
పట్టణంలో ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్న ఆయన సతీమణి మంజుల
సాక్షి, కొత్తకోట: ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల గెలుపు కొరకు కుటుంబ సభ్యులు ప్రచారం ముమ్మరం చేశారు. దేవరకద్ర టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తరపున ఆయన సతీమణి ఆల మంజుల అదివారం సాయంత్రం పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ కారుగుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్బంగా ఓటర్లతో ఆమె మాట్లాడుతూ గడిచిన నాలుగున్నరేళ్లలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ది చేశారని, మరోసారి అవకాశం ఇస్తే ఇంకెంతో అభివృద్ది చే స్తారన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్దిని చూసి కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రి చేసుకునేందుకు ప్రతి ఒక్కరు కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు.
ప్రచారంలో ఎంపీపీ గుంతమౌనిక, మాజీ సర్పంచ్‌లు భీసం చెన్నకేశవరెడ్డి, సాక బాలనారాయణ, గాడీల ప్రశాంత్, అమ్మపల్లి బాలకృష్ణ, సత్యంయాదవ్, కో ఆఫ్షన్ సభ్యులు ఘని, బాబురెడ్డి, లతీఫ్, హన్మంత్‌యాదవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment