
సాక్షి, కొత్తగూడెం : జిల్లా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో భారీగా పేలుడు సామాగ్రి పట్టుబడింది. కొత్తగూడెం నుంచి చర్ల వైపు వెళ్లున్న లారీలో పేలుడు సామాగ్రి ఉన్నట్లు జిల్లా ఎస్పీకి సమాచారం అందింది. స్పందించిన వెంటనే ఆయన పట్టణ ఎస్సైని అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై మహేశ్ సారపాక వద్ద లారీని తనిఖీ చేయగా 1000 డిటోనేటర్లు, 75 జిలెటిన్ స్టిక్స్ లభించాయి. వీటిని స్వాధీనం చేసుకుని, 8 మందిని అనుమానితులను అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment