బీపీ పరీక్ష చేయించుకుంటున్న ఎస్పీ
ఆదిలాబాద్: పోలీసులు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ ఉంటేనే విధుల్లో మానసికంగా, శారీరకంగా రాణిస్తారని ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసులకు సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన యశోద ఆస్పత్రి వైద్యులు ఆదిలాబాద్ డివిజన్ పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేశారు.
ఎస్పీ సైతం రక్త పరీక్షలు, బీపీ చెక్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అనుకోని సంఘటనలతో ప్రమాదాలు జరిగినా.. వాటిని తట్టుకొని నిలబడే శక్తి సామార్థ్యాలు ఉండాలంటే శారీరకంగా, మానసికంగా పోలీసులు బలంగా ఉండాలన్నారు. త్వరలో 40ఏళ్లు పూర్తి చేసుకున్న పోలీసులకు హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో అత్యాధునిక పరికరాలతో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్యాకెజ్ తరహాలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉట్నూర్ డివిజన్ పోలీసులకు మంగళవారం ఉట్నూర్ పోలీసుస్టేషన్‌లో వైద్య శిబిరం ఉంటుందన్నారు. కార్యక్రమంలో పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు ఎస్‌కె తాజోద్ధిన్, ప్రతినిధులు పోలీసు డాక్టర్ గంగారాం, యశోద ఆస్పత్రి వైద్యులు నాగూర్, సోని, జ్యోతి, శ్రీకాంత్, రాజు, ఆర్‌ఐలు సుధాకర్‌రావు, వామనమూర్తి, జి.రమేశ్, ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహారెడ్డి, రూరల్ సీఐ ప్రదీప్‌కుమార్, సీసీ దుర్గం శ్రీనివాస్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment