సాక్షి, హైదరాబాద్ : ఎవరైనా ఆపదలో ఉన్నామని భావిస్తే, వెంటనే పోలీసుల సాయం తీసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసిన ఆయన.. ఏ క్షణంలో అయినా అభద్రతా భావం కలిగితే డయల్ 100ను సంప్రదించాలని కోరారు. పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ సమాచారం అందుకున్న 6 నుంచి 8 నిమిషాల్లోనే మీ ముందుకు వస్తుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో 122 పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతూ ఉంటాయని తెలిపారు. వెంటనే సాయం చేసేందుకు మీ ముందుకు వస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటారని ఆయన తెలిపారు.
Dial 100 the moment you feel and threat or scare anytime anywhere. Police patrol car will reach you in 6 to 8 minutes, Hyderabad city police has 122 patrol cars for your immediate help. We are with you always. pic.twitter.com/xmJTHt1w5u
— Anjani Kumar, IPS (@CPHydCity) November 29, 2019
Comments
Please login to add a commentAdd a comment