బంజారాహిల్స్: రోడ్డుపై ప్రమాదం జరిగిందా? ఎవరైనా ఆపదలో ఉన్నారా? రహదారి పక్కనే ఉండే కాల్ బాక్స్ మీటా నొక్కితే చాలు... క్షణాల్లో పోలీసులు సంఘటనాస్థలానికి వచ్చేస్తారు. లండన్, న్యూయార్క్, సిడ్నీ, బ్రిస్బెన్, ప్యారిస్ తదితర నగరాల్లో అందుబాటులో ఉన్న ఈఅత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మనకూ చేరువ కానుంది. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఎమర్జెన్సీ కాల్ బాక్స్ సేవలు అందుబాటులోకిరానున్నాయి. ఎల్‌అండ్‌టీ సంస్థ అత్యాధునిక సాంకేతికపరిజ్ఞానంతో వీటిని రూపొందిస్తోంది. తొలి దశలోబంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు ఎదుటనగర పోలీసులు ఎమర్జెన్సీ కాల్ బాక్స్ ఏర్పాటు చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు సమాచారం అందించాలని అనుకున్నప్పుడు ఈ కాల్ బాక్స్ మీటాను నొక్కి ఫిర్యాదు అందించొచ్చు. దీన్ని బంజారాహిల్స్‌లో కొత్తగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్, పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అనుసంధానిస్తున్నారు. దీనికి ఆడియో, వీడియో రికార్డ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఫోన్ చేస్తున్న వారి వివరాలన్నీ రికార్డ్ అవుతాయి. అలాగే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎవరు మాట్లాడుతున్నారో కూడా అందులో చూడొచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే సదరు పోలీసులు సంబంధిత స్టేషన్ పరిధిలోని పెట్రోలింగ్, గస్తీ సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. క్షణాల్లోనే పోలీసులు రంగప్రవేశం చేసేందుకు ఈ విధానం దోహదపడుతుంది. ఈ ఎమర్జెన్సీ కాల్ బాక్స్‌లను తర్వాతి దశల్లో ముఖ్యమైన కూడళ్లు, జన సమ్మర్థమున్న ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాల్లో ఏర్పాటు చేయనున్నారు. సీసీ కెమెరాలకూ ఈ సిస్టమ్‌ను అనుసంధానం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment