కొనసాగుతున్న 'పచ్చ' ప్రలోభాలు | tdp activists distribute money for votes in andhra pradesh | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న 'పచ్చ' ప్రలోభాలు

Published Mon, May 5 2014 9:21 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

కొనసాగుతున్న 'పచ్చ' ప్రలోభాలు - Sakshi

కొనసాగుతున్న 'పచ్చ' ప్రలోభాలు

కడప: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నాయకుల ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. డబ్బు, మద్యం పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం పెద్దశింగనపల్లిలో డబ్బులు పంచుతూ ఇద్దరు టీడీపీ కార్యకర్తలు పోలీసులకు పట్టుబడ్డారు.

దువ్వూరు మండలం చిన్నశింగనపల్లిలో ఓటర్లకు డబ్బులు పంచుతుండగా టీడీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.2.40లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి, రూ.90 వేలు పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు వైఎస్‌ఆర్‌ సెంటర్‌లో టీడీపీ నేతలకు చెందిన 20 కేసుల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement