
సాక్షి, హైదరాబాద్: నేరస్తుల సమగ్ర సర్వే పేరుతో పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలకు సాక్ష్యాలు ఉంటే అనుబంధ పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. నేరస్తుల సమగ్ర సర్వే పేరుతో నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి పోలీస్ స్టేషన్ అధికారి వేధిస్తున్నారని అబ్దుల్ హఫీజ్ తరఫు న్యాయవాది వాదించారు. పిటిషనర్‌ను పోలీసులు బెదిరించలేదని హోం శాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది బదులిచ్చారు. ఫోన్ కాల్స్ సాక్ష్యాలున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పగా.. ఆ వివరాలతో పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ఆదేశించారు.
తదుపరి విచారణను 5వ తేదీకి వాయిదా వేశారు. ఇదే పిటిషనర్ గతంలో కూడా హైకోర్టును ఆశ్రయించగా కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశిం చారు. ఇప్పుడు అత్యవసర అంశంగా మరోసారి హైకోర్టును ఆశ్రయించాడు.
Comments
Please login to add a commentAdd a comment