Emergency service
-
మరింత సమర్థవంతగా 104 కాల్ సెంటర్లు
సాక్షి, అమరావతి: 104 కాల్ సెంటర్‌ను మరింత సమర్థవంతగా తీర్చిదిద్దుతున్నారు. కోవిడ్ వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన సేవలు అందించేలా ఆ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పరీక్షలు చేయించడం దగ్గర నుంచి ఆస్పత్రిలో బెడ్ల కేటాయింపు వరకు అన్ని సేవలను పొందడానికి ఆ వ్యవస్థ వీలు కల్పిస్తుంది. కాల్ చేసిన వ్యక్తికి సంబంధించిన సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ డిజిటల్ పద్ధతుల్లో దాన్ని అధికారులు పర్యవేక్షించేలా ప్రోగ్రాం రూపొందించారు. సమస్య పరిష్కారమైన తర్వాతే ప్రోగ్రాం నుంచి ఆ సమస్య తొలగించబడుతుంది. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఈ చర్యలు తీసుకుంది. కోవిడ్ నివారణ చర్యలపై క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో 104 కాల్ సెంటర్ బలోపేతానికి తీసుకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ('అజ్ఞాతవాసి ఇకనైనా కళ్లు తెరువు') సేవలు ఇలా.. ►104కు కాల్ చేయగానే కోవిడ్ పరీక్ష ఎక్కడ చేయించుకోవాలి? టెస్ట్ సెంటర్ ఎక్కడుంది? దగ్గరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎక్కడుంది? సంబంధిత ప్రాంతంలో ఏఎన్ఎం ఎవరు? సంబంధిత డాక్టర్ సమాచారం ఏంటి? తదితర సమాచారాన్ని పొందవచ్చు. ►కోవిడ్ ఉందని అనుమానం ఉంటే.. వెంటనే 104కు కాల్ చేయగానే డాక్టరు అందుబాటులోకి వస్తారు. కాల్ చేసిన వ్యక్తికి సంబంధించిన ఆరోగ్య వివరాలు తెలుసుకుని టెస్టు చేయించుకోవాల్సిన అవసరం ఉందో? లేదో? నిర్ణయం తీసుకుంటారు. ►డాక్టర్ సిఫార్సు మేరకు టెస్టు చేయించుకున్న తర్వాత.. పాజిటివ్‌గా తేలితే, ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోకుంటే.. ఆ వ్యక్తి నేరుగా మళ్లీ 104కు కాల్ చేయొచ్చు. అప్పుడు సంబంధిత సిబ్బంది నేరుగా ఫాలో అప్ చేసి తగిన చర్యలు తీసుకుంటారు. ►ఆ చర్యల్లో భాగంగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తికి డాక్టర్ ఫోన్ చేస్తారు. వైరస్ లక్షణాలు ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తిస్తారు. ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని హోం ఐసోలేషన్ లేదా, కోవిడ్ కేర్ సెంటర్ లేదా ఆస్పత్రిలో అడ్మిట్ చేయిస్తారు. 104కు కాల్ చేసి పై రిక్వెస్టుల్లో ఏది చేసినా సరే.. అది ఆన్లైన్లో ప్రత్యేక ప్రోగ్రాంలో నమోదు అవుతుంది. కాలర్ చెప్పిన సమస్య పూర్తిగా పరిష్కారం అయిన తర్వాతనే ఆ రిక్వెస్ట్ పరిష్కరించినట్టుగా చూపిస్తుంది. లేకపోతే ఆ సమస్య పెండింగులో ఉన్నట్టుగానే భావిస్తారు. వీటితోపాటు ఆస్పత్రుల్లో బెడ్లు, వాటి భర్తీ, ఉన్న ఖాళీలపైన కూడా ఎప్పటికప్పుడు వివరాలను అప్డేట్ చేస్తూ.. 104తో పాటు, కోవిడ్ ఆస్పత్రుల వివరాలను అందుబాటులో ఉంచుతున్నారు. దీని వల్ల ఆలస్యాన్ని నివారించడంతో పాటు మెరుగైన సేవలు లభించనన్నాయి. ఇంకా వాటి నిర్వహణ సులభం కానుంది. -
లోకల్ రైళ్లు ప్రారంభం.. వారికే ఎంట్రీ
ముంబై: అత్యవసర సర్వీసుల కోసం నేటి నుంచి ముంబైలో లోకల్ రైళ్లను నడపనున్నారు. ఉదయం 5.30 నుంచి రాత్రి 11.30 వరకు ప్రతి 15 నిమిషాల విరామంతో రైళ్లను నడపనున్నట్లు వెస్ట్రన్ రైల్వే ట్వీట్ చేసింది. అయితే ఈ రైళ్లలో సాధారణ ప్రయాణికులకు అనుమతి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన అత్యవసర సిబ్బంది కోసం మాత్రమే ఈ రైళ్లు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం సుమారు 1.25 లక్షల మందిని అత్యవసరమైన సిబ్బందిగా గుర్తించింది. అత్యవసర సేవల మీద ప్రయాణించే సిబ్బంది కూడా లోకల్ రైళ్లలో ప్రయాణించాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి. స్టేషన్లోకి వెళ్లే ముందు, టికెట్ కొనేటప్పుడు ఈ గుర్తింపు కార్డుని చూపించాల్సి ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే లోకల్ రైళ్లను నడుపుతున్నారు. సామాజిక దూరం మార్గదర్శకాల దృష్ట్యా సుమారు 1,200 మందికి రైలులో అవకాశం ఉన్నా.. 700 మందికి మాత్రమే అనుమతిస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. చదవండి: ఐఫోన్ 12 డిజైన్‌లో పెను మార్పు! -
క్షణాల్లో పోలీస్
బంజారాహిల్స్: రోడ్డుపై ప్రమాదం జరిగిందా? ఎవరైనా ఆపదలో ఉన్నారా? రహదారి పక్కనే ఉండే కాల్ బాక్స్ మీటా నొక్కితే చాలు... క్షణాల్లో పోలీసులు సంఘటనాస్థలానికి వచ్చేస్తారు. లండన్, న్యూయార్క్, సిడ్నీ, బ్రిస్బెన్, ప్యారిస్ తదితర నగరాల్లో అందుబాటులో ఉన్న ఈఅత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మనకూ చేరువ కానుంది. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఎమర్జెన్సీ కాల్ బాక్స్ సేవలు అందుబాటులోకిరానున్నాయి. ఎల్అండ్టీ సంస్థ అత్యాధునిక సాంకేతికపరిజ్ఞానంతో వీటిని రూపొందిస్తోంది. తొలి దశలోబంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు ఎదుటనగర పోలీసులు ఎమర్జెన్సీ కాల్ బాక్స్ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు సమాచారం అందించాలని అనుకున్నప్పుడు ఈ కాల్ బాక్స్ మీటాను నొక్కి ఫిర్యాదు అందించొచ్చు. దీన్ని బంజారాహిల్స్‌లో కొత్తగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్, పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అనుసంధానిస్తున్నారు. దీనికి ఆడియో, వీడియో రికార్డ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఫోన్ చేస్తున్న వారి వివరాలన్నీ రికార్డ్ అవుతాయి. అలాగే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎవరు మాట్లాడుతున్నారో కూడా అందులో చూడొచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే సదరు పోలీసులు సంబంధిత స్టేషన్ పరిధిలోని పెట్రోలింగ్, గస్తీ సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. క్షణాల్లోనే పోలీసులు రంగప్రవేశం చేసేందుకు ఈ విధానం దోహదపడుతుంది. ఈ ఎమర్జెన్సీ కాల్ బాక్స్‌లను తర్వాతి దశల్లో ముఖ్యమైన కూడళ్లు, జన సమ్మర్థమున్న ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాల్లో ఏర్పాటు చేయనున్నారు. సీసీ కెమెరాలకూ ఈ సిస్టమ్‌ను అనుసంధానం చేయనున్నారు. -
శిక్షణ సమయంలోనే మర్యాద పాఠాలు
డ్రైవింగ్ స్కూళ్లకు ఆర్టీవో హుకుం సాక్షి, ముంబై: అత్యవసర సేవలందించే వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే విషయాన్ని శిక్షణ సమయంలోనే డ్రైవర్లకు నేర్పించాలని ప్రాంతీయ రవాణా కార్యాలయం(ఆర్టీఓ) భావిస్తోంది. అందుకు నగరంలోని అన్ని మోటార్ డ్రైవింగ్ స్కూళ్లకు సర్క్యులర్ జారీ చేయాలని నిర్ణయించింది. డ్రైవర్లకు సరైన అవగాహన లేకపోవడంవల్ల అంబులెన్స్, ఫైరింజన్ వంటి అత్యవసర సేవలందించే వాహనాలు ముందుకు వెళ్లేందుకు దారి దొరకడం లేదు. దీంతో రోగిని అంబులెన్స్‌లో సకాలంలో ఆస్పత్రికి చేర్చ లేకపోతున్నాయి. అగ్నిప్రమాదాలు సంభవించిన ప్పుడు కూడా భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతోంది. కొందరు డ్రైవర్లు వీటికి దారి ఇవ్వకపోవడంవల్ల గమ్యానికి ఆలస్యంగా చేరుకుంటున్నాయని పలు అధ్యయనాల్లో తేలింది. ఫలితంగా అప్పటికే జరగాల్సిన ప్రాణ, ఆస్తి నష్టం జరిగిపోతుంది. దీంతో ఇకనుంచి వీటికి ఫుల్స్టాప్ పెట్టాలని ఆర్టీఓ ఈ నిర్ణయం తీసుకుంది. నగరంలో విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది. ఎన్ని ఫ్లై ఓవర్లు నిర్మించినా పరిస్థితి ఎప్పటిలాగే ఉంది. ఉదయం, పగలు, రాత్రి అని తేడా లేకుండా రహదారులన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ఇలాంటి సమయం లో ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసర సేవలు అందించే వాహనాలు ఘటనాస్థలానికి చేరుకోవడాని అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ట్రాఫిక్‌లోంచి దారి చేసుకుంటూ ముందుకు వెళ్లడం సవాలుగా మారుతోంది. అందుకు ముం దు వెళ్తున్న కార్లు, ఇతర వాహనాలు సహకరిస్తే కొంత మేలు జరుగుతుందని ఆర్టీఓ భావించింది. ప్రస్తుతం నగరంలో వాహనాలు తోలుతున్న డ్రైవర్లలో చాలామందికి అత్యవసర వాహనాల ప్రాధాన్యత గురించి తెలియదు. తమ వాహనం వెనకాలే వస్తున్న అంబులెన్స్ లేదా ఫైరింజిన్ సైరన్ మోగుతున్నా కొందరు పట్టించుకోవడం లేదు. ముందుకు వెళ్లేందుకు దారి ఇవ్వకపోవడంతో సంఘటన స్థలానికి ఆలస్యంగా చేరుకుంటున్నట్లు అనేక ఫిర్యాదులు ఆర్టీఓకు అందాయి. దీంతో మోటార్ డ్రైవింగ్ స్కూళ్లలో డ్రైవింగ్ నేర్చుకునే సమయంలోనే వారికి అత్యవసర వాహనాల ప్రాధాన్యత గురించి వివరిస్తే భవిష్యత్తులో ఇలాంటి దుస్థితి రాదనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకు మోటార్ డ్రైవింగ్ స్కూళ్ల సాయం ఎంతైనా ఉందని భావించిన ఆర్టీఓ ఆ మేరకు ఈ ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర వాహనాలకు కుడి నుంచి ముందుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని, అందుకు తాము నడుపుతున్న వాహన వేగాన్ని తగ్గించాలని ఆదేశాలలో సూచించింది.