money distribute
-
ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రలోభాలు
-
డబ్బులు ఊరికే వస్తాయి!
డబ్బులు ఊరకే రావు... బాగా పాపులర్ అయిన ఓ వాణిజ్య ప్రకటన. కానీ ప్రస్తుతం డబ్బులు ఊరకే వస్తున్నాయి! ప్రతి ఊరికీ వెళ్తున్నాయి!!రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దాదాపు రెండు వారాల్లోనే కట్టలకు కట్టలు డబ్బు పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. ఇంకా నామినేషన్లు కూడా మొదలు కాకముందే ఓట్ల కొనుగోలు కోసం ప్రజలకు పంపిణీ చేయడానికి డబ్బు పంపిణీ మొదలైంది. డబ్బుతోపాటు ఫ్రీబీస్ (ఉచిత బహుమతులు) సైతం పంపిణీ అవుతున్నాయి. దీంతో వాటిని అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. డబ్బు మాదిరిగా ఇవి భారీ మొత్తాల్లో పట్టుబడకపోవడానికి ఏవి ఫ్రీబీస్.. ఏవి కావు అనే సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏవి ఉచితాలో పేర్కొంటూ వాణిజ్య పన్నుల శాఖ 26 అంశాలతో కూడిన జాబితాను జిల్లాల కలెక్టర్లు, పోలీసులు, ఎన్నికల అధికారులకు పంపింది. తనిఖీల్లో పట్టుబడే ఉచితాలపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆయా వస్తువులు రవాణా అవుతున్నా లేదా భారీ స్థాయిలో గోదాముల్లో నిల్వ ఉన్నా తమకు తెలియజేయాలని పేర్కొంది. యూపీఐ పేమెంట్లపైనా నిఘా.. డబ్బు పంపిణీ సైతం గతంలోలా నగదు రూపేణానే కాకుండా యూపీఐ (గూగుల్‌పే/ఫోన్‌పే/పేటీఎం) చెల్లింపుల ద్వారా కూడా భారీగా జరుగుతుండటంతో వాటిపైనా ఎన్నికల అధికారులు నిఘా వేశారు. ఆయా వివరాల కోసం ఆర్బీఐ, బ్యాంకు మేనేజర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకే ఖాతా నుంచి ఎక్కువ లావాదేవీలు జరిగితే వివరాలు అందజేయాల్సిందిగా కోరుతున్నారు. ఇప్పటివరకు రూ.307 కోట్లు స్వాదీనం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 21వ తేదీ వరకు పట్టుకున్న నగదు, మద్యం, సరుకులు, ఫ్రీబీస్, తదితరాల మొత్తం విలువ రూ. 307 కోట్లు కాగా, వీటిల్లో ఫ్రీబీస్ విలువ రూ.26.93 కోట్లు. వివిధ మార్గాల ద్వారా నిఘా.. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఆన్లైన్ ద్వారా డబ్బు పంపిణీ చేపట్టినా అడ్డుకొనేందుకు నిఘా పెట్టాం. ఒకే ఖాతా నుంచి వందల మందికి ఒకే మొత్తంలో (ఉదాహరణకు రూ.500, 2,000, 5,000,10,000 చొç³్పున) గూగుల్‌పే/ఫోన్‌పే/పేటీఎం ద్వారా ట్రాన్స్ఫర్ జరుగుతోందో లేదో పరిశీలిస్తాం. ఒకే బ్యాంకు ఖాతాలో భారీగా నగదు జమ చేసినా పరిశీలిస్తాం. అనుమానాస్పద లావాదేవీలపై విచారణ చేపడతాం. – రోనాల్డ్‌రాస్, హైదరాబాద్ ఎన్నికల అధికారి జాబితాలోని ఫ్రీబీస్ ఇవే.. 1.సీలింగ్ ఫ్యాన్లు 2.ప్రెషర్ కుక్కర్లు 3. మిక్సర్లు, గ్రైండర్లు 4.చీరలు 5.కుట్టు మిషన్లు 6.స్టెయిన్లెస్ స్టీలు పాత్రలు 7.ఎల్రక్టానిక్ వస్తువులు/టీవీ సెట్స్ 8. గోడ గడియారాలు 9.క్రికెట్ కిట్స్ 10. జ్యువెలరీ ఐటమ్స్ 11.ఇతర క్రీడాపరికరాలు 12.బెడ్‌షీట్స్/టవల్స్ 13.గడియారాలు 14.సైకిళ్లు, బైక్‌లు 15.కాస్మెటిక్స్ 16. జిమ్ పరికరాలు 17. బంగారం లేదా వెండి పూత వస్తువులు (ఇమిటేషన్ జ్యువెలరీ) 18. కుంకుమ భరిణెలు 19. మొబైల్ ఫోన్లు 20. రెడీమేడ్ గార్మెంట్స్ 21.స్కూల్ బ్యాగ్స్ 22. టీషర్ట్స్ 23. టార్చిలైట్లు 24. టాయ్స్ 25. ట్రావెల్ బ్యాగ్స్/సూట్‌కేస్‌లు 26. గొడుగులు - చెరుపల్లి వెంకటేశ్ -
వీళ్లు ఎవరికీ చిక్కరు.. దొరకరు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: బీద క్యాంపులో ఆర్థిక అలజడికి తెరలేచింది. వారం రోజులుగా బీద క్యాంపు చుట్టూ అధికార పార్టీ అభ్యర్థులు చక్కర్లు కొడుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆర్థిక వ్యవహారం అంతా బీద బ్రదర్స్ చూసుకుంటారని జిల్లాకు వచ్చినప్పుడు అభ్యర్థులకు చెప్పి వెళ్లారు. అయితే ఇప్పటివరకూ రూపాయి కూడా విదల్చలేదని కొందరు అభ్యర్థులు బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారు. మరికొందరైతే డబ్బులు ఇవ్వకుండానే పెత్తనం చేస్తున్నారని కినుకు వహిస్తున్నారు. దీనికితోడు వైఎస్సార్సీపీలోకి నేతలు పెద్ద ఎత్తున వలసల బాట పట్టడంతో అధికార పార్టీకి చెందిన క్యాంపు సతమతమవుతోది. ఇక అందర్నీ సమన్వయం చేయాల్సిన జిల్లా అధ్యక్షుడు, బీద మస్తాన్‌రావు సోదరుడు రవిచంద్ర చిక్కడు.. దొరకడు తరహాలో తప్పించుకుని తిరుగుతుండడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అధికార పార్టీ నుంచి అభ్యర్థులుగా దిగిన వారిలో ఒకరు ఇద్దరు మినహా అందరూ బడాబాబులే. దీంతో పెద్ద ఖర్చు లేకుండా ఎన్నికల బరిలో తలపడవచ్చన్న బీద బ్రదర్స్‌కు అభ్యర్థులు చుక్కలు చూపిస్తున్నారు. జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థులను విడతల వారీగా ప్రకటించారు. చివరకు నెల్లూరు రూరల్, కావలికి అభ్యర్థి దొరక్క మొదట తిరస్కరించిన నేతలకే టికెట్లు ఇచ్చారు. దీంతో మొదట భారీగా ఖర్చు పెడతామని ప్రచారం చేసుకున్న నేతలు అంతా సర్దుకున్నారు. అసలే పార్టీ పరిస్థితి చూస్తే మెరుగ్గా లేకపోవడం, రూ.కోట్లు ఖర్చు చేసినా గెలిచే పరిస్థితి లేదని అర్థమైన నేతలు భారీగా ఖర్చు చేయడానికి ముందుకు రావడం లేదు. ఏదో బీద ఇస్తే ఖర్చు చేయాలనే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ పరిస్థితి అర్థమైన బీద పార్లమెంట్ స్థానానికి పోటీ చేయనని మొండికేసిన బీద మస్తాన్‌రావు ఎట్టకేలకు పార్టీ అధినేత ఒత్తిడితో ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి ఎంత సర్దుబాటు చేయాలనే దానిపై బీద బ్రదర్స్ తలలు పట్టుకుని కుర్చోన్నారు. ఎవరెవరికి ఎంత ఇవ్వాలనేది ముందుగానే చంద్రబాబు ఫైనల్ చేసి నేతలకు చెప్పి వెళ్లినట్లు సమాచారం. అయితే గత వారం నుంచి మినీబైపాస్ రోడ్డులోని బీద క్యాంపుల్లో మాత్రం రోజు అభ్యర్థులు ఆర్థిక మంతనాలు చేస్తూనే ఉన్నారు. ప్రధానంగా కావలి అభ్యర్థిగా కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డిని బీద సోదరుల మద్దతుతో టికెట్ ఇచ్చారు. ఆయన ఖర్చు మొత్తం కూడా తామే చూసుకుంటామని చెప్పారు. నామినేషన్ ఘట్టం, స్క్రూటినీ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఒక్క రూపాయి ఇవ్వకపోవడంతో విష్ణువర్ధన్‌రెడ్డి కినుక వహించినట్లు సమాచారం. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు రెండో సారి టికెట్ ఇచ్చారు. ఇప్పటికే ఆర్థిక పరిస్థితి లేక చేతులెత్తేసిన క్రమంలో ఎంపీ అభ్యర్థి చూసుకుంటాడని చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు ఆర్థిక వ్యవహరాలు కూడా మాట్లాడుకున్నారు. కానీ డబ్బులు మాత్రం చేతికి అందలేని బొల్లినేని నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూ తన పని తన ఓటు మాత్రమే తాను చూసుకుంటున్నట్లు సమాచారం. ఇక నెల్లూరు రూరల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నగర మేయర్ అబ్దుల్ అజీజ్‌ది మాత్రం విచిత్ర పరిస్థితి. గతంలో నెల్లూరు రూరల్ లేదంటే సిటీ టికెట్ కోసం బలంగా ప్రయత్నాలు చేసిన అజీజ్ భంగపడ్డారు. నెల్లూరు పార్లమెంట్ టికెట్ అయినా తనకు ఇస్తే గట్టిగానే ఖర్చు పెట్టుకుంటానని సీఎంకు మొర పెట్టుకున్నాడు. అయితే చివరి నిమిషంలో నెల్లూరు రూరల్ టికెట్ దక్కడంతో ఆర్థికంగా పూర్తిగా చేతులెత్తేసి మీరే అంతా చూసుకోవాలని చెప్పినట్లు సమాచారం. దీంతో నగర అభ్యర్థిగా బరిలో ఉన్న మంత్రి నారాయణ, ఎంపీ అభ్యర్థి నుంచి సహకారం ఉంటుందని చెప్పారు. అయితే మంత్రి నారాయణ సహకారం మొదలయింది కానీ పెత్తనం అంతా నారాయణ క్యాంప్దే కావడంతో మేయర్ వర్గంలో తీవ్ర అలజడి రేగింది. కేవలం ఎన్నికల ప్రచారంలో నమస్కారం పెట్టుకుంటూ తిరగడానికే మేయర్ పరిమతం అయినట్లు సమాచారం. ఇక రాత్రి వ్యవహారాలన్ని నారాయణ క్యాంపు నుంచి ఆయన సన్నిహితుడు తన సొంత టీమ్‌తో నడుపుతుండటంతో అజీజ్ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక మరో అసెంబ్లీ అభ్యర్థికి ఆ నియోజకవర్గంలో భారీ వలసలు షాక్‌ను ఇచ్చాయి. దీంతో సదరు అభ్యర్థి కుటుంబ సభ్యులు ఎంత ఖర్చు చేసినా గెలవలేము.. కాబట్టి డబ్బు ఖర్చు చేయొద్దని సదరు అభ్యర్థి కుమారుడు గట్టిగా చెప్పటంతో అక్కడ గందరగోళం రేగింది. దీంతో అప్పటి దాక ఎంపీ అభ్యర్థి నుంచి ఆర్థిక సహకారం వద్దన్న సదరు అభ్యర్థి రెండు రోజుల నుంచి అభ్యర్థి క్యాంపు చుట్లూ చక్కర్లు కొడుతున్నాడు. మొత్తం మీద ఒక్క అభ్యర్థికి కూడా చెప్పినది ఇవ్వకుండా ఇంకా బాబు గారి నుంచి అనుమతి రాలేదంటూ కాలం గడుపుతుండటం పార్టీలో చర్చనీయాశంగా మారింది. -
కూటమి అభ్యర్థి సుహాసిని కోడ్ ఉల్లంఘన
కూకట్పల్లి: కూకట్పల్లి నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థి సుహాసిని ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. గురువారం రాత్రి ఏడు గంటలకు ఆమె అల్లాపూర్ డివిజన్లోని గణేశ్ నగర్లో సమావేశం ఏర్పాటు చేసి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తుండగా టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. అనంతరం కూకట్పల్లి నోడల్ అధికారి సురేందర్‌రావుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సుహాసినీని సమావేశం నుంచి పంపించివేశారు. రాజకీయ పార్టీల నేతలు ఓటర్లకు తాయిలాల ఎర వేస్తున్నారు. మద్యం, డబ్బు, చికెన్, చీరలు.. ఇలా ఎక్కడ చూసినా ప్రలోభాల జాతర జోరుగా సాగుతోంది. పలురకాలుగా ఓటర్లను మచ్చిక చేసుకుని తమ పార్టీకే ఓటెయ్యాలని నాయకులు అభ్యర్థిస్తున్నారు. ఒక్కో గ్రామానికి కాటన్ల చొప్పున డంప్ చేస్తున్నారు. ఇక డబ్బు విషయంలోనూ ఇదే తంతు కొనసాగుతోంది.అభ్యర్థుల మధ్య తీవ్రపోటీ నెలకొంటే ఒక్కో ఓటుకు రూ.2 వేలు ఇవ్వడానికి నేతలు వెనకాడడం లేదు. తక్కువలో తక్కువగా రూ.500 నుంచి రూ.వెయ్యి అందజేస్తున్నారు. మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా తమ పార్టీలకు చెందిన వారి జాబితాను సిద్ధం చేసుకుని ఒక్కొక్కరికి ఫోన్లు చేసి పిలిపించి డబ్బులు, మద్యం ముట్టచెబుతున్నారు. ఈ బాధ్యతలను ఒక్కో గ్రామంలో ముగ్గురు నుంచి ఐదుగురికి అప్పగిస్తున్నారు. గురువారం తాయిళాల ఎర తారస్థాయికి చేరుకుంది. మహేశ్వరంలో ఓ పార్టీ అభ్యర్థి తరఫున ఇంటింటికి కిలో చికెన్ చొప్పున అందజేయడం హాట్ టాపిక్‌గా మారింది. డబ్బు, మద్యం సరసన చికెన్ కూడా చేరిందని అందరూ చర్చించుకుంటున్నారు. మంచాల మండలం కొర్రవాని తండా వద్ద పత్తి వ్యాపారి నుంచి రూ.2లక్షలు పట్టుకున్నారు. ఎటువంటి ఆధారాలు లేకపోవడం వ్యాపారిని విచారిస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఎంబీఆర్ నగర్‌లోని ఓ ఇంట్లో ఎస్ఓటీ పోలీసులు సోదాలు చేయడంతో రూ.6.03 లక్షలు లభించాయి. అక్రమంగా మద్యాన్ని కలిగిఉండడంతోపాటు తరలిస్తుండగా 1086 లీటర్ల మద్యాన్ని సివిల్, ఎక్సైజ్ పోలీసులు వేర్వేరుగా స్వాధీనం చేసుకున్నారు. 11 బెల్ట్ షాపులను సీజ్ చేశారు. -
జోరుగా ప్రలోభాల పర్వం
అమీర్‌పేట, రామ్‌గోపాల్‌పేట: ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుండటం, పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రజాకూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ ప్రలోభాల పర్వానికి తెరలేపింది. స్థానిక నేతల అనుచరులతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారి అనుమాయులూ రంగంలోకి దిగారు. ఆదివారం అర్ధరాత్రి ఓ టీడీపీ అభ్యర్థికి చెందినవిగా అనుమానిస్తున్న రూ.70 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ఏపీ టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు నలుగురిని అమీర్‌పేట ప్రాంతంలో పట్టుకున్నారు. వీరి నుంచి రూ.4.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఈ నగదు వినియోగిస్తున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కారులో తరలిస్తున్న రూ.70 లక్షల నగదును వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, రాంగోపాల్‌పేట్ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం రాత్రి భవ్య సిమెంట్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్న శివకుమార్ తన కారులో సింధీకాలనీ నుంచి శేరిలింగంపల్లికి రూ.70లక్షల నగదు తీసుకుని వెళుతుండగా విశ్వసనీయ సమాచారంతో టాస్క్‌ఫోర్స్, రాంగోపాల్‌పేట్ ఇన్స్పెక్టర్లు గట్టు మల్లు, బాబు సిబ్బందితో కలిసి సింధీకాలనీలో కారును అడ్డుకుని సోదా చేయగా చేయగా నగదు లభ్యమైంది. ఆ నగదుకు సంబంధించి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. తన యజమాని సూచన మేరకు సింధీకాలనీలోని డబ్బును శేరిలింగంపల్లికి తరలిస్తున్నట్లు శివకుమార్ పోలీసు విచారణలో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లామని కోర్టు ఆదేశాల ప్రకారం కేసు నమోదు చేయనున్నట్లు ఇన్స్పెక్టర్ బాబు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల పట్టివేత సనత్‌నగర్ నియోజకవర్గానికి చెందిన ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ఏపీ నుంచి వచ్చి అమీర్‌పేటలోని ఓ హోటల్లో తిష్టవేసిన నలుగురు వ్యక్తులను సోమవారం తెల్లవారుజామున ఎస్సార్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.4.63 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అమీర్‌పేట సిల్వర్ పార్క్ లాడ్జిలో గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు తిష్టవేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు ఆరోపిస్తూ టీఆర్ఎస్ నాయకులు ఆదివారం అర్ధరాత్రి హోటల్ ఎదుట ఆందోళనకు దిగారు. అదే సమయంలో టీడీపీ నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. దీనిపై సమాచారం అందడంతో ఎస్సార్‌నగర్ పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. గోషామాల్ ఏసీపీతో పాటు ఎన్నికల స్పెషల్ టీం తనిఖీ చేపట్టగా ఇన్నోవా వాహనంలో రూ.2 లక్షలు, లాడ్జి గదుల్లో నుంచి రూ.2.63 లక్షల నగదు లభించింది. లాడ్జిలో మకాం వేసిన గుంటూరు వాసి సాంబశివరావు, తెనాలికి చెందిన అనంతకుమార్, వెంకటేశ్వర్రావు, ఎండీ సలీంలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరు గుంటూరు జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే అనుచరులైన వీరు సనత్‌నగర్ టీడీపీ అభ్యర్థి తరఫున డబ్బు పంపిణీ చేసేందుకు వచ్చినట్లు భావిస్తున్నారు. ఇదే సమయంలో సనత్ నగర్ టీడీపీ అభ్యర్థి కూన వెంకటేష్‌గౌడ్... గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతతో ఫోన్లో మాట్లాడినట్లు ఉన్న వాయిస్ రికార్డులో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో వీటినీ పరిగణలోకి తీసుకున్న పోలీసుల న్యాయ సలహా అనంతరం తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దర్యాప్తులో అనిల్‌కుమార్ కేసు... టీడీపీ నేత వల్లభనేని అనిల్‌కుమార్ కేసు ఇప్పటికే దర్యాప్తులో ఉంది. హైదరాబాద్ నుంచి జగిత్యాలకు హుండీ మార్గంలో పంపుతున్న రూ.60 లక్షలకు సంబంధించి అక్టోబర్ మూడో వారంలో ఇది నమోదైంది. ఈ నగదును తెలంగాణ రాష్ట్ర తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్, జూనియర్ ఆర్టిస్ట్స్ యూనియన్ సెక్రటరీ వల్లభనేని అనిల్ కుమార్, అతడి స్నేహితుడు సైఫాబాద్‌కు చెందిన వర్మ సమర్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆయన వాహనంలోనే, సొంత డ్రైవర్ తరలించారని తేల్చారు. ఈ కేసు ఇప్పటికే దర్యాప్తులో ఉన్న విషయం విదితమే. -
కొనసాగుతున్న 'పచ్చ' ప్రలోభాలు
కడప: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నాయకుల ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. డబ్బు, మద్యం పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం పెద్దశింగనపల్లిలో డబ్బులు పంచుతూ ఇద్దరు టీడీపీ కార్యకర్తలు పోలీసులకు పట్టుబడ్డారు. దువ్వూరు మండలం చిన్నశింగనపల్లిలో ఓటర్లకు డబ్బులు పంచుతుండగా టీడీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.2.40లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి, రూ.90 వేలు పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు వైఎస్ఆర్ సెంటర్లో టీడీపీ నేతలకు చెందిన 20 కేసుల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.