సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు విచక్షణారహితంగా చేస్తున్న హామీలకు ఆయా పార్టీలను బాధ్యులను చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వాజ్యం (పిల్) దాఖలైంది. సుబ్రమణ్యం బాలాజీ–తమిళనాడు ప్రభుత్వాల మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల్ని అమలుకు ఉత్తర్వులు జారీ చేయాలని చార్టర్డ్æ అకౌంటెంట్ ఎం.నారాయణాచార్యులు దాఖలు చేసిన పిల్‌లో హైకోర్టును అభ్యర్థించారు. అధికారమే పరమావధిగా పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసే హామీలు ఇస్తున్నాయని, పార్టీలిచ్చే హామీలపై పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే వరకూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. ఈ పిల్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని మంగళవా రం న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనాన్ని కోరారు.
అయితే ఇప్పటికిప్పుడే విచారణ చేపట్టలేమని, గురువారం (8న) విచారించే అంశాన్ని ప్రధాన న్యాయమూర్తితో కూడి న ధర్మాసనం నిర్ణయం తీసుకుంటుందని న్యాయ మూర్తులు తెలిపారు. ‘హామీల అమలుకు ఆదర్శ ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) ఉంది. మేనిఫెస్టో అమలుకు ఎంసీసీని ఎవరూ అమలు చేయడం లేదు. అధికారమే పరమావధిగా పదవీ వ్యామోహంతో పార్టీలు ఇష్టారీతిన హామీలు ఇచ్చేస్తున్నాయి. ఆర్థికంగా ప్రభుత్వ పరిస్థితుల గురించి కనీసం ఆలోచన చేయడం లేదు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకా రం అమలు కాని హామీలు ఇవ్వడానికి వీల్లేదు. ఎంసీసీ అమలుకు పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పా టు చేసిన తర్వాతే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి...’అని పిల్‌లో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment