స్థల(షెడ్) ఎంపిక
ముందుగా కోళ్ల పెంపకం సంఖ్యను దృష్టిలో ఉంచుకొని, భవి ష్యత్‌లో పరిశ్రమ విస్తరణను బట్టి స్థల(షెడ్) ఎంపిక చేసుకోవాలి. ఫారానికి చుట్టుపక్కల ఉన్న స్థలం కంటే కొంచెం ఎత్తు, ఇతర కోళ్ల ఫారాల నుంచి 3-5 కిలోమీటర్ల దూరంలో ఉండే విధంగా స్థలాన్ని చూసుకోవాలి. ఎత్తై స్థలంలో ఫారాన్ని నిర్మించడం వల్ల వర్షాకాలంలో నీరు చుట్టుపక్కల నిల్వలేకుండా ఉండి గాలి, వెలుతురు లభిస్తాయి. షెడ్ వెడల్పు 25-30 అడుగులు ఉండాలి. నేల కాంక్రీటుతో నిర్మించినదైతే ఎలుకలు మొదలైన వాటి నుంచి రక్షణగా ఉంటుంది. షెడ్ ముఖద్వారం వద్ద లోపలికి ప్రవేశించే వారి కాళ్లు పాదాలు లోషన్ నీటిలో తడిసేలాగా ఫుట్‌పాత్ నిర్మించాలి.
కోళ్ల జాతుల ఎంపిక
బ్రాయిలర్ కోళ్లలో వెంకాబ్, హబ్బర్డ్, సామ్రాట్, కారిబ్ వంటి రకాలు, లేయర్ కోళ్లలో బీవీ.-300, హైసెక్ర, హెచ్‌హెచ్. 260 వంటి రకాలు లభ్యవుతున్నాయి. ఫారం ప్రారంభించేవారు ఎన్ని కోళ్లతో ప్రారంభించాలో నిర్ణయించుకోవాలి. కావలసిన వారు నెలరోజుల ముందుగా హెచరీస్ వారికి తెలిపి, డబ్బు చెల్లించా ల్సి ఉంటుంది. కోళ్ల ఫారం ప్రారంభించేందుకు ముందుగా ప్రాజెక్ట్ తయారు చేసుకొని, ఎన్ని కోళ్లతో ప్రారంభించాలో నిర్ణయించుకోవాలి. వాటికి అయ్యే ఖర్చు(కోడి పిల్ల ఖరీదు, దాణా, పనివారు, విద్యుత్, నీరు, షెడ్డు నిర్మాణం) వాటి ద్వారా సాలుకు వచ్చే రాబడి అంచనా వివరాలతో బ్యాంకువారి దగ్గరకు వెళ్లిన, వారు రైతు వద్ద ఉన్న ఆదాయ, వ్యయాలను, రైతు చేసిన పెట్టుబడిని దృష్టిలో ఉంచుకొని 75 శాతం వరకు రుణం మంజూరు చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన 4వ వంతు రైతు భరించాలి. రుణాన్ని నెలసరి వాయిదాల్లో చెల్లించే వీలుంది.
బ్రూడింగ్ ఏర్పాటు చేయాలి
కోడిపిల్లలు వచ్చే ముందుగానే షెడ్డు నిర్మాణం, బ్రూడింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలి. బ్రూడింగ్ అన గా కృత్రిమంగా వేడిని కల్పించడం. పిల్లలను తెచ్చిన వెంటనే నీటిని తాగించి బ్రూడర్‌లో వదిలిపెట్టాలి. వెచ్చని ఉష్ణోగ్రత కోసం సాధారణంగా విద్యుత్‌ను వినియోగిస్తారు. బ్రూడింగ్ అనేది సాధారణంగా బ్రాయిలర్, లేయర్ పిల్లలకు డీప్‌లిట్టర్ పద్ధతిలోనే ఏర్పాటు చేయాలి. బ్రాయిలర్స్‌ను 6 వారాల వయస్సు వచ్చే సరికి మార్కెటింగ్ చేయాలి. అప్పటివరకు వీటిని డీప్‌లిట్టర్‌లోనే పెంచాలి.
లేయర్ కోళ్ల పెంపకంలో 2 పద్ధతులున్నాయి. ఒకరోజు వయసు ఉన్న పిల్లలను తెచ్చి గుడ్లు పెట్టడం వరకు పోషించాలి. అనగా 72 వారాల వయస్సు వచ్చే వరకు. 16 వారాల వయస్సు గల పిల్లలను తెచ్చుకొని, 72 వారాల వరకు పోషించడం రెండో పద్ధతి. సాధారణంగా లేయర్ కోళ్లను 9వ వారం లేదా 19వ వారం నుంచి కాని డీప్‌లిట్టర్ నుంచి కేజేస్‌లోకి మార్చి పెంచుతారు. డీప్‌లిట్టర్ అనగా ఆయా ప్రాంతాల్లో చౌకగా లభించే పదార్థాలైన వరి, వేరుశనగ, రంపపు పొట్టు, చెరకు పిప్పి వంటి వాటిని కింద పరచి పెంచుతారు. అయితే ఈ పొట్టు ఎల్లప్పుడూ పొడిగా ఉండేటట్లు చూడాలి.
కోళ్ల దాణా
బాయిలర్ కోళ్ల పోషణలో మొదటి 4 వారాల వయస్సు వచ్చేవరకు చిన్న పిల్లలకు 22 శాతం మాంసకృత్తులు, 2900 కిలో కెలరీల శక్తి అవసరం. అదే 5, 6 వారాల వయస్సు గల వాటికి 20 శాతం మాంసకృత్తులు, 3000 కిలో కెలరీల శక్తి అవసరం.
నీరు
కోళ్లు సాధారణంగా అవి తిన్న దాణాకు రెట్టిం పు నీటిని తాగుతాయి. అలా అందించే నీరు పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఉండాలి. నీటిలో అవసరమైతే అయోడిన్ లేదా వాటర్ శానిటైజర్లను వాడి నీటిని వినియోగించడం మేలు.
వ్యాధులు
సాధారణంగా డీప్‌లిట్టర్ పైన పెంచే కోళ్ల లో అంతర పరాన్న జీవుల బెడద ఎక్కువ గా ఉంటుంది. దాని నివారణకు ప్రతి 30 రోజులకు ఒకసారి డీవర్మింగ్ మందులు వాడాలి. కేజెస్‌లో పెంచే కోళ్లకు ప్రతి 3 నెలలకు ఒకసారి డీవర్మింగ్ మందు వా డాలి. వ్యాధులు రాకుండా ముందు జా గ్రత్తగా టీకాలను వేయాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి కొక్కెర తెగులు రాకుండా టీకా వేయించాలి.
కోళ్లపెంపకం..లాభదాయకం
Published Tue, Sep 23 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM
Advertisement
Advertisement