
'చర్యలు తీసుకోపోతే కుమ్మకైనట్టే'
కరీంనగర్: ఎన్నికల్లో గెలవడానికే కేసీఆర్ హామీలిచ్చారు తప్పా నేరవేర్చడానికి కాదని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. పథకాల అమలుకు టీఆర్ఎస్ కృషి చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వ పథకాల్లో అక్రమాలను వెలికితీసి చర్యలు తీసుకోపోతే అక్రమార్కులతో కేసీఆర్ కుమ్మకైనట్టేనని అన్నారు.
తన ఉనికిని కాపాడుకోవడానికి జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలపై మంత్రి హారీశ్‌రావు విమర్శలు చేస్తున్నారని అన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దని సూచించారు. విద్యా సంవత్సరాన్ని వాయిదా వేసి విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేయోద్దని కోరారు.