సాక్షి, హైదరాబాద్: మల్కాజ్‌గిరిలోని బచ్‌పన్ స్కూల్‌లో పోలీసులు, విద్యాశాఖ అధికారులు సోమవారం ఉదయం సోదాలు నిర్వహించారు. ఎంఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సోదాల్లో సీసీ ఫుటేజీ, హోర్డ్ డిస్క్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శివ రుచిత్ స్కూల్ బ్యాగ్ అదృశ్యంపై పోలీసుల ఆరా తీశారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజీని స్కూల్ యాజమాన్యం మాయం చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని రుచిత్ తల్లిదండ్రులకు పోలీసులు హామీ ఇచ్చారు. మల్కాజిగిరిలోని బచ్‌పన్ ప్లే స్కూల్లో శివ రుచిత్ అనే బాలుడు నీటి సంపులోపడి మృతి చెందిన విషయం తెలిసిందే. రుచిత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్కూల్ ప్రిన్సిపల్ రాఘవేందర్, స్కూల్ కౌన్సిలర్ ఉన్ని కృష్ణన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment