్యాడ్జీలు, ఐడెంటిటీ కార్డులు, కంపెనీలకు లోగోలు, పుస్తకాలు, క్యాలెండర్ల ప్రింటింగ్.. ఇలాంటి వాటన్నింటికీ ఛత్తాబజార్ చిరునామాగా మారింది. అఫ్జల్‌గంజ్ నుంచి చార్మినార్ వెళ్లే దారిలో మదీనా చౌరస్తాకు ఎడమ వైపున ఉన్న గల్లీలోకి ప్రవేశించగానే ఈ ప్రింటింగ్ ప్రపంచం స్వాగతం పలుకుతుంది. మాన్యువల్ స్క్రిప్ట్‌తో వస్తే చాలు తెలుగు, హిందీ, ఉర్దూ, అరబీతోపాటు ఇతర భాషల్లోకి అనువాదాల పని కూడా ఇట్టే పూర్తవుతుంది. ఇక్కడి ప్రింటింగ్ ప్రెస్‌లలో వార, పక్ష, మాస, దినపత్రికలు అచ్చువుతుండటం గమనార్హం. వేల కుటుంబాలకు జీవనోపాధి ఛత్తాబజార్ ప్రింటింగ్ ప్రెస్‌లలో దాదాపు 5 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వీరంతా ప్రింటింగ్, బైండింగ్, స్క్రీన్ ప్రింటింగ్ తదితర విభాగా ల్లో పని చేస్తున్నారు. ఇక్కడ కొంతకాలం పనినేర్చుకుంటున్న యువకులు తర్వాత తమ ప్రాంతాల్లో సొంతంగా ప్రింటింగ్ ప్రెస్‌లు ఏర్పాటు చేసుకుని తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. ఉర్దూ భాషలో ఛత్ అంటే పైకప్పు. ఇక్కడున్న కమాన్లపై ఛత్లు ఉన్నాయి. అలాగే పూర్వం ఇక్కడి చిన్నచిన్న దుకాణాలపైన గుడారాల్లాంటి కప్పులు ఉండేవట. దీంతో ఈ బజార్‌కు ఛత్తాబజార్ అని పేరొచ్చిందని చెబుతారు. షమ్సుల్ ఇస్లాం.. తొలి ప్రింటింగ్ ప్రెస్.. సరిగ్గా 125 ఏళ్ల కిందట షమ్సుల్ ఇస్లాం పేరిట నగరంలో తొలి ప్రింటింగ్ ప్రెస్ వెలిసింది. దీన్ని ప్రారంభించిన సయ్యద్ గౌసుద్దీన్.. ఆ రోజుల్లో కాతిబ్ ( క్యాలీగ్రాఫీ) రాసేవారు. నిజాం సంస్థానంలో వేడుకలు జరిగినప్పుడు ఆహ్వాన పత్రికలతోపాటు ఫర్మానాలు కూడా రాయించే వారు. రాయడానికి అవసరమైన కలం, ఇంక్‌లను కొనేందుకు తరచూ బొంబాయి వెళ్లేవారు. ఈ క్రమంలో అక్కడున్న ప్రెస్‌లను చూసి హైదరాబాద్‌లో 1892లో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశారు. తర్వాత ఇందులోనే నిజాం కార్యాలయానికి సంబంధించిన దాదాపు అన్ని దస్తావేజులు ముద్రించే వారు. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ వివాహ ఆహ్వాన పత్రాలను కూడా ఇక్కడే ముద్రించారు. మాదే తొలి ప్రెస్ 125 ఏళ్ల కిందట మా తాత ఈ ప్రెస్‌ను ప్రారంభించారు. ఆ రోజుల్లో ఆయన కాతిబ్ రాసేవారు. ముంబై నుంచి ప్రెస్‌కు సంబంధించిన మొత్తం సామగ్రి తెచ్చి దీన్ని ఏర్పాటు చేశారు. ఆయన తర్వాత మా నాన్న మీర్ ఖమురొద్దీన్ నడిపారు. ఇప్పుడు నేను ఈ ప్రెస్‌ను కొనసాగిస్తున్నా. – మీర్ అహ్మద్ అలీ, షమ్సుల్ ఇస్లాం ప్రెస్ ఇది లిథో ప్రింటింగ్ టెక్నాలజీ. చాలా పురాతన విధానం. ఇందులో తొలుత బటర్ పేపర్‌పై ప్రింట్ తీస్తారు. తర్వాత ఆ పేపర్‌ను ప్లేట్‌పై అతికించి ఇలా వేడి చేస్తే పేపర్‌పై ఆక్షరాలు ప్లేట్‌పై అచ్చవుతాయి. తర్వాత ప్లేట్‌ను మిషన్‌కు అనుసంధానించి ప్రింట్లు తీస్తారు. నగరంలో అచ్చయిన మొట్టమొదటి చార్మినార్ చిత్రం -
ప్రింటింగ్ ప్రెస్లోనే ఫొటోల తారుమారు
⇒ ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లో లోపాలపై ఈసీ విచారణ ⇒ పీడీఎఫ్ ఫైలు ఓపెన్ చేసి ఫొటోల మార్పిడి? సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లో ఫొటోల తారుమారు వ్యూహా త్మకంగానే జరిగినట్లు తెలుస్తోంది. ప్రింటింగ్ ప్రెస్లోనే గుర్తు తెలియని వ్యక్తులు అధికారులు పంపిన పీడీఎఫ్ ఫైలును ఓపెన్ చేసి ఫొటోల మార్పిడికి పాల్పడినట్లు ఎన్నికల సంఘం ప్రాథమికంగా గుర్తించింది. హైదరా బాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ నియో జకవర్గానికి ఈ నెల 9న పోలింగ్ జరగాల్సిన ఎన్నికల్లో వినియోగించిన బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల ఫొటోలు తారుమారు కావడంతో ఎన్నికను రద్దు చేసిన ఈసీ.. ఈ నెల 19న రీపోలింగ్‌కు ఆదేశించింది. బ్యాలెట్ పత్రంలో ఉద్దేశపూర్వకంగా ఫొటోల మార్పిడి జరిగినట్లు భావి స్తోంది. బ్యాలెట్ పేపర్ మొదటి ప్రూఫ్‌ను ఎన్నికల సంఘానికి పంపినపుడు అందులో 5 అక్షరదోషాలు గుర్తించి.. వాటిని సరిచేసి తిరిగి ముద్రణకు పంపించారు. ప్రింటింగ్ ప్రెస్ సిబ్బంది రెండో ప్రూఫ్‌లో అక్షరదోషాలను సరిదిద్దడమే కాకుండా పీడీఎఫ్‌లో ఫొటోలు కూడా మార్పి డి చేసి ధ్రువీకరణ కోసం ఎన్నికల అధికారులకు పం పారు. మొదటి ప్రూఫ్‌లో ఫొటోల్లో ఎలాంటి తప్పులు దొర్లలేదు కాబట్టి.. తొలుత గుర్తించిన అక్షర దోషాల మీద దృష్టి పెట్టి అంతా సవ్యంగానే ఉందని ఓకే చేశారు. దీంతో బ్యాలెట్ పేపర్ యథావిధిగా ప్రింటింగ్‌కు వెళ్లింది. ఎన్నికల అధికారులు పంపిన పీడీఎఫ్‌ను ఓపెన్ చేసే అధి కారం ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందికి ఉండదు. ఇక్కడ మాత్రం పీడీఎఫ్ ఫైలును కూడా ఓపెన్ చేసినట్లు అధికా రులు గుర్తించారు. అత్యంత భద్రత కలిగిన ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లోకి సామాన్యులు రావడం అంత సులువు కాదు. అంటే ఇవి బయటకు వెళ్లినట్లు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. నిర్దిష్టంగా ఈ వ్యవహారంలో అక్రమా లకు పాల్పడిందెవరనే దానిపై దృష్టి సారించారు. -
ఎంసెట్ స్కాంలో చార్జిషీట్..!
⇒ దాఖలుకు సిద్ధమవుతున్న సీఐడీ ⇒ ఇప్పటికీ చిక్కని కీలక నిందితులు ⇒ దొరికాక అనుబంధ చార్జిషీట్ దాఖలుకు యోచన సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంలో చార్జిషీట్ దాఖలు చేసేందుకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ప్రక్రియ ప్రారంభించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటివరకు సీఐడీ చేసిన దర్యాప్తులో మొత్తం 81 మంది బ్రోకర్లు ప్రశ్నపత్రం లీకేజ్‌లో పాత్ర వహించినట్టు వెలుగులోకి వచ్చింది. అదే విధంగా 56 మందిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. లీకేజ్‌కు సంబంధించి కోల్‌కతా, ముంబై, పుణే, ఢిల్లీ, షిరిడీ, కటక్, బెంగళూరుల్లో క్యాంపులు ఏర్పాటుచేసి విద్యార్థులకు రెండు సెట్ల ప్రశ్నపత్రాలపై శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రశ్నపత్రం విద్యార్థులకు అందించి ఆరు ప్రాంతాల్లో క్యాంపులు నడిపిన కీలక నిందితుడు కమిలేశ్ కుమార్‌సింగ్ సీఐడీ కస్టడీలో గుండెపోటుతో మృతి చెందాడు. ఇతడికి ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రం ఇచ్చింది ఎవరో సీఐడీ ఇప్పటికే గుర్తించినా అరెస్ట్ చేయలేకపోయింది. కమిలేశ్ మృతితో పంజాబ్‌కు చెందిన డ్రోంగీ అలియాస్ ఎస్పీ సింగ్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇతడితో పాటు మరో 8మంది బ్రోకర్లు పట్టుబడితే కేసు దర్యాప్తు పూర్తయినట్టే అని సీఐడీ భావిస్తోంది. అయితే ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై చార్జిషీట్ దాఖలు చేసి, తదుపరి నిందితులు దొరికిన తర్వాత అనుబంధ చార్జిషీట్ వేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
పట్టుపడకుండా నంబర్ల జంబ్లింగ్
శేఖర్‌రెడ్డి కరెన్సీ వ్యవహారంలో బ్యాంకు అధికారుల తెలివి ► కేసు విచారణకు వందమందితో బృందాన్ని ఏర్పాటు చేసిన సీబీఐ సాక్షి ప్రతినిధి, చెన్నై: కాంట్రాక్టర్‌గా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో చక్రం తిప్పిన శేఖర్‌రెడ్డి కేసును ఛేదించేందుకు వందమందితో కూడిన అధికారుల బృందాన్ని సీబీఐ నియమించింది. ప్రింటింగ్ ప్రెస్ నుంచి నేరుగా శేఖర్‌రెడ్డికి కోట్లాది రూపాయల కొత్త నోట్లు చేరేందుకు, నిందితులు పట్టుబడకుండా వరుస నంబర్ల జంబ్లింగ్ సలహా ఇచ్చి సహకరించిన బ్యాంకు అధికారులెవరో కనుగొనేందుకు ఈ బృందం పనిచేస్తోంది. చెన్నైలో స్థిరపడిన తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా కాట్పాడికి చెందిన శేఖర్‌రెడ్డి, ఆయన భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఈనెల 7న దాడులు జరపడం తెలిసిందే. చెన్నై, వేలూరు, కాట్పాడిల్లో జరిగిన సోదాల్లో రూ.170 కోట్ల నగదు, 177 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. (ప్రింటింగ్ ప్రెస్ నుంచే నేరుగా నగదు) పట్టుబడిన నగదులో రూ.70 కోట్లు కొత్త కరెన్సీ(రూ.2వేల నోట్లు) అని తెలుస్తోంది. చెన్నై బ్రోకర్ ద్వారా పాతనోట్లకు కొత్త కరెన్సీ పొందినట్లు శేఖర్ అంగీకరించారన్నారు. కరెన్సీ మార్పిడికి సహకరించారనే అనుమానంతో 50 మందిని విచారించారు. ఐటీ అధికారి ఒకరు మాట్లాడుతూ పట్టుబడిన సొమ్మంతా తనదేనని శేఖర్‌రెడ్డి అంగీకరించినందున తగిన పన్ను వసూలు చేయడం మినహా ఈ కేసులో తాము అంతకంటే ముందుకెళ్లలేమని చెప్పారు. ప్రింటింగ్ ప్రెస్ నుంచి కరెన్సీని రిజర్వు బ్యాంకుకు అప్పగించడం ఆనవాయితీ. అత్యవసర పరిస్థితుల్లో నేరుగా బ్యాంకులకూ పంపడం జరుగుతుందన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో కొత్త కరెన్సీని సమకూర్చడంలో అత్యవసర పరిస్థితులు తలెత్తగా దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు బ్యాంకు అధికారులు ప్రెస్ నుంచే వచ్చిన కరెన్సీని నేరుగా శేఖర్‌రెడ్డికి చేరవేసినట్లు నమ్ముతున్నామన్నారు. ఐటీ, విజిలెన్స్, సీబీఐ అధికారుల కళ్లు కప్పేందుకే కొత్త కరెన్సీ నంబర్లను తెలివిగా జంబ్లింగ్ చేసినట్లు తెలిపారు. -
ప్రింటింగ్ ప్రెస్ నుంచే నేరుగా నగదు
-
ప్రింటింగ్ ప్రెస్ నుంచే నేరుగా నగదు
విశాఖపట్టణం స్పెషల్ బ్రాంచ్ నుంచి శేఖర్‌రెడ్డికి సరఫరా సాక్షి ప్రతినిధి, చెన్నై: భారీ ఎత్తున నగదు, బంగారంతో పట్టుబడిన టీటీడీ పాలకమండలి సభ్యుడు శేఖర్‌రెడ్డికి ప్రింటింగ్ ప్రెస్ ద్వారానే కొత్త కరెన్సీ అందినట్లు తెలిసింది. ఇందుకు పది మంది అధికారులు ఆయనకు సహకరించినట్లు సమాచారం. శేఖర్‌రెడ్డి, కిరణ్‌రెడ్డి, ప్రేమ్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఇళ్లపై ఇటీవల ఐటీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించి రూ.161 కోట్ల నగదు, 179 కిలోల బంగారు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదులో రూ.2వేల నోట్లు రూ.34 కోట్లు కొత్త కరెన్సీ అని అధికారిక సమాచారం కాగా రూ.70 కోట్లుగా అనధికారిక సమాచారం. ఇంత భారీ మొత్తంలో శేఖర్‌రెడ్డికి ఎలా లభించిందని ఆశ్చర్యపోయిన అధికారులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. రూ.2వేల నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ నుంచే నేరుగా శేఖర్ రెడ్డికి అందినట్లు తేలింది. ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించిన నోట్లను రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)కు, అక్కడినుంచి ఇతర బ్యాంకులకు పంపిణీ జరగాలి. ఈ జాప్యాన్ని నివారించేందుకు ప్రింటింగ్ ప్రెస్ నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక శాఖ (స్కేప్)లకు పంపారు. స్కేప్‌గా పిలిచే ఈ శాఖలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్టణం, హైదరాబాద్‌లో ఉన్నాయి. ఈ శాఖలకు వచ్చిన కొత్త కరెన్సీని యథాతథంగా శేఖర్‌రెడ్డికి బదలాయించారు. దీన్ని ఇప్పుడు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.100 నోట్ల ప్రింటింగ్ నిలిపివేత...!
ఇంకో దారుణమైన విషయం ఏంటంటే.. కొత్త నోట్ల ప్రింటింగ్‌లో బిజీగా ఉన్న ప్రెస్‌లు రూ.100 నోట్ల ప్రింటింగ్‌ను నిలిపివేసినట్లు ఆర్బీఐ వర్గాలను ఉటంకిస్తూ... ‘బ్లూంబర్గ్’ పేర్కొంది. పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇప్పుడు ఇది నిజంగా మింగుడుపడని అంశమే. అరుుతే, నోట్ల రద్దుపై వార్తల్లో వస్తున్న ఈ అభిప్రాయాలు, అంచనాలను ఆర్థిక శాఖ అధికార ప్రతినిధి డీఎస్ మాలిక్ తోసిపుచ్చారు. ‘ఇది పూర్తిగా అవాస్తవం. త్వరలోనే పరిస్థితులు మెరుగుపడతారుు. రూ.500, 100 నోట్ల సరఫరా పెరిగి.. ఏటీఎంల రీ-కాలిబ్రేషన్ పూర్తరుుతే ఇప్పుడున్న ఇబ్బందులన్నీ చాలా వేగంగానే తొలగిపోతారుు’ అని ఆయన పేర్కొన్నారు. అరుుతే, అవసరానికి సరిపడా రూ.100 నోట్ల సరఫరా లేదని, కొరత ఉన్నట్లు ఆర్థిక శాఖకు చెందిన అధికారులు(పేరు వెల్లడించడానికి ఇష్టపడని) చెబుతున్నారు. కాగా, రెండు నెలల క్రితమే నోట్ల ప్రింటింగ్ మొదలైందని.. దీనివల్ల కరెన్సీ సరఫరా తగినంతగానే ఉందని ఆర్బీఐ గురువారం ఒక ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. -
న్యూఢిల్లీ నుండే ఎంసెట్-2 పేపర్ లీక్ !
-
కావలిలో ఉన్మాది కలకలం
► నలుగురిపై మారణాయుధాలతో ఆగంతకుడి దాడి ► మహిళ మృతి ► వృద్ధురాలి పాటు ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమం ► బాధితులంతా ఒకే కుటుంబ సభ్యులు కావలి అర్బన్ : ప్రశాంతతకు మారుపేరైన కావలి పట్టణం శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై ఓ మానవ మృ గం అత్యంత పాశవికంగా మారణాయుధాలతో దాడి చేయడం తీవ్రకలకలం సృష్టించింది. ఈ దాడిలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, వవృద్ధురాలితో పాటు ఇద్దరు చిన్నారులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసులు, స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు పట్టణంలోని పాతూరు రాజీవ్‌నగర్ అరటి తోటల ప్రాంతానికి చెందిన సిమిలి వెంకటేశ్వర్లురెడ్డి కుటుంబపై గుర్తుతెలియని వ్యక్తి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో దాడికి పాల్పడ్డాడు. వెంకటేశ్వర్లురెడ్డి, ఆయన తండ్రి నాగిరెడ్డి పట్టణంలోని వీడియో మిక్సింగ్ సెంటర్, ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణాల్లో పని చేస్తుండగా ఇంట్లో మహిళలు, చిన్నారులు మాత్రమే ఉన్నారు. ఇదే అదనుగా ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకుడు తొలుత వెంకటేశ్వర్లురెడ్డి తల్లి సుశీలమ్మ కంట్లో కారం చల్లి మారణాయుధాలతో దాడి చేశాడు. సుశీలమ్మ పెద్దగా కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న కోడలు కవిత (35), వెంకటేశ్వర్లురెడ్డి తమ్ముడి పిల్లలు దీక్షిత, వశిష్ట బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. వీరిపై కూడా మారణాయుధాలతో పాశవికంగా దాడి చేయడంతో కవిత అక్కడికక్కడే మృతి చెందింది. నలుగురు మృతి చెందారని భావించిన ఆగంతకుడు తాపీగా అక్కడి నుంచి పరారయ్యాడు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఇంటికి చేరుకున్న వెంకటేశ్వర్లు తండ్రి నాగిరెడ్డి జరిగిన ఘోరాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన ఊపిరితో ఉన్న సుశీలమ్మను, చిన్నారులను మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో నెల్లూరుకు తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. దాడి జరిగింది ఇలా... రాజీవ్‌నగర్ అరటితోట ప్రాంతంలో చివరగా ఉండే వెంకటేశ్వర్లురెడ్డి ఇంటికి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని వ్యక్తి వచ్చాడు. ఇంటి బయటే ఉన్న సుశీలమ్మను ఆధార్‌కార్డు కావాలంటూ మాటల్లోకి దించాడు. ఆధార్‌కార్డు ఎందుకు అంటూ సుశీలమ్మ ప్రశ్నిస్తుండటంతో కంట్లో కారం చల్లి వెంట తెచ్చుకున్న ఆయుధాలతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. సుశీలమ్మ పెద్దగా కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న కోడలు కవిత, వెంకటేశ్వర్లురెడ్డి తమ్ముడి పిల్లలు బయటకు పరుగెత్తుకుంటూ వచ్చారు. శివరాత్రి వేడుకలకు వచ్చి...దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారులు దీక్షిత, వశిష్ట వెంకటేశ్వర్లు రెడ్డి సోదరుడు జనార్దన్ రెడ్డి పిల్లలు. హైదరాబాద్‌లో టెలికాం డిపార్టమెంట్లో పనిచేసే జనార్దన్ రెడ్డి శివరాత్రి వేడుకల కోసమని పిల్లలిద్దరిని రెండు రోజుల కిత్రమే కావలికి తీసుకువచ్చి నానమ్మ వద్ద వదిలి వెళ్లాడు. అభంశుభం తెలియని ఈ పిల్లలిద్దరూ కూడా ఆగంతకుడి చేతిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అన్నీ అనుమానాలే... రాజీవ్‌నగర్ అరటి తోటల ప్రాంతంలో జరిగిన హత్యాకాండపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యలు చేసిన వ్యక్తి ముందుగా ప్రణాళిక వేసుకునే కారం, కత్తులు వెంట తెచ్చుకున్నట్లు తెలుస్తుంది. ముందుగా ఆ ప్రాంతంలో రెక్కీ వేసుకుని జనసంచారం తక్కువగా ఉన్న సమయంలో హత్యకు పాల్పడినట్లు సంఘటనా స్థలంలోని పరిస్థితుల ద్వారా అర్థమవుతుంది. జనవాసాలకు కొంచెం దూరంగా ఉండే ప్రాంతం కావడంతో హత్యల విషయం రెండు గంటల ఆలస్యంగా వెలుగు చూసింది. పాత కక్షలు లేదా అక్రమ సంబంధానికి సంబంధించిన వివాదమే హత్యలు కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. ఏఎస్పీ పరిశీలన : ఏఎస్పీ రెడ్డి గంగాధర్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌ను సంఘటనా స్థలానికి పిలిపించారు. పోలీసు కుక్కలు పట్టణంలోని పలు వీధులు తిరిగి డీఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న ట్రంకురోడ్డు వద్ద ఆగాయి. క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు. -
137 ఏళ్లలో తొలిసారి...
-
137 ఏళ్లలో తొలిసారి...
చెన్నై : తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ ప్రభావం తొలితరం దిన పత్రిక 'ది హిందు'పై కూడా పడింది. భారీ వర్షాల కారణంగా 'ది హిందు' ప్రింటింగ్ నిలిపివేసింది. 137 ఏళ్లలో 'ది హిందు' ప్రింటింగ్ నిలిపివేయడం ఇదే తొలిసారి. దీంతో తమిళనాడులో బుధవారం ది హిందు దిన పత్రిక వెలువడలేదు. ప్రింటింగ్ ప్రెస్ కు వర్కర్స్ రాలేకపోవడంతో పత్రికను నిలిపివేసినట్లు పబ్లిషర్ ఎన్ మురళి తెలిపారు. తమ ప్రింటింగ్ ప్రెస్ చెన్నైసిటీకి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో మరైమలై నగర్లో ఉందని, వర్షాల కారణంగా వర్కర్స్ అక్కడకు ఎవరూ చేరుకునే పరిస్థితి లేదన్నారు. ప్రింటింగ్ ప్రెస్ చాలా పెద్దది అయినందున తాము నగర శివారులో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాగా ది హిందు 1878లో ప్రారంభమైన విషయం తెలిసిందే. మరోవైపు టైమ్స్ ఆఫ్ ఇండియా, దక్కన్ క్రానికల్, న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రికలు యథావిధిగానే ప్రచురితం అయ్యాయి. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా చెన్నై విమానాశ్రయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. రన్ వే పైకి నీరు చేరటంతో ఎక్కడ విమానాలు అక్కడ నిలిచిపోయాయి. -
ప్రింటింగ్ ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం..
ప్రకాశం జిల్లా కంబం మండల కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడి లక్ష్మి ప్రింటింగ్ ప్రెస్ లో సోమవారం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోనికి తీసుకు వచ్చారు. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రమాదంలో సుమారు 7లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు తెలిపారు. -
పుస్తకాల్లేవ్.. చదువెలా!
నేటికీ పంపిణీ కాని పాఠ్యపుస్తకాలు విజయవాడ : ప్రింటింగ్ ప్రెస్‌ల ముద్రణలో తీవ్ర జాప్యం, అధికారుల మధ్య కొరవడిన సమన్వయం వెరసి విద్యార్థుల పాలిట శాపంగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు 20 రోజులు దాటినా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పూర్తిస్థాయిలో పంపిణీ కాలేదు. విద్యా సంవత్సరం ప్రారంభానికి వారం ముందే పాఠశాలలకు పుస్తకాలు చేరతాయని, జూన్ 15 నాటికల్లా వాటిని పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ ఆచరణలో అది జూలై 20 నాటికి కూడా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 3,340 ఉన్నాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులందరికీ పుస్తకాలను ప్రభుత్వమే పంపిణీ చేయాల్సి ఉంది. జిల్లాలో ఈ విధంగా 20 లక్షల 21 వేల 305 పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉండగా, దశలవారీగా పంపిణీ ప్రారంభించారు. రాష్ట్ర విభజనకు ముందు అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలు హైదరాబాద్‌లోని ప్రభుత్వ ముద్రణాలయంలో ప్రింట్ అయ్యి.. జిల్లాలోని మెయిన్ స్టోర్స్‌కు వచ్చేవి. వాటిని మండలాల వారీగా పోస్టల్ శాఖ ద్వారా సరఫరా చేసేవారు. విద్యా సంవత్సరం మొదలైన వారం రోజుల కల్లా పంపిణీ ప్రక్రియ పూర్తయ్యేది. ఈ ఏడాది రాష్ట్ర విభజనతో హైదరాబాద్ ముద్రణాలయం నుంచి పుస్తకాలు సరఫరా కాలేదు. దీంతో ప్రభుత్వం పుస్తకాల ప్రింటింగ్ బాధ్యతలను ఆరు జిల్లాల్లోని ప్రింటింగ్ ప్రెస్‌లకు అప్పగించి వాటి ద్వారా 13 జిల్లాలకు సరఫరా చేస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 20 లక్షల 21 వేల పుస్తకాలకు గాను 18 లక్షల 95 వేల 939 పుస్తకాలు విజయవాడ ఆటోనగర్‌లోని స్టోర్స్‌కు వచ్చాయి. వాటిలో ఇప్పటి వరకు 17 లక్షల 77 వేల 767 పుస్తకాలు పంపిణీ చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలకే ప్రాధాన్యం... మిగిలిన పుస్తకాల పంపిణీకి మరికొంత సమయం పట్టే అవకాశముంది. ప్రెస్‌ల నుంచి రావాల్సిన పుస్తకాలు ఆలస్యమవుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కావటంతో ప్రైవేట్ ప్రెస్‌లు వివిధ కార్పొరేట్ విద్యా సంస్థల పుస్తకాలు ముద్రణ చేసే బిజీలో ఉండి ప్రభుత్వ ఆర్డర్లను పక్కన పెడుతున్నాయి. కలెక్టర్ అసంతృప్తి...: శనివారం జిల్లా కలెక్టర్ బాబు.ఎ విజయవాడ ఆటోనగర్‌లో ఉన్న పుస్తకాల స్పోర్ట్స్‌ను పరిశీలించారు. పుస్తకాల పంపిణీ జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. విద్యాసంవత్సరం మొదలై 20 రోజులు దాటినా ఇంకా పంపిణీ చేయకపోవటమేమిటని జిల్లా విద్యాశాఖాధికారిని ప్రశ్నించారు. దీనిపై దృష్టి సారించి వెంటనే పుస్తకాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటర్ పుస్తకాలదీ అదే పరిస్థితి... ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియెట్ పుస్తకాలను కూడా ప్రభుత్వమే పంపిణీ చేస్తోంది. దీనిలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో రెండు లక్షల వరకు ఇంటర్మీడియెట్ పుస్తకాలు అవసరం కాగా, వాటిలో ఇప్పటి వరకు 60,647 పుస్తకాలు మాత్రమే అందాయి. మిగిలిన పుస్తకాలు దశలవారీగా అందనున్నాయి. -
జీడిమెట్లలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: జీడిమెట్లలోని ఒక ప్రింటింగ్ యూనిట్లో షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన కార్తికేయ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ప్రింటింగ్ ప్రెస్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. షార్ట్‌సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం సంభవించిందని నిర్వాహకుడు రామ్హ్రీమ్ తెలిపారు. సుమారు రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు ఆయన చెప్పారు. జనావాసాల మధ్య ఉన్న ఈ పరిశ్రమలో మంటలు చెలరేగడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. స్థానికులు స్పందించి మంటలు ఆర్పివేశారు. -
‘సమాచార దర్పణ్’ ఎవరి కాలంలో ప్రచురితమైంది?
భారత జాతీయోద్యంలో పత్రికల పాత్ర పత్రికలు భారత జాతీయోద్యమంలో కీలక పాత్రను పోషించాయి. మొగలుల కాలంలో ‘అక్బరాత్’, ‘వఖియనివాస్’ అనే పత్రికల ద్వారా వార్తా కథనాలను చక్రవర్తికి అందించేవారు. 1557లో పోర్చుగీస్ గవర్నర్ ఆల్ఫెన్సో కాలంలో గోవాలో పత్రికా ముద్రణను ప్రవేశపెట్టారు. మొదట్లో పాలకుల అభిప్రాయ వేదికలుగా గుర్తింపు పొందిన పత్రికలు ఆ తర్వాత సంఘ సంస్కరణ, సమాజహితం, నవభావన వేదికలుగా, అభ్యుదయ భావ వీచికలుగా, మితవాద, అతివాద, విప్లవవాద, గాంధీ సత్యాగ్రహం ఆలోచనా దీప్తులుగా పనిచేశాయి. సామాన్య ప్రజల్లో ఆలోచనా పరిజ్ఞానాన్ని మేల్కోలిపాయి. 1780లో జేమ్స్ అగస్టస్ హిక్కీ అనే ఆంగ్లేయుడు ‘బెంగాల్ గెజిట్’ అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించాడు. తర్వాత కలకత్తా సమీపంలోని ‘శేరంపూర్’లోని క్రైస్తవ మిషన ‘దిగ్దర్శన’(మాసపత్రిక), ‘సమాచార దర్శన’ అనే బెంగాలీ పత్రికలను స్థాపించింది. 1816లో ‘గంగాధర భట్టాచార్య’ ‘బెంగాల్ గెజిట్’ అనే పత్రికను ప్రారంభించారు. క్రైస్తవ మిషనరీ స్థాపించిన ‘ఫ్రెండ్ ఆఫ్ ఇండియా’ 1869లో సామ్యూల్ క్లర్క ప్రారంభించిన ‘స్టేట్స్‌మెన్’ అనే పత్రికలో విలీనమైంది. తర్వాత సామాజిక సంస్కరణలే ధ్యేయంగా రాజా రామ్మోహన్రాయ్ 1821లో ‘సంవాద కౌముది’ అనే వారపత్రికను స్థాపించి, సతీ సహగమన నిషేధం, బాల్య వివాహాల రద్దు, ఏకేశ్వరోపాసనల గురించి ప్రముఖంగా ప్రచారం చేశారు. రాయ్ ఆధునిక భావాలను వ్యతిరేకిస్తూ పోటీగా ‘రాధాకాంత్ దేవ్’ సనాతన సాంప్రదాయ వాదుల మద్దతుతో ‘సమాచార చంద్రిక’ను స్థాపించారు. దాంతో రాయ్ ద్వారకానాథ్ ఠాగూర్ సహాయంతో ఇంగ్లిష్, హిందీ, బెంగాలీ, పారశీక భాషల్లో, ఆధునిక భావాల ప్రచారం కోసం ‘వంగదూత’, ‘మిరాతుల్ అక్బర్’, ‘కువ్వత్ - ఉల్ - మువాహిద్దీన్’ లాంటి పత్రికలను ప్రారంభించారు. వీటిని పోలిన ‘జ్ఞానాన్వేషి’ అనే పత్రిక సమాజంలో విశేష ప్రాచుర్యం పొందింది. ప్రభుత్వ అధికారుల అవినీతి కార్యకలాపాలను విమర్శిస్తూ యువతరం పత్రిక ‘ఎన్‌క్వైరర్’ అభ్యుదయ భావాలను ప్రచారం చేసింది. ‘సంవాద పూర్ణ చంద్రోదయం’ అనే పత్రికలో సనాతన వాదులు మత విషయాలను చర్చించేవారు. తర్వాత దీనినే రాజకీయ దినపత్రికగా ప్రారంభించారు. బంకించంద్ర చటోపాధ్యాయ ‘నీలిదర్పణ్’ పత్రికను ప్రారంభించారు. దీనికి ‘దీనబంధుమిత్ర’ ఎడిటర్‌గా వ్యవహరించారు. నీలిమందు రైతుల సమస్యలను ఈ పత్రికలో వ్యాసాల రూపంలో ప్రముఖంగా ప్రస్తా వించేవారు. 1826లో కాన్పూర్ నుంచి వెలువడిన ‘ఉదాంత మార్తాండం’ అనే తొలి హిందీ పత్రిక పరిసర ప్రాంతాల ప్రజల సమస్యలను బ్రిటిష్ పాలకుల దృష్టికి తీసుకొచ్చింది. బొంబాయి రాష్ర్టంలో 1822లో దాదాభాయ్ నౌరోజీ నాయకత్వంలో ‘రస్త్గఫ్తార్’ అనే పత్రిక గుజరాతీ భాషలో వెలువడింది. 1832లో మరాఠీ భాషలో వెలువడిన ‘బొంబాయి దర్పణ్’ పత్రికలో ఆంగ్లభాష విశిష్టత, బ్రిటిషర్ల ప్రజా సంక్షేమ కార్యక్రమాలను బాలశాస్త్రి జంబేకర్ చర్చించారు. బాలశాస్త్రి అనుచరుడు ఛాల్ మహాజన్ ‘ప్రభువర్’ అనే పత్రికను స్థాపించి సంఘ సంస్కరణకు శ్రీకారం చుట్టారు. 1842లో పుణే నుంచి క్రైస్తవ మిషనరీలు ‘జ్ఞానోదయం’ అనే పత్రికను ప్రారంభించాయి. 1848లో పుణే నుంచే వెలువడిన ‘జ్ఞానప్రకాశీ’ తొలి మరాఠీ పత్రికగా ప్రసిద్ధి చెందింది. తిలక్, వాసుదేవ అగార్కర్‌లు కలిసి పుణే నుంచి 1881 లో ‘మరాఠీ’ (ఆంగ్లపత్రిక), ‘కేసరి’(మరాఠీ) పత్రికలను నిర్వహించి బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను నిశితంగా విమర్శించడమే కాకుండా, విప్లవ వాదులను సమర్థించినందుకు 1897లో 18 నెలలు జైలుశిక్ష అనుభవించారు. మద్రాస్ రాష్ర్టంలో గాజుల లక్ష్మీనరసుశెట్టి ‘క్రీసెంట్’ అనే పక్ష పత్రికలో బ్రిటిషర్ల దమన నీతిని విమర్శించారు. తర్వాత తెలుగులో వెలువడిన ‘వృత్తాంతిని’ (1838-51), ‘వర్తమాన’, ‘తరంగిణి’ (1848-52) పత్రికలు సామాజిక సమస్యలపై పోరాడాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1830లో బళ్లారి క్రైస్తవ మిషనరీ ‘సత్యదూత’ అనే తొలి తెలుగు పత్రికను ప్రారంభించింది. 1875 లో సుబ్రమణ్య అయ్యర్, కస్తూరి రంగన్ ఆధ్వర్యంలో వెలువడిన ‘ది హిందూ’ పత్రిక భారత జాతిని స్వాతంత్య్ర సమరానికి సన్నద్ధ్దం చేయడంలో కీలకపాత్ర పోషించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వెలు వడిన తొలి తెలుగు రాజకీయ పత్రిక ‘ఆంధ్రప్రకాశిక’, ‘స్వదేశీ మిత్రన్’ పత్రి కలు కూడా అదే బాటలో పయనించాయి. బిటిషర్ల పరిపాలనను సుస్థిరం చేయ డానికి అధికారేతర బ్రిటిషర్లు కొన్ని పత్రికలు స్థాపించారు. అలాంటి వాటిలో ‘ఫ్రెండ్ ఆఫ్ ఇండియా’, ‘సర్కార్’, ‘బాంబేటైమ్స్’, ‘మద్రాస్ యునెటైడ్ సర్వీస్ గెజిట్’, ‘లాహోర్ క్రానికల్’, ‘సిటీగడో’, ‘మద్రాస్ స్పెక్టేటర్’లు ముఖ్య మైనవి. ఈ పత్రికలు బ్రిటిష్ పాలనకు అనుకూల వాతావరణాన్ని కల్పించేలా భారతీయ సమాజాన్ని ఉత్తేజ పరుస్తూ రచనలు సాగించాయి. ఈ పద్ధతిని ‘పత్రికా స్వేచ్ఛపిత’గా ప్రసిద్ది చెందిన మెట్కాఫ్ నిరసించాడంటే వాటి ధోరణిని అర్థం చేసుకోవచ్చు. ఈ పత్రికలు బ్రిటిష్ సామ్రాజ్య తత్వాన్ని ప్రచారం చేశాయి. 1861లో బొంబాయి నుంచి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’, 1865లో అలహాబాద్ నుంచి ‘పయనీర్’, 1868లో మద్రాస్ నుంచి ‘మద్రాస్ మెయిల్’ (ఇది దేశంలో తొలి సాయంకాలం పత్రిక), లాహోర్ నుంచి ‘సివిల్ మిలటరీ గెజిట్’లు ఈ కాలంలో వచ్చిన మరికొన్ని ముఖ్యమైన పత్రికలు. తర్వాత కాలంలో బెంగాల్ నుంచి నరేంద్రనాథ్ ఆధ్వర్యంలో వెలువడిన ‘ఇండియన్ మిర్రర్’ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా, భారతీయుల రాజకీయ హక్కుల కోసం పోరాటం సాగించింది. 1868లో శిశిర్‌కుమార్ ఘోష్ ఆధ్వర్యంలో ‘అమృతబజార్ ’ , ‘సమాచార దర్పణ్’ పత్రికలు బ్రిటిషర్ల ఆర్థిక దోపిడీని విమర్శించాయి. ‘సంధ్య, యుగాంతర్, బందీ జీవన్, ఘదర్’ లాంటి పత్రికలు బ్రిటిష్ సామ్రాజ్య సౌధాలను పునాదులతో సహా పెకిలించాలని, అందుకు సాయుధ తిరుగుబాటుకుభారతీయులు సన్నద్ధం కావాలని ప్రేరేపించాయి. పార్శీ, ఉర్దూ పత్రికలైన ‘మహెఆలం’, ‘అఫ్రోజ్’, గోఖలే ఆధ్వర్యంలో వెలువడిన ‘సుధాకర్’ పత్రికలు ప్రజా హక్కుల పరిరక్షణ, మితవాద ధోరణిని ప్రతిబింబించగా ‘ఇండియన్ మిర్రర్’, ‘వాయిస్ ఆఫ్ ఇండియా’; అరబిందో ఘోష్, రాస్ బిహారీ ఘోష్‌ల పెట్రియాట్, హిందూప్రకాష్, సోంప్రకాష్ పత్రికలు జాతీయతను రగిలించాయి. 1878లో లార్డ లిట్టన్ ప్రాంతీయ భాష పత్రికా చట్టాన్ని ప్రవేశపెట్టి స్వేచ్ఛను హరించాడు. 1882లో రిప్పన్ దేశీయభాషా చట్టాన్ని రద్దు చేసి పత్రికలకు స్వేచ్ఛ కలిగించాడు. ఉర్దూలో షంగుల్ అక్బర్, జుంబాల్ ఉల్ అక్బర్, సిరాజ్ - ఉల్ అక్బర్, ఢిల్లీ అక్బర్, సయ్యద్ అక్బర్ పత్రికలు సాంఘిక, మత పునరుజ్జీవానికి కృషి చేశాయి. మిరాతుల్ అక్బర్, జియ జహనామా పత్రికలు హిందూ - ముస్లింల సమైక్యతకు కృషి చేశాయి. తెలుగులో కందుకూరి వీరేశలింగం ‘వివేకవర్ధిని, సత్య సంవర్ధిని, సతీహిత బోధిని’ పత్రికలను ప్రారంభించి ‘ఆధునిక ఆంధ్రదేశపిత’గా పేరు గాంచారు. రాయస వేంకటశివుడి ‘జనానా, ‘సుజన మనోవిలాసిని’, అమృతబోధిని’ పత్రికలు సాంఘిక దురాచారాలపై ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రాలు. తెలంగాణలో ‘గోల్కొండ’ (సురవరం ప్రతాపరెడ్డి ఎడిటర్), ‘మిజాన్’, ‘నీలగిరి’ , షోయబుల్లాఖాన్ ‘ఇమ్రోజ్’ పత్రికలు నాటి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాయి. భారతీయ పత్రికలు 1823లో ఆడమ్స్ ఆంక్షల నుంచి లిట్టన్ ప్రతిబంధకాల వరకు సమస్యలన్నింటినీ అధిగమించి భారత స్వాతంత్య్ర సాధనలో బహుముఖ పాత్రను పోషించాయి. మాదిరి ప్రశ్నలు 1. వీటిలో సరికానిది? (2002 సివిల్స్) 1) సమాచర దర్పణ్ - మార్సమన్ 2) మిరాతుల్ అక్బర్- రామ్మోహన్ రాయ్ 3) స్వదేశీ మిత్రన్ - సుబ్రమణ్యం 4) నీల్ దర్పణ్ - శిశిర్ కుమార్ ఘోష్ 2. భారతదేశంలో పత్రికా ముద్రణాయం త్రాన్ని ప్రవేశపెట్టినవారు? 1) బ్రిటిషర్లు 2) పోర్చుగీస్ 3) డచ్చి 4) ఫ్రెంచివారు 3. దేశంలో తొలి ‘సాయంకాలపు పత్రిక’ ఏది? 1) బొంబాయి క్రానికల్ 2) మద్రాస్ క్రానికల్ 3) మద్రాస్ మెయిల్ 4) బెంగాల్ గెజిట్ 4. ‘ది హిందూ’ (1875) పత్రిక ఎడిటర్లుగా పనిచేసిన వారు? 1) సుబ్రమణ్యం అయ్యర్, పద్మనాభన్ పిళ్లై 2) కస్తూరీ రంగన్ - సుబ్రమణ్యం 3) కస్తూరీ రంగన్ - పద్మనాభన్ 4) పద్మనాభన్ - రాజమార్తాండ 5. ‘బెంగాలీ విభజనను’ తొలిసారిగా ప్రచురించిన పత్రిక ఏది? 1) బెంగాల్ గెజిట్ 2) నీల్ దర్పణ్ 3) ఇండియన్ హెరాల్డ్ 4) అమృతబజార్ 6. ‘సమాచార దర్పణ్’ పత్రిక ఎవరి కాలంలో ప్రచురితమైంది? 1) లార్డ కర్జన్ 2) విలియం బెంటింగ్ 3) లార్డమింటో 4) వారన్ హేస్టింగ్స 7. కిందివాటిలో సరైన జత? 1) దీన్ మిత్ర - ముకుంద్‌రావు పాటిల్ 2) సత్య దూత - గంగాధర భట్టాచార్య 3) సమాచార చంద్రిక - రాజా రామ్మోహన్ రాయ్ 4) బొంబాయి దర్పణ్ - చాల్మహాజన్ 8. నీలిమందు రైతుల సమస్యలను వివరించిన పత్రిక ఏది? 1) నీల్ దర్పణ్ 2) ఉదాంత మార్తాండం 3) జ్ఞానోదయం 4) పైవన్నీ సమాధానాలు 1) 4; 2) 2; 3) 3; 4) 2; 5) 4; 6) 4; 7) 1; 8) 1. -
అరె కరెంటు రాదే !
సాక్షి,సిటీబ్యూరో: ఓ వైపు ఉక్కపోత..మరోవైపు ఇష్టానుసారం కరెంటు తీస్తుండడంతో గత కొద్దిరోజులుగా నగరవాసులు నానాయాతన పడుతున్నారు. ప్రస్తుతం గ్రేటర్లో అధికారిక విద్యుత్తు కోతలు లేనప్పటికీ...ఎమర్జెన్సీ లోడ్‌రిలీఫ్ పేరుతో పగలు,రాత్రి తేడాలేకుండా కరెంటు తీస్తున్నారు. కనీసం ముందస్తు సమాచారం లేకుండా కోర్‌సిటీలో మూడుగంటలు, శివారులో నాలుగు నుంచి ఐదుగంటలపాటు సరఫరా నిలిపివేస్తుండడంతో నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అస్సలు కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరి స్థితి ఉందని వాపోతున్నారు. కోతలతో గృహాలు..వాణిజ్య సముదాయాలు..పరిశ్రమలే కాదు...ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, సినిమాహాళ్లు, పెట్రోలుబంకులు, ట్రాఫిక్ సిగ్నళ్లు, ఐస్క్రీమ్పార్లర్లు, బేకరీలు, చివరకు సెలూన్లు కూడా ఢ‘మాల్’అంటున్నాయి. కోతల వల్ల మోటార్లు పనిచేయకపోవడంతో మంచినీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జిరాక్స్ సెంటర్లు, ప్రింటింగ్ ప్రెస్‌ల ఆదాయానికి గండిపడుతోంది. ఈసేవా కేంద్రాల్లో కరెంట్ లేకపోవడంతో సర్కారుకు వచ్చే ఆదాయం ఆలస్యమవుతోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోతుండగా, బ్యాంకుల్లో సేవలు స్తంభించిపోతున్నాయి. కోతల వల్ల డీజిల్, పెట్రోలు అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. డిమాండ్‌కు సరఫరాకు మధ్య భారీ వత్యాసం ఉంటుండడంతో కరెంటు కోతలు అనివార్యమవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలకు ఒక్కసారిగా డిమాండ్ పెరుగుతుండటంతో సబ్స్టేషన్లపై భారం పడకుండా ఉండేందుకు ఎమర్జెన్సీలోడ్ రిలీఫ్‌ల పేరుతో ఇష్టం వచ్చినట్లు కరెంటు తీసేస్తున్నారు. పరిశ్రమలకు వాత: ప్రస్తుతం గ్రేటర్‌లోని పరిశ్రమలకు పవర్‌హాలీడే అమల్లో లేకున్నా కాటేదాన్, గగన్‌పహాడ్ పారిశ్రామికవాడల్లో 12 గంటలపాటు సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో ఉత్పత్తి నిలిచి యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
తారుమారు
హైదరాబాద్ లోక్‌సభ ఈవీఎంలలో మల్కాజిగిరి బ్యాలెట్ పత్రాలు ఎన్నికల అధికారి పరిశీలనలో వెల్లడి విచారణకు ఆదేశం అర్ధరాత్రి వరకు ఈవీఎంల పునఃపరిశీలన సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. వివిధ లోక్‌సభ నియోజకవర్గాల కోసం ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించిన బ్యాలెట్ పత్రాలు (ఈవీఎంలలో అమర్చేవి) ఈవీఎంలలోకి వచ్చేసరికి మారిపోయాయి. బుధవారం మాసబ్‌ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర ్వహించిన ఈవీఎం ర్యాండమైజేషన్ కార్యక్రమంలో ఒక ఈవీఎంను పరిశీలించిన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి సోమేశ్‌కుమార్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థుల జాబితాతో ఉండాల్సిన బ్యాలెట్ పత్రం స్థానంలో మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థుల పేర్లతో కూడిన బ్యాలెట్ పత్రం ఉండటమే ఇందుకు కారణం. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని బహదూర్‌ఫుర అసెంబ్లీ నియోజకవర్గంలో వినియోగించాల్సిన దాదాపు 21 ఈవీఎంలలో ఇదే పరిస్థితి. మల్కాజిగిరి లోక్‌సభకు సంబంధించిన సుమారు 1000 బ్యాలెట్ పత్రాలు హైదరాబాద్ లోక్‌సభకు వచ్చాయని తెలిసింది. షాక్ నుంచి తేరుకున ్న ఎన్నికల అధికారి సోమేశ్‌కుమార్ జరిగిన సంఘటనపై విచారణకు ఆదేశించారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ పనులకు ఇన్చార్జిగా ఉన్న స్పెషల్ కమిషనర్ రాహుల్ బొజ్జాపై సీరియస్ అయ్యారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. ఇదిలా ఉంటే.. బ్యాలెట్ పత్రాలను కనీసం పరిశీలించకుండా ఈవీఎంలలో అమర్చిన బహదూర్‌పుర అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మాసుమ బేగంపై హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీసీఎల్ఏ, యూఎల్సీ నుంచి 26మంది డిప్యూటీ కలెక్టర్లను పిలిపించి అన్ని లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను తనిఖీ చేయిం చారు. ఆయా పోలింగ్ స్టేషన్లకు సంబంధించి బ్యాలెట్ యూనిట్ నెంబరు, కంట్రోల్ యూనిట్ నెంబరు సరిపోలుతున్నాయా.. లేదా?, ఈవీఎంలలో అమర్చిన బ్యాలెట్ పత్రం అదే అసెంబ్లీ/లోక్‌సభ నియోజకవర్గానిదా.. కాదా?, ఈవీఎంలకు తగిలించిన ట్యాగ్లలో పోలింగ్ స్టేషన్ అడ్రస్ సరిగా ఉందా..లేదా?..తదితర అం శాలను క్షుణ్ణంగా పరిశీలించాలని డిప్యూటీ కలె క్టర్లను ఆదేశించారు. అర్ధరాత్రి వరకు ఈ కార్యక్రమం కొనసాగినట్లు సమాచారం. -
ప్రింటింగ్ ప్రెస్లూ.. జర భద్రం!
పూండి, న్యూస్‌లైన్: నిబంధనలు పాటించని ప్రింటింగ్ ప్రెస్‌లపై ఎన్నికల అధికార్లు కొరడా ఝులిపించనున్నారు. ఇప్పటికే పలాస నియోజిక వర్గంలో ప్రిం టింగ్ ప్రెస్‌ల వివరాలు నమోదు చేసుకున్న అధికారులు వీటిపై నిఘా వేశారు. కరపత్రాలు, పోస్టర్లను ముద్రించేటపుడు పబ్లిషర్ వివరాలు, ప్రతుల సంఖ్య తప్పని సరిగా ముద్రించాల్సి ఉంది. పబ్లిషర్ నుంచి 127 ఎ(2) ప్రకారం అపెండిక్స్ ఎ, బి ఫారాల్లో డిక్లరేషన్ సైతం పొందాలి. ఈ ఫారాలతో పాటు ముద్రించిన కరపత్రాలు, పోస్టర్ల ప్రతులను రిటర్నింగ్ అధికారులకు ఇవ్వాలి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రెస్ యజమానులకు నోటీసులు జరీ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించేందుకు ఎన్నికల అధికారులకు అవకాశం ఉంది. -
అడ్డగోలుగా అచ్చేశారు
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: అడిగేవారు లేని డ్వామా అధికారులు ఇచ్చిమొచ్చినట్లు ప్రభుత్వ నిధులను ఖర్చు చేస్తున్నారు. నిబంధనలకు పాతరేసి లక్షలాది రూపాయల విలువైన ప్రింటింగ్ పనులను అనుమతి ఇచ్చేస్తున్నారు. తాము తక్కువ ధరకే ప్రింటింగ్ చేస్తామంటూ కొందరు ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ముందుకొచ్చిన అవేమీ పట్టించుకోవడం లేదు. టెండర్లు పిలవకుండానే రూ.ఐదు లక్షల విలువచేసే ప్రింటింగ్ పనులు అనుమతులివ్వడం చర్చనీయాంశంగా మారింది.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులపై గ్రామ సర్పంచ్‌లు, మహిళా సమాఖ్యలు, శ్రమశక్తిసంఘాల సభ్యులకు అవగాహన కల్పించేందుకు అవసరమైన కరపత్రాలు, బ్యానర్లను ప్రింటింగ్ చేయించారు. ఇందుకోసం గతనెల 22తేదీన రాష్ట్రస్థాయి అధికారుల నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే ఉపాధి పనులకు సంబంధించి బడ్జెట్ రూపొందించే విధానాలపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చే యడానికి అక్టోబర్ 31న సర్పంచ్‌లతో సమావేశం నిర్వహించారు. నవంబర్ నెల మొత్తం గ్రామాలకు వెళ్లి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏయే పనులు అవసరమో గుర్తించి క్యాలెండర్‌ను రూపొందించేందుకు సమావేశాలు నిర్వహించాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. అందుకు అవసరమైన విస్తృతప్రచారం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రచార సామగ్రిని టెండర్లు పిలువకుండానే ప్రింటింగ్ చేయించారు. బ్యానర్లను తయారు చేయించేందుకు పట్టణంలోని నాలుగు డిజిటల్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి కొటేషన్లు తీసుకున్నారు. ఈ నాలుగు కూడా బినామీపేర్లతో కొటేషన్లు తీసుకుని బ్యానర్ల కోసమే రూ.3,56,400 ఖర్చుచేసి ఒకే ప్రింటింగ్ ప్రెస్‌లో తయారు చేయించారు. నిబంధనలకు నీళ్లు! 6x4 సైజు కలిగిన బ్యానర్ల తయారీ కోసం ఒక్కో చదరపు గజానికి రూ.9 చొప్పున బిల్లులు చెల్లించారు. ఇదిలాఉండగా అత్యవసరమైతే కనీసం పర్చేస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయాలు తీసుకుని ప్రింటింగ్ చేయించాల్సి ఉన్నా అలాంటి ప్రయత్నమేమీ చేయలేదు. టెండర్లు పిలిచి పనులు అప్పగించి ఉంటే అవకతవకలు జరగడానికి అవకాశం లేకుండా ఉండేదని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా 6ఁ4, 6ఁ12 సైజుతో తయారుచేసిన బ్యానర్లకు ఒకే ధర నిర్ణయించడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరపత్రాల విషయానికొస్తే ఒకే వ్యక్తి బినామీ పేర్లతో మూడు వేర్వేరు ప్రింటింగ్ ప్రెస్‌ల పేరుతో కొటేషన్ తీసుకుని కరపత్రాల ముద్రణ పనులు అప్పగించారు. ఉపాధి పనులు తెలియజేసే కలర్, బ్లాక్ అండ్ వైట్ (ఏ 4 సైజ్) కరపత్రాలు ప్రింటింగ్ చేయించారు. ఇందులో బ్లాక్ అండ్ వైట్‌కు సంబంధించిన కరపత్రాలు వెయ్యికి రూ. 459 చొప్పున 1.75లక్షల కరపత్రాలకు మొత్తం రూ.80325 చెల్లించారు. అదేవిధంగా 25వేల కలర్ ప్రింటింగ్ కరపత్రాలు వెయ్యికి రూ. 666 చొప్పున రూ.16,650కు అనుమతులిచ్చారు. గతనెలలో 2.20 లక్షల కరపత్రాల ప్రింటింగ్ కోసం సాక్షర భారత్ అధికారులు పర్చేస్ కమిటీ అనుమతితో టెండర్లు నిర్వహించి ఏ4 సైజు వెయ్యి కరపత్రాలకు రూ.238 ప్రకారం చెల్లించగా, డ్వామా అధికారులు మాత్రం ఎక్కువరేట్లకు అనుమతులివ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. అత్యవసరంతోనే టెండర్లు పిలువలేకపోయాం కరపత్రాలు, బ్యానర్లు అత్యవసరం కావడంతో టెండర్లు పిలువకుండా ప్రింటిం గ్ పనులు చేయించాం. ఇందులో ఎ లాంటి అవినీతి జరగడానికి ఆస్కారం లేదు. తదుపరి చేపట్టే ఎలాంటి పనులనైనా టెండర్ ద్వారానే చేపడతాం. - విద్యాశంకర్, డ్వామా పీడీ అధిక రేట్లకు పనులు అప్పగించారు టెండర్లు పిలువకుండా కరపత్రాల ముద్రణకు అధికరేట్లకు అప్పగించారు. ఎక్కువ రేటు చెల్లిస్తున్నారనే విషయాన్ని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. టెం డర్లు పిలిచి తక్కువ ధర ముద్రణకు ఎవరు ముందుకొచ్చి ఉంటే వారికి పనులు అప్పగించి ఉంటే బాగుండేది. - యాదయ్య, మైత్రి ప్రింటింగ్ ప్రెస్ యాజమాని