కర్ణాటక అధికారులతో కలెక్టర్ గిరిజాశంకర్
ఆర్డీఎస్ ప్రధాన నిర్మాణంలో కర్నూలు రైతుల అభ్యంతరాలతో ఆగిన పనులను నిబంధనల మేరకు చేపడుతున్నందున పోలీసు బందోబస్తుతో పనులు కొనసాగించాలని కర్ణాటక అధికారులకు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ సూచించారు. మంగళవారం రాయచూర్ అసిస్టెంట్ కమిషనర్, గుల్బర్గా డీఐజీతో కలెక్టర్ గిరిజాశంకర్ మాట్లాడారు.
ఇందుకు స్పందించిన కర్ణాటక అధికారుల పనులను నిర్వహించేలా బందోబస్తు చర్యలు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆర్డీఎస్ ప్రధాన నిర్మాణంలో పనులు నిర్వహిస్తున్న ప్రభు కన్‌స్ట్రక్షన్ యజమానులతోనూ ఆయన మాట్లాడారు. పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ప్రకాష్‌తో మాట్లాడిన కలెక్టర్ కర్ణాటకలో పనుల పర్యవేక్షణ సంబంధిత ఇంజనీర్లను పంపాల్సిందిగా ఆదేశించారు.
పోలీస్ బందోబస్తుతో ఆర్డీఎస్ పనులు చేయండి
Published Wed, Jul 23 2014 3:17 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
Advertisement
Advertisement