లోకల్‌ రైళ్లు ప్రారంభం.. వారికే ఎంట్రీ | Mumbai Local Trains Starts From Today | Sakshi
Sakshi News home page

లోకల్‌ రైళ్లు ప్రారంభం.. అనుమతి వారికి మాత్రమే

Published Mon, Jun 15 2020 11:08 AM | Last Updated on Mon, Jun 15 2020 1:21 PM

Mumbai Local Trains Starts From Today - Sakshi

ముంబై: అత్యవసర సర్వీసుల కోసం నేటి నుంచి ముంబైలో లోకల్‌ రైళ్లను నడపనున్నారు. ఉదయం 5.30 నుంచి రాత్రి 11.30 వరకు ప్రతి 15 నిమిషాల విరామంతో రైళ్లను నడపనున్నట్లు వెస్ట్రన్‌ రైల్వే ట్వీట్‌ చేసింది. అయితే ఈ రైళ్లలో సాధారణ ప్రయాణికులకు అనుమతి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన అత్యవసర సిబ్బంది కోసం మాత్రమే ఈ రైళ్లు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం సుమారు 1.25 లక్షల మందిని అత్యవసరమైన సిబ్బందిగా గుర్తించింది.

అత్యవసర సేవల మీద ‍ప్రయాణించే సిబ్బంది కూడా లోకల్ రైళ్ల‌లో ప్రయాణించాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి. స్టేషన్‌లోకి వెళ్లే ముందు, టికెట్ కొనేటప్పుడు ఈ గుర్తింపు కార్డుని చూపించాల్సి ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే లోకల్‌ రైళ్లను నడుపుతున్నారు. సామాజిక దూరం మార్గదర్శకాల దృష్ట్యా సుమారు 1,200 మందికి రైలులో అవకాశం ఉన్నా.. 700 మందికి మాత్రమే అనుమతిస్తున్నట్లు  రైల్వేశాఖ వెల్లడించింది. చదవండి: ఐఫోన్‌ 12 డిజైన్‌లో పెను మార్పు! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement