సాక్షి, హైదరాబాద్: డిజిటల్ ఇండియా వీక్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో డిజిటలైజేషన్ విధానాన్ని విస్తృతంగా అమలు చేస్తున్న మీసేవ, హ్యాక్ ఐ, వెరీ ఫాస్ట్ విభాగాలకు చెందిన పలువురు అధికారులకు మంగళవారం ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అవార్డులు అందజేశారు. టెక్నికల్ సర్వీస్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న అదనపు డీజీపీ రవిగుప్తకు, ‘హ్యాక్ ఐ’ విభాగాన్ని చూస్తున్న అదనపు డీజీపీ అంజనీ కుమార్, ‘వెరీ ఫాస్ట్’ సాఫ్ట్‌వేర్‌ను నిర్వహిస్తున్న ఎస్పీ స్థాయి అధికారి ఎం.రమేశ్‌రెడ్డిలకు మంత్రి కేటీఆర్ అవార్డులు అందజేశారు.