
మణెమ్మ
గోపాల్‌పేట (వనపర్తి): బు ద్దా రం గ్రామానికి చెందిన ఎం. మణెమ్మ (58) గతనెల 24న చనిపోయింది. మహబూబ్‌నగర్‌లోని ట్రాన్స్‌కో కార్యాలయంలో విధులు ని ర్వహించే మణెమ్మ రోజులా గే ఇంటికి వస్తుండగా జడ్చర్ల బ్రిడ్జివద్ద చనిపో యింది. కుటుంబసభ్యులు మరుసటి రోజు అం త్యక్రియలు జరిపించారు.
అయితే ఆమె మృ తిపై కూతురు శ్వేతకు అనుమానం రావడంతో ఈనెల 7వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం మహిళ మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. జడ్చర్ల ఏఎస్‌ఐ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ రవి, తహసీల్‌దార్ ఏసయ్య సమక్షంలో పోస్టుమార్టం జరిగింది. త్వరలో మృతికి గల కారణాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.