జీవ ఎరువులకు కేంద్రం సబ్సిడీ ఎంత? | ponguleti srinivas reddy ask subsidy on fertilizers | Sakshi
Sakshi News home page

జీవ ఎరువులకు కేంద్రం సబ్సిడీ ఎంత?

Published Thu, Nov 27 2014 2:06 AM | Last Updated on Tue, Aug 21 2018 5:36 PM

జీవ ఎరువులకు కేంద్రం సబ్సిడీ ఎంత? - Sakshi

జీవ ఎరువులకు కేంద్రం సబ్సిడీ ఎంత?

* లోక్‌సభలో వైఎస్సార్ సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్న

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఆహార భద్రత మిషన్ (నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ -ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) కింద జీవ రసాయన ఎరువులకు ఇస్తున్న సబ్సిడీలో పెరుగుదల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏయే రాష్ట్రానికి ఎంత ఇస్తున్నారు, వాణిజ్య పంటలపై సబ్సిడీ పెంపు ప్రతిపాదనలు తెలియజేయాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని వైఎస్సార్‌సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. దీనికి సంబంధిత మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం కింద సబ్సిడీని రూ.100 నుంచి రూ.300కి పెంచినట్టు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రాల వారీగా 2014-15 ఏడాదికి ఆంధ్రప్రదేశ్ రూ.46 లక్షల 95 వేలు, తెలంగాణకు రూ. 11 లక్షల 20 వేలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వాణిజ్య పంటలకు సబ్సిడీ పెంపు ప్రతిపాదనలేవీ లేవన్నారు. జంతు సంక్షేమశాలల (యానిమల్ హాస్టల్ స్కీం)పై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ..అలాంటి ప్రతిపాదనలేవీ లేవని, గుజరాత్‌లో అమల్లో ఉన్న ఈ పథకాన్ని పరిశీలించి, అభిప్రాయ సేకరణ కోసం నివేదికలను రాష్ట్రాలకు పంపినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement