నాగిరెడ్డిపేట : పోచారం ప్రాజెక్టు ఆయకట్టును ‘ఏ’,‘బీ’జోన్లుగా విభజించిన విధానం బాగుందని మహారాష్ట్రకు చెందిన ఇంజినీరింగ్ అధికారుల బృందం కితాబుని చ్చింది. మహారాష్ట్రలోని పుణేకు చెందిన నీటి పారుద ల శాఖ చీఫ్ ఇంజినీర్ అవినాష్ షర్వేతోపాటు ఏడుగురు ఎస్‌ఈలు, నలుగురు ఈఈలు స్టడీ టూర్‌లో భాగంగా మండలంలోని పోచారం ప్రాజెక్టును మంగళవారం సందర్శించారు. హైదరాబాద్‌లోని వాల ంతరీకి చెందిన ఐడీ అండ్ సీబీ ఎక్స్‌పర్ట్ ఝాన్సీరాణి, ట్రైనింగ్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ వారికి పోచారం ప్రాజెక్టు చరిత్ర, ఆయకుట్ట వివరాలు, ప్రాజెక్టు నీటి వినియోగం తీరును గురించి వివరించారు.
అనంతరం అవినాష్ షర్వే స్థానిక విలేకరులతో మాట్లాడా రు. తెలంగాణలోని మైనర్, మీడియం, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను అధ్యయ నం చేయడానికి రెండురోజుల క్రితం తాము హైదరాబాద్‌కు వచ్చామన్నారు. మొదటిరోజు ఇరిగేషన్ అధికారులకు శిక్షణను ఇచ్చే వాలంతరీని, పటాన్‌చెర్వులోని ఇక్రిశాట్‌ను సందర్శించామన్నారు. రెండోరోజు పోచారం, నిజాంసాగర్ ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చామన్నారు. ప్రాజెక్టుల్లోని సాగునీటిని ప్రజల భాగస్వామ్యంతో వినియోగించుకునే తీరును అధ్యయనం చేస్తున్నామన్నారు. పోచారం ప్రాజెక్టు నీటిని ఖరీఫ్‌లో పూర్తి ఆయకట్టుకు అందించి, రబీలో మాత్రం ‘ఏ’,‘బీ’జోన్లకు అందించడం బాగుందన్నారు. ఈ విధా నం వల్ల ప్రాజెక్టులోని నీరు కొద్దిపాటి ఆయకట్టుకైనా పూర్తిస్థాయిలో అందుతుందని పేర్కొన్నారు.
మహారాష్ట్రలో మైనర్, మీడియం, మేజర్ ప్రాజెక్టులు సుమారు 3,700 ఉన్నాయని అవినాష్ షర్వే తెలిపారు. తెలంగాణలో వరి సాగుచేసే రైతుల నుం చి ఎకరాకు రూ. 200 చొప్పున నీటితీరువా వసూలు చేస్తుండగా తమ రాష్ట్రంలో ఎకరాకు రూ. 476 నీటిపన్ను వసూలు చేస్తున్నామన్నారు. చెరుకు రైతుల నుంచి ఇక్కడ ఎకరానికి రూ. 350 వసూలు చేస్తుండ గా మహారాష్ర్టలో రూ. 4,500 వసూలు చేస్తున్నామన్నారు. తమ రాష్ట్రంలో రైతుల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బు నుంచే ప్రాజెక్టుల నిర్వహణకు కొంతభాగం కేటాయిస్తామని తెలిపారు. ప్రాజెక్టును సందర్శించిన వారిలో మహారాష్ట్రకు చెందిన ఎస్‌ఈలు పటాక్, గునలే, సంజీవ్ టటు, షాహ్, అజయ్ కోహీర్‌కర్, సంతోష్ తిరమన్వర్, ఈఈలు అశిశ్ దేవ్‌ఘడే, బోడ్కే, రాథోడ్, విశ్వకర్మ, బోర్సేతోపాటు కామారెడ్డి ఈఈ మధుకర్‌రెడ్డి, డీఈఈ విజయేందర్‌రెడ్డి ఉన్నారు.
నిజాంసాగర్‌లో..
నిజాంసాగర్ : మహారాష్ట్ర ప్రాంత నీటిపారుదలశాఖ ఇంజినీర్లు మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ఆయకట్టు విస్తీర్ణం, సాగునీటి పంపిణీ తీరును తెలుసుకున్నారు. ప్రాజెక్టు గురించి స్థానిక అధికారులను ఆడిగి తెలుసుకున్నారు. ఐబీసీబీ నిపుణురాలు ఝాన్సీరాణి, టీం కన్వీనర్ చంద్రశేఖర్ స్థానిక డిప్యూటీ ఈఈ సురేశ్‌బాబు తదితరులున్నారు.
ఎక్లాస్‌పూర్‌లో..
కోటగిరి : ఎక్లాస్‌పూర్ నీటి సంఘం కార్యాలయాన్ని మంగళవారం సాయంత్రం మహారాష్ట్ర ఇరిగేషన్ అధికారుల బృందం సందర్శించింది. బృంద సభ్యులు నీటి సంఘం ద్వారా చేపట్టిన పనుల వివరాలు తెలుసుకున్నారు. సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తున్నామని సంఘం అధ్యక్షుడు శరత్‌బాబు వారికి వివరించారు.
పోచారం ‘జోన్ల’ విభజన బాగుంది
Published Wed, Nov 26 2014 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM
Advertisement