Mumbai local trains
-
ముంబై లోకల్ రైల్లో ఆర్థిక మంత్రి నిర్మల
ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ముంబై లోకల్ ట్రైన్లో ఘాట్కోపర్ నుంచి కళ్యాణ్ దాకా దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణించారు. ప్రయాణికులంతా ఆమెతో సెలీ్ఫలు తీసుకున్నారు. ముంబై సబర్బన్ రైళ్లలో రోజుకు 65 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. నిర్మలతో ప్రయాణికుల సెలీ్ఫలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. లోకల్ రైలు ప్రయాణ కష్టాలను కొందరు మహిళా ప్రయాణికులు ఆమెకు ఏకరవు పెట్టారు. గతేడాది నవంబర్‌లో కేరళలో నిర్మల వందేభారత్ రైలులో ప్రయాణించి అందులోని ప్రయాణికులను ఆశ్చర్యపరిచారు. -
టికెట్ లేని ప్రయాణికులపై రూ.300 కోట్లు వసూలు.. 90% యువతే
ముంబై: ముంబైకర్లకు లైఫ్‌లైన్‌గా సేవలందిస్తున్న లోకల్ రైళ్లలో టికెటు లేకుండా ప్రయాణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. గతేడాదికాలంలో టికెటు లేకుండా ప్రయాణిస్తున్న 46.32 లక్షల మందిని పట్టుకున్నారు. వారి నుంచి ఏకంగా రూ.300 కోట్లకుపైగా జరిమాన వసూలు చేశారు. ఇందులో ఒక్క ముంబై రీజియన్‌లోనే 19.57 లక్షల మందిని పట్టుకోగా వారి నుంచి రూ.108 కోట్లు జరిమాన వసూలు చేశారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరోపక్క ఇదే తరహాలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారి సంఖ్య కూడా పెరిగిపోవడంతో లోకల్ రైళ్ల ఆదాయానికి భారీ నష్టాన్ని కలగజేస్తున్నారు. ముంబైలో లోకల్ రైళ్లలో నిత్యం సుమారు 70 నుంచి75 లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. అందులో 70% ప్రయాణికులు సీజన్ పాస్ హోల్డర్లుంటారు. మిగతావారు టికెట్ తీసుకుని లేదా టికెట్ లేకుండా ప్రయాణించే వారుంటారు. 2022–23 ఆర్థికక సంవత్సరంలో సెంట్రల్ రైల్వే టీసీలు దాడులుచేసి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 46.32 లక్షల మందిని పట్టుకున్నారు. ఇందులో 20 మంది టీసీలు వ్యక్తిగతంగా ఒక్కొక్కరు రూ.కోటికిపైనే జరిమాన వసూలు చేశారు. డి.కుమార్ అనే టీసీ 22,847 మందిని పట్టుకుని రూ.2.11 కోట్లు జరిమాన వసూలుచేసి అగ్రస్థానంలో నిలిచారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని పట్టుకునేందుకు రైల్వే టీసీలు రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సాయంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుంటారు. అందులో పెద్ద సంఖ్యలో పట్టుబడుతుంటారు. పట్టుబడిన వారిలో 90% యువతీ యువకులే ఉన్నారు. టీసీలను దూరం నుంచి చూపి తప్పించుకుని పారిపోయిన వారి సంఖ్య కూడా దాదాపు ఇంతే సంఖ్యలో ఉంటుంది. వీరంతా టీసీలకు చిక్కితే రైల్వేకు భారీగా అదనంగా ఆదాయం రావడం ఖాయమని రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
Mumbai Local Trains: కరోనా ఆంక్షలు.. నకిలీ కార్డులతో ప్రయాణం
సాక్షి, ముంబై: ముంబై లోకల్ రైళ్లలో సామాన్యులకు అనుమతి నిషేధించడంతో నకిలీ గుర్తింపు కార్డు (ఐడీ)ల బెడద మళ్లీ మొదలైంది. మూడు రోజుల్లోనే నకిలీ ఐడీల ద్వారా ప్రయాణిస్తున్న 35 మందిపై రైల్వే పోలీసుల చర్యలు తీసుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. బ్రేక్ ది చైన్‌లో భాగంగా కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ఈ నెల 22వ తేదీ రాత్రి 8 గంటల నుంచి లోకల్ రైళ్లలో అత్యవసర విభాగాలలో పనిచేసే ఉద్యోగులు మినహా సామాన్యులకు అనుమతి నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో సామాన్యులతోటు ప్రైవేటు కార్యాలయాల్లో, ఇతర వ్యాపార వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఇబ్బందుల్లో పడిపోయారు. గత్యంతరం లేక బెస్ట్ లేదా ఆర్టీసీ బస్సులను ఆశ్రయించాల్సి వస్తుంది. కానీ, రోడ్డు ప్రయాణంతో పోలిస్తే లోకల్ రైలు ప్రయాణం చాలా చౌకగా ఉంటుంది. బెస్ట్, ఆర్టీసీ బస్సుల్లో ఉప నగరాలు, శివారు ప్రాంతాల నుంచి ముంబైకి రాకపోకలు సాగించాలంటే రోజుకు కనీసం రూ.100–250 ఖర్చవుతుంది. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది గిట్టుబాటు కాదు. దీంతో బ్యాంకు, బీఎంసీ, తపాల, అంబులెన్స్ డ్రైవర్ ఇలా వివిధ అత్యవసర విభాగంలోని ఏదో ఒక చోట పనిచేస్తున్నట్లు నకలీ ఐడీ కార్డు తయారు చేయించుకుంటున్నారు. అందుకు స్టేషనరీ షాపులో, ఫోటో స్టూడియోలో కొందరు రూ.50–100 వరకు తీసుకుని అక్రమంగా వీటిని తయారు చేస్తున్నారు. ఈ నకిలీ ఐడీ కార్డు ద్వారా లోకల్ రైళ్లలో సులభంగా రాకపోకలు సాగిస్తున్నారు. కానీ, రైల్వే పోలీసులు స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద చేపడుతున్న తనిఖీల్లో 35 మంది పట్టుబడ్డారు. పశ్చిమ మార్గంలో ఇలాంటి వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా 135 మంది టీసీలను నియమించారు. నకిలీ ఐడీ ద్వారా రాకపోకలు సాగించే వారితోపాటు ముఖానికి మాస్క్ లేని వారిని కూడా పట్టుకుంటున్నారు. అక్కడ 80 మందిపై చర్యలు తీసుకుని రూ.1,200 వరకు జరిమానా వసూలు చేశారు. ఇక్కడ చదవండి: రూ.22 లక్షల కారు అమ్మేసి మరీ.. నువ్వు గొప్పోడివయ్యా! ఆ వార్త విని షాకయ్యాం.. మాటలు రావడం లేదు -
ముంబై లోకల్ రైళ్ల సమయాల్లో మార్పు!
సాక్షి, ముంబై: లోకల్ రైళ్లలో సామాన్యులను అనుమతించే సమయాల్లో మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమ లులో ఉన్న సమయం సామాన్యులు, వ్యాపారులు, కార్మికులతోపాటు ముఖ్యంగా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు అనుకూలంగా లేదు. దీంతో మొదటి రోజు నుంచి సమయంలో మార్పులు చేయాలని అనేక ఫిర్యాదులు రావడం మొదలయ్యాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న రాజేశ్ టోపే త్వరలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో చర్చిస్తామని, ఆ తరువాత రైల్వే అధికారులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులకు ఎక్కువ నష్టం.. లోకల్ రైళ్లలో సామాన్యులను అనుమతించడంతోపాటు వారు పడుతున్న ఇబ్బందులతోపాటు, వారికి ఎదురవుతున్న సమస్యలను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత సోమవారం నుంచి నిర్ణీత సమయంలో సామాన్యులు లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతించిన విషయం తెలిసిందే. తెల్లవారు జామున (మొదటి రైలు బయలుదేరిన) నుంచి ఉదయం 7 గంటల లోపు, మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు, ఆ తరువాత రాత్రి 9 తొమ్మిది గంటల నుంచి చివరి రైలు బయలుదేరే వరకు సామాన్యులకు అనుమతి కల్పిస్తున్నారు. కానీ, ఈ సమయం వివిధ పనుల నిమిత్తం బయటపడిన వారికి లేదా బంధువుల ఇళ్లకు కుటుంబ సభ్యులతో బయలుదేరిన వారికి మాత్రమే అనుకూలంగా ఉంది. కానీ, ప్రైవేటు, వివిధ వాణిజ్య, వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఏమాత్రం అనుకూలంగా లేదు. దీంతో రైల్వే తీసుకున్న నిర్ణయంతో మొదటి నుంచి ఉద్యోగులు పెదవి విరిస్తున్నారు. లోకల్ రైళ్లకు బదులుగా బెస్ట్ లేదా ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరడమే ఉత్తమమని కొందరు భావిస్తున్నారు. దీంతో ముంబైకర్లు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నేతృత్వంలో ఓ సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామన్నారు. మార్పులు చేయడానికి కుదురుతుందా..? ఆదరబాదరగా నిర్ణయం తీసుకుంటే కరోనా వైరస్ నియంత్రణపై గత పది నెలలుగా చేసిన ప్రయత్నాలన్ని వృథా కానున్నాయి. దీంతో సమయంలో మార్పులు చేసే ముందు భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చదవండి: ‘మహా’లో కీలక మార్పు.. స్పీకర్ రాజీనామా త్వరలో ముంబై కరోనా రహితం! -
లోకల్ రైళ్లు ప్రారంభం.. వారికే ఎంట్రీ
ముంబై: అత్యవసర సర్వీసుల కోసం నేటి నుంచి ముంబైలో లోకల్ రైళ్లను నడపనున్నారు. ఉదయం 5.30 నుంచి రాత్రి 11.30 వరకు ప్రతి 15 నిమిషాల విరామంతో రైళ్లను నడపనున్నట్లు వెస్ట్రన్ రైల్వే ట్వీట్ చేసింది. అయితే ఈ రైళ్లలో సాధారణ ప్రయాణికులకు అనుమతి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన అత్యవసర సిబ్బంది కోసం మాత్రమే ఈ రైళ్లు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం సుమారు 1.25 లక్షల మందిని అత్యవసరమైన సిబ్బందిగా గుర్తించింది. అత్యవసర సేవల మీద ప్రయాణించే సిబ్బంది కూడా లోకల్ రైళ్లలో ప్రయాణించాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి. స్టేషన్లోకి వెళ్లే ముందు, టికెట్ కొనేటప్పుడు ఈ గుర్తింపు కార్డుని చూపించాల్సి ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే లోకల్ రైళ్లను నడుపుతున్నారు. సామాజిక దూరం మార్గదర్శకాల దృష్ట్యా సుమారు 1,200 మందికి రైలులో అవకాశం ఉన్నా.. 700 మందికి మాత్రమే అనుమతిస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. చదవండి: ఐఫోన్ 12 డిజైన్‌లో పెను మార్పు! -
హోరెత్తిన ముంబై
సాక్షి, ముంబై : ఇటీవల రైతు ఆందోళనలతో హోరెత్తిన ముంబై తాజాగా రైల్వే ఉద్యోగార్థుల ఆందోళనతో ఉలిక్కిపడింది. రైల్వే పోస్టుల కోసం పరీక్షలు రాసిన అభ్యర్ధులు నియామకాలు కోరుతూ మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మతుంగ, ఛత్రపతి శివాజీ టెర్మినస్ స్టేషన్ల మధ్య నిరసనలకు దిగడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఉద్యోగార్ధుల ఆందోళనల నేపథ్యంలో అధికారులు 60కి పైగా లోకల్ ట్రైన్స్‌ను రద్దు చేశారు. విధులకు హాజరుకావాల్సిన ఉద్యోగులు, ఇతర ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వే ట్రాక్స్‌పై ఆందోళన చేపట్టిన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. రైల్వేలు నిర్వహించిన పరీక్షలకు తాము హాజరైనా ఇప్పటివరకూ నియామకాలు చేపట్టలేదని ఆందోళనకు దిగిన ఉద్యోగార్ధులు పేర్కొన్నారు. ముంబబై సెంట్రల్ లైన్ మీదుగా లోకల్ ట్రైన్స్‌లో రోజూ 40 నుంచి 42 లక్షల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తుంటారు. కాగా,అభ్యర్థులు ఆందోళన విరమించారని, రైళ్ల రాకపోకలు పునరుద్ధరించినట్టు అధికారులు పేర్కొన్నారు. -
ముంబైలో స్తంభించిన లోకల్ రైళ్లు
-
రైలు మార్గం.. మృత్యువుతో పోరాటం
ముంబై: దేశ ఆర్ధిక రాజధానిలో గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 18 మంది రైలు యాక్సిడెంట్లలో మరణించారు. ముంబైలో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ 2 వేల మందికి పైగా రైలు యాక్సిడెంట్లలో మృతి చెందారు. వీరిలో ఎక్కువమంది రైల్వే లైన్లు క్రాస్ చేస్తుండగా మరణించడం గమనార్హం. గురువారం ఒక్కరోజే 18 మంది మరణించగా..16 మంది గాయాలపాలయ్యారు. అత్యధికంగా వాసాయ్ జీఆర్పీ ఔట్ పోస్టు(మీరా రోడ్డు-వైతర్నాస్టేషన్ల మధ్య) వద్ద ఐదుగురు, కళ్యాణ్ జీఆర్పీ ఔట్ పోస్టు(కళ్యాణ్-కసర స్టేషన్ల మధ్య) వద్ద ముగ్గురు మరణించారు. కళ్యాణ్, దహిసర్ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ప్రజలు పశ్చిమ ముంబైలో ఉద్యోగాల కోసం వెళ్తున్నారు. ఈ ప్రాంతాల నుంచి పశ్చిమ ముంబై చేరుకోవడానికి రైలు మార్గమే దిక్కు. దీంతో ఉద్యోగాలకు వెళ్లి, వచ్చే సమయాల్లో లైన్లు క్రాస్ చేస్తునో.. రద్దీగా ఉన్న రైల్లో నుంచి జారిపడో మరణించే వారి సంఖ్య గత కొంతకాలంగా విపరీతంగా పెరిగిపోతోంది. దీనిపై స్పందించిన భద్రతా అధికారులు నగరంలో జనభా విపరీతంగా పెరుగుతోందని అన్నారు. కొత్త సర్వీసుల అవసరాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తోందని చెప్పారు. జనసాంద్రత పెరిగుతున్న కారణంగానే రైళ్ల సమయాల్లో మార్పులు జరిగితే అది శాంతి, భద్రతలకు సంబంధించిన విషయం అవుతుందని ఓ ఐపీఎస్ ఆఫీసర్ వాపోయారు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల మధ్య నుంచి రైళ్ల మార్గాలు ఉంటుండటంతో రోజులో కొద్దిసార్లు లైన్లు క్రాస్ చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోందని మరో అధికారి తెలిపారు. రైల్వే శాఖ ఈ మేరకు ఇప్పటికే బాంబే మునిసిపల్ కార్పొరేషన్(బీఎమ్ సీ)తో చర్చలు జరిపిందని వివరించారు. సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లైన్ల మీదుగా కొత్త బ్రిడ్జిలను నిర్మించాలని బీఎమ్ సీకి సూచించినట్లు చెప్పారు. -
టికెట్ విక్రయానికి ప్రత్యేక విండోలు
సాక్షి, ముంబై: ముంబైలో లోకల్ రైళ్లలో ప్రయాణించే వారిని దృష్టిలో ఉంచుకొని పశ్చిమ రైల్వే రెండు కొత్త టికెట్ విండోల(కిటికీలు)ను ప్రారంభించింది. బోరివలి, అంధేరి రైల్వేస్టేషన్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ ప్రత్యేక విండోల్లో రూ.5, రూ.10 ధరలతో ఉన్న టికెట్లను విక్రయించనున్నారు. కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించేందుకు.. ఈ విషయంపై పశ్చిమ రైల్వే అందించిన వివరాల మేరకు ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణించే వారిలో అత్యధిక మంది రూ.5, రూ.10 చార్జీల టికెట్లను కొనుగోలు చేస్తారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీంతోపాటు ఇలాంటి టికెట్ల విక్రయం కూడా బోరివలి, అంధేరిలలో అధికంగా ఉందని తె లిసింది. దీంతో టికెట్ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఇప్పటికే అనేక విధాలుగా టికెట్ విధానాలను మారుస్తూ వస్తున్న పశ్చిమ రైల్వే తాజాగా ఫిక్స్డ్ టికెట్‌తో కొత్త టిక్కెట్ విండోల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విండోల్లో కేవలం రూ.5, రూ.10 టికెట్లను మాత్రమే విక్రయించనున్నారు. రూ.5 టికెట్‌తో 0-10 కిలోమీటర్లు, రూ.10 టికెట్‌తో 11-30 కిలో మీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఎరుపు, పసుపు రంగు విండోలు ప్రయాణికులు టికెట్ విండోలను సులభంగా గుర్తించేందుకు వీలుగా వాటికి ప్రత్యేక రంగు వేశారు. రూ.5 టికెట్ విండోకు ఎరుపు, రూ.10 టికెట్ విండోకు పసుపు రంగును వేశారు. దీంతో ప్రయాణికులకు సులభంగా టికెట్ తీసుకునే వీలుంది. ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ టికెట్ విక్రయాలను మార్చి 10 వరకు అందుబాటులో ఉంచనున్నారు. అనంతరం ప్రజల నుంచి ఆదరణ వస్తే మళ్లీ ఈ టికెట్ విండోల విధానాన్ని ప్రారంభించనున్నారు.