సాక్షి, హైదరాబాద్: నగరంలోని బచ్‌పన్ స్కూల్‌లో విషాదం చోటు చేసుకుంది. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధి, విష్ణుపురి కాలరిలో బచ్‌పన్ లో శివ రచిత్ అనే మూడేళ్ల చిన్నారి సంపులో పడి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. బచ్‌పన్‌లో శివ రచిత్ నర్సరీ చదువుతున్నాడు.
నీటి సంపు మూత తెరిచి ఉండడంతో విద్యార్థి ప్రమాదవశాత్తూ పడి మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే చిన్నారి మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. బాలల దినోత్పవం రోజే చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు విలపిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చిల్డ్రన్స్‌డే రోజు విషాదం
Comments
Please login to add a commentAdd a comment