హైదరాబాద్:మెడికల్ కాలేజీల వ్యవహారంలో ముడుపులు ముట్టాయంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన తెలంగాణ టీడీపీ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. దీనికి సంబంధించి తెలంగాణ న్యాయవాదులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రేవంత్ కు నోటీసులు జారీ చేశారు. ఐపీసీ సెక్షన్లు 504, 505 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.