కూకట్‌పల్లి: కూకట్‌పల్లి నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థి సుహాసిని ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. గురువారం రాత్రి ఏడు గంటలకు ఆమె అల్లాపూర్ డివిజన్‌లోని గణేశ్ నగర్‌లో సమావేశం ఏర్పాటు చేసి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తుండగా టీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. అనంతరం కూకట్‌పల్లి నోడల్ అధికారి సురేందర్‌రావుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సుహాసినీని సమావేశం నుంచి పంపించివేశారు.
రాజకీయ పార్టీల నేతలు ఓటర్లకు తాయిలాల ఎర వేస్తున్నారు. మద్యం, డబ్బు, చికెన్, చీరలు.. ఇలా ఎక్కడ చూసినా ప్రలోభాల జాతర జోరుగా సాగుతోంది. పలురకాలుగా ఓటర్లను మచ్చిక చేసుకుని తమ పార్టీకే ఓటెయ్యాలని నాయకులు అభ్యర్థిస్తున్నారు. ఒక్కో గ్రామానికి కాటన్ల చొప్పున డంప్ చేస్తున్నారు. ఇక డబ్బు విషయంలోనూ ఇదే తంతు కొనసాగుతోంది.అభ్యర్థుల మధ్య తీవ్రపోటీ నెలకొంటే ఒక్కో ఓటుకు రూ.2 వేలు ఇవ్వడానికి నేతలు వెనకాడడం లేదు. తక్కువలో తక్కువగా రూ.500 నుంచి రూ.వెయ్యి అందజేస్తున్నారు. మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా తమ పార్టీలకు చెందిన వారి జాబితాను సిద్ధం చేసుకుని ఒక్కొక్కరికి ఫోన్లు చేసి పిలిపించి డబ్బులు, మద్యం ముట్టచెబుతున్నారు. ఈ బాధ్యతలను ఒక్కో గ్రామంలో ముగ్గురు నుంచి ఐదుగురికి అప్పగిస్తున్నారు. గురువారం తాయిళాల ఎర తారస్థాయికి చేరుకుంది.
మహేశ్వరంలో ఓ పార్టీ అభ్యర్థి తరఫున ఇంటింటికి కిలో చికెన్ చొప్పున అందజేయడం హాట్ టాపిక్‌గా మారింది. డబ్బు, మద్యం సరసన చికెన్ కూడా చేరిందని అందరూ చర్చించుకుంటున్నారు. మంచాల మండలం కొర్రవాని తండా వద్ద పత్తి వ్యాపారి నుంచి రూ.2లక్షలు పట్టుకున్నారు. ఎటువంటి ఆధారాలు లేకపోవడం వ్యాపారిని విచారిస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఎంబీఆర్ నగర్‌లోని ఓ ఇంట్లో ఎస్‌ఓటీ పోలీసులు సోదాలు చేయడంతో రూ.6.03 లక్షలు లభించాయి. అక్రమంగా మద్యాన్ని కలిగిఉండడంతోపాటు తరలిస్తుండగా 1086 లీటర్ల మద్యాన్ని సివిల్, ఎక్సైజ్ పోలీసులు వేర్వేరుగా స్వాధీనం చేసుకున్నారు. 11 బెల్ట్ షాపులను సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment