bachpan school
-
'బచ్పన్' లో తనిఖీలు: సీసీ టీవీ ఫుటేజీ మాయం
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్‌గిరిలోని బచ్పన్ స్కూల్లో పోలీసులు, విద్యాశాఖ అధికారులు సోమవారం ఉదయం సోదాలు నిర్వహించారు. ఎంఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సోదాల్లో సీసీ ఫుటేజీ, హోర్డ్ డిస్క్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శివ రుచిత్ స్కూల్ బ్యాగ్ అదృశ్యంపై పోలీసుల ఆరా తీశారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజీని స్కూల్ యాజమాన్యం మాయం చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని రుచిత్ తల్లిదండ్రులకు పోలీసులు హామీ ఇచ్చారు. మల్కాజిగిరిలోని బచ్పన్ ప్లే స్కూల్లో శివ రుచిత్ అనే బాలుడు నీటి సంపులోపడి మృతి చెందిన విషయం తెలిసిందే. రుచిత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్కూల్ ప్రిన్సిపల్ రాఘవేందర్, స్కూల్ కౌన్సిలర్ ఉన్ని కృష్ణన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. -
షాకింగ్ : సెటిల్మెంట్ చేసుకోమన్నారు!
సాక్షి, హైదరాబాద్ : 'చిల్డ్రన్స్ డే రోజు శివ్ రచిత్‌ను తయారుచేసి 8:30 కి చిరునువ్వుతో స్కూలుకు పంపించాను. రోజులాగే మా ఆయన అనిల్ రోజులాగే బాబును స్కూలు వద్ద దింపి వచ్చాడు. కానీ స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యంతో పసివాడు శవమై తేలాడంటూ' మల్కాజ్గిరి విష్ణుపురి కాలనీలోని బచ్పన్ స్కూలులో నీటి సంపులో శవమై కనిపించిన బాలుడి తల్లి విశాల తన ఆవేదన వ్యక్తం చేశారు. శివ్ రచిత్ మృతిపై వివరాలు అడగగా స్కూలు మేనేజ్మెంట్తో ఎంతో కొంతకు సెటిల్మెంట్ చేసుకోవాలంటూ ఎస్ఐ శంకరయ్య సలహా ఇవ్వడం దారుణమని బాలుడి బంధువులు పేర్కొన్నారు. 'మా పిల్లల గురించి అడిగే హక్కు, అధికారం మాకు లేదా.. అడిగేందుకు మాకు బాధ్యత లేదా. మేం స్కూలు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తామంటే.. ఆ ప్రశ్నలేవో మాకే రాసివ్వండి. మేం వారిని అడుగుతామని ఎస్ఐ అన్నారు. ప్రశ్నలు రాసివ్వడానికి అసలు ఇది స్కూలు పరీక్షలా.. సీసీ కెమెరాలు రెండు రోజుల నుంచి పనిచేయలేదన్నారు. బాలుడు ఆడుకుంటూనే నీటిలో పడిపోయాడని అంత ఈజీగా ఎలా గుర్తించారు. 150 మంది పిల్లలకు ఆరుగురు ఆయాలున్నారని చెబుతున్నారు. నీటి కోసం తెరిస్తే.. ఆ తర్వాత మూయకుండా అలాగే వదిలేస్తే పిల్లల ప్రాణాలకు ప్రమాదమని తెలియదా. అయినా నీటి సంపు పక్కనే చిన్న పిల్లల్ని ఆడుకోనివ్వకూడదని కూడా విద్యార్థుల పేరెంట్స్, బంధువులే చెప్పాలా' అంటూ వారు ప్రశ్నించారు. పరారీలో స్కూలు యాజమాన్యం యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే బాలుడు చనిపోయాడని పేరెంట్స్, బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో భయాందోళనకు గురైన బచ్పన్ స్కూలు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. శివ్ రచిత్ తల్లిదండ్రులు మాత్రం బాబు కోసం కన్నీరుమున్నీరవుతున్నారు. స్థానికులను సైతం ఈ విషాదం కలిచివేస్తోంది. -
బచ్పన్ స్కూల్లో విషాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బచ్పన్ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధి, విష్ణుపురి కాలరిలో బచ్పన్ లో శివ రచిత్ అనే మూడేళ్ల చిన్నారి సంపులో పడి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. బచ్పన్లో శివ రచిత్ నర్సరీ చదువుతున్నాడు. నీటి సంపు మూత తెరిచి ఉండడంతో విద్యార్థి ప్రమాదవశాత్తూ పడి మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే చిన్నారి మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. బాలల దినోత్పవం రోజే చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు విలపిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిల్డ్రన్స్‌డే రోజు విషాదం -
‘బచ్పన్’ ఎదుట ఆందోళన
హైదరాబాద్: తమ చిన్నారిని స్కూల్ నిర్వాహకులు కొట్టారని ఆరోపిస్తూ చిన్నారి తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. నగరంలోని అల్వాల్ బచ్పన్ ప్లే స్కూల్లో నర్సరీ చదువుతున్న ఆరుషీ రెడ్డిని స్కూల్ లో దండించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. బచ్పన్ యాజమాన్యం నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో వారు అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.