
‘నగర’ పోరులో విద్యావంతులు
అచ్చంపేట : ప్రగతికి వెలుగులు పంచే రాజకీయానికి.. వికసించే విద్య తోడైతే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఎంతో కష్టపడి సాధించిన తెలంగాణ క్షేత్రస్థాయిలో అభివృద్ధి చెందాలంటే విద్యావంతుల నాయకత్వం అవసరం. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన విద్యావంతులు రాజకీయ ఆరంగేట్రం చేస్తున్నారు. అనుభవం లేకున్నా కొత్త ఆలోచనలతో అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. నగర పోరులో మొత్తం 57 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వారిలో 30 మందికి పైగా విద్యావంతులే ఉన్నారు.
వీరి ప్రచారాల సరళి కూడా ప్రత్యేకంగా నే ఉంది. ఓటర్లను ఆకట్టుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. ప్రజలు కూడా సమస్యలు తెలిసిన వారికి, చదువుకున్న వారికే అవకాశం కల్పించడానికి ఆసక్తి చూపుతున్నారు.