ప్రింటింగ్ ప్రెస్‌లూ.. జర భద్రం!
Published Thu, Mar 13 2014 3:03 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM
పూండి, న్యూస్‌లైన్: నిబంధనలు పాటించని ప్రింటింగ్ ప్రెస్‌లపై ఎన్నికల అధికార్లు కొరడా ఝులిపించనున్నారు. ఇప్పటికే పలాస నియోజిక వర్గంలో ప్రిం టింగ్ ప్రెస్‌ల వివరాలు నమోదు చేసుకున్న అధికారులు వీటిపై నిఘా వేశారు. కరపత్రాలు, పోస్టర్లను ముద్రించేటపుడు పబ్లిషర్ వివరాలు, ప్రతుల సంఖ్య తప్పని సరిగా ముద్రించాల్సి ఉంది. పబ్లిషర్ నుంచి 127 ఎ(2) ప్రకారం అపెండిక్స్ ఎ, బి ఫారాల్లో డిక్లరేషన్ సైతం పొందాలి. ఈ ఫారాలతో పాటు ముద్రించిన కరపత్రాలు, పోస్టర్ల ప్రతులను రిటర్నింగ్ అధికారులకు ఇవ్వాలి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రెస్ యజమానులకు నోటీసులు జరీ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించేందుకు ఎన్నికల అధికారులకు అవకాశం ఉంది.
Advertisement