
కొమరం భీం పోరాట భూమిని సందర్శించిన శర్మ
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం జోడెఘాట్‌లోని చారిత్రాత్మక ప్రదేశం కొమరం భీం పోరాట భూమిని రాష్ట్ర అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి(చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) పి.కె. శర్మ మంగళవారం సాయంత్రం సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన కొమరం భీం విగ్రహానికి ఆయన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని ఆదివాసీలతో ఆయన ప్రత్యేకంగా సంభాషించారు. శర్మ మాట్లాడుతూ..మన చుట్టూ ఉన్న అటవీ సంపదను, మూగ జీవాలను సంరక్షించుకోవాలని సూచించారు. లేకపోతే ఆదిలాబాద్ ప్రాంతం ఏడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. శర్మ వెంట జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర్లు, ఐటీడీఏ డీఈ భద్రయ్య తదితరులు ఉన్నారు.
- (కెరమెరి)