Poultry Breeding
-
తక్కువ కాలంలో లాభాలు తెచ్చిపెట్టే పౌల్ట్రీ ఫామ్
-
14 పందులతో మొదలు నేడు 150కి సంఖ్య.. కిలోకు 280 చొప్పున అమ్మకం
తక్కువ కాలంలో మంచి నికరాదాయం పొందాలనుకుంటే సీమ పందుల పెంపకం చేపట్టడం ఒక్కటే మార్గం అంటున్నారు యువ మహిళా రైతు రాచెల్లి అనూష. తెలంగాణ రాష్ట్రం జిల్లా కేంద్రం సిద్దిపేటకు 12 కిలో మీటర్ల దూరంలోని మల్యాలకు చెందిన అనూష సీమ పందులను పెంచుతూ చక్కటి ఆదాయాన్ని గడిస్తున్నారు. పట్టభద్రురాలైన అనూష తన భర్త మల్లేశం ప్రోత్సాహంతో తన నాలుగు ఎకరాల పొలంలో మూడేళ్ల క్రితం నుంచి స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక కష్టనష్టాల పాలయ్యారు. ఆవులు, గేదెలు, గొర్రెలు, నాటుకోళ్లు, కంజు పిట్టలు, కుందేళ్లు, కొర్రమీను చేపలు.. ఏవి పెంచినా కలిసిరాలేదు. మూడేళ్లు తిప్పలు పడిన తర్వాత వెటర్నరీ కళాశాలకు చెందిన నిపుణులు డా. ప్రసాద్, డా. విద్య సలహా మేరకు సీమ పందుల ఫాంను ఏర్పాటు చేసుకొని చక్కని ఆదాయం పొందుతున్నారు. పందులు పెంచటం ఏమిటని బంధువులు వారించినా పట్టించుకోకుండా భర్త సహకారంతో 2020 మార్చిలో 14 సీమ పందులను కొని తెచ్చుకొని పెంపకం ప్రారంభించారు. లార్ట్ వైట్ యార్క్ షేర్, ల్యాండ్రెస్, డ్యూరార్, లార్జ్ బ్లాక్ యార్క్ షేర్ వంటి సంకర జాతి పందులను ఆమె పెంచుతున్నారు. ఫాంలో ఇప్పుడు వాటి సంఖ్య 150కి పెరిగింది. ఫాం సమీపంలోనే ఇంటిని నిర్మించుకొని నిరంతరం తానే స్వయంగా అన్ని పనులూ చేసుకోవటం ద్వారా అనూష చక్కటి ఫలితాలు పొందుతున్నారు. మార్కెటింగ్ సమస్య లేదని అంటూ.. కర్ణాటక, అస్సాం తదితర రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారులు వచ్చి సీమ పందులను కొనుక్కెళ్తున్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల నుంచి రైతులు వచ్చి ఫాంను చూసి, పిల్లలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారన్నారు. వారానికో రోజు పంది మాంసాన్ని కిలో రూ. 280 చొప్పున ఫాం దగ్గరే విక్రయిస్తున్నారు. మార్కెటింగ్ సమస్య లేదు! సీమ పందులకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. పోటీ తక్కువ. శ్రమ తక్కువ. ఆదాయం ఎక్కువ. మార్కెటింగ్ సమస్య లేదు. ఒక ఎకరం భూమి సాగు చేస్తే ఎంత ఆదాయం వస్తుందో రెండు పందులను పెంచితే అంతే ఆదాయం వస్తుంది. దాణా, గడ్డి రోజుకు రెండు సార్లు వేయాలి. ఎప్పుడైనా వీలుకాకపోతే సాయంత్రం వేయకపోయినా పర్వాలేదు. 200 పందులను ఒక్కరే చూసుకోవచ్చు. పందులను సాదుకుంటూ వ్యవసాయం కూడా చేసుకోవచ్చు. – రాచెల్లి అనూష, యువ రైతు 75 రోజుల్లో 20 కేజీలు కోతకు అమ్మే పందులను, బ్రీడింగ్ కోసం అమ్మే పందులను ప్రత్యేక షెడ్లు వేసి వేర్వేరుగా పెంచుతున్నారు. పంది పిల్ల 75 రోజుల్లో 20 కేజీల బరువు పెరుగుతుందని అనూష వివరించారు. బ్రీడింగ్ కోసం 20 కేజీల బరువు పెరిగిన తర్వాత విక్రయిస్తున్నారు. మాంసం కోసం కోతకైతే సుమారుగా 80 కిలోలకు పైగా బరువు పెరిగిన తర్వాత విక్రయిస్తున్నారు. బ్రీడింగ్ పందులకు గడ్డితో పాటు రెండు పూటలా దాణా పెడుతున్నారు. కోతకు వెళ్లే పందులకు హోటళ్లలో మిగిలిన ఆహారాన్ని కూడా మేపుతున్నారు. పశు వైద్యుడు డా. అభిలాష్ సూచనల మేరకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. అనేక వ్యాక్సిన్లతోపాటు, ఇతర ఇంజక్షన్లను క్రమం తప్పకుండా ఇస్తూ నాణ్యమైన మేతను అందిస్తే సీమపందుల పెంపకం సులభమేనని అంటారు అనూష భర్త మల్లేశం (97044 99873). – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట ; ఫోటోలు: కె. సతీష్ కుమార్ (చదవండి: సీఎం జగన్ స్పూర్తిగా.. మహారాష్ట్రలో లక్షా 11వేల మొక్కలు నాటే కార్యక్రమం) -
పౌల్ట్రీ రంగంలో లాభాలతో దూసుకుపోతున్న రిటైర్ ఆర్మీ ఉద్యోగి
-
శాస్త్రవేత్తల నూతన ఆవిష్కరణ.. పెట్టలు మాత్రమే పుట్టేలా..!
సాక్షి, అమరావతి: పౌల్ట్రీ రంగంలో ఆడ కోడి పిల్లలు మాత్రమే పుట్టేలా ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు నూతన ఆవిష్కరణ చేశారు. మగ కోడి పిల్లలు పుట్టకుండా జన్యు సవరణ చేశారు. గుడ్ల ఉత్పత్తికి మగ కోడి పిల్లలు పనికిరావు. సైంటిఫిక్ పరిభాషలో చెప్పాలంటే బై ప్రొడక్ట్ (ఉప ఉత్పత్తి) కింద లెక్క. అంటే ఏదైనా ప్రయోగంలో ‘అసలు ఉత్పత్తి’ కాకుండా.. అదనంగా వచ్చేవి. ఇవి ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు. పౌల్ట్రీలో మాత్రం మగ కోడి పిల్లలూ ఎందుకూ పనికిరావు. అందుకే గుడ్లు పొదిగిన తర్వాత అవి మగవైతే వెంటనే చంపేస్తారు. వాటి నుంచి వచ్చే మాంసం కూడా ఆశించిన విధంగా ఉండదు. దాదాపు తినడానికి పనికిరాదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఏటా వందల కోట్ల మగ కోడి పిల్లల్ని చంపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని వాల్కని ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు.. కేవలం గుడ్లు పొదిగే కోడి పిల్లలు మాత్రమే పుట్టేలా వాటి జన్యువుల్ని సవరించి సత్ఫలితాలు సాధించారు. తాజా పరిశోధనతో కోట్లాది మగ కోడి పిల్లల్ని చంపే పరిస్థితి పోతుంది. ఈ జన్యు సవరణ పరిశోధన అద్భుతాలు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. ఏటా 750 కోట్ల కోడి పిల్లల మృత్యువాత.. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా గుడ్ల కోసం 1,500 కోట్ల కోళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. అందులో సగం మగ కోళ్లు, సగం ఆడ కోళ్లు ఉంటాయి. గుడ్ల ఉత్పత్తికి మగ కోళ్లు ఉపయోగపడకపోవడంతో వాటిని పుట్టిన వెంటనే చంపేస్తున్నారు. అంటే ఏటా దాదాపు 750 కోట్ల కోళ్లను పుట్టగానే చంపేస్తారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా జంతు సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. తాజా పరిశోధన వెనుక జంతు సంక్షేమాన్ని కాంక్షించే కంపాషన్ ఇన్ వరల్డ్ ఫార్మింగ్ సంస్థ ఉంది. కోట్లాది కోడి పిల్లలను క్రూరంగా చంపే విధానానికి స్వస్తి పలికే ఉద్దేశంతోనే ఈ పరిశోధన జరిగినట్లు చెబుతున్నారు. ఆడ కోళ్లను మాత్రమే ఎలా ఉత్పత్తి చేస్తారంటే.. ఆడ కోళ్లలో ఒక డబ్ల్యూ, ఒక జెడ్ క్రోమోజోమ్ కలిపి(డబ్ల్యూజెడ్) ఉంటాయి. మగ కోళ్లలో రెండూ జెడ్ క్రోమోజోములే(జెడ్‌జెడ్) ఉంటాయి. పరిశోధనలో భాగంగా ఆడ కోడిలోని జెడ్ క్రోమోజోమ్‌పై ఒక బ్లూ లైట్ వేయడం ద్వారా దాని జన్యువును మార్పు చేశారు. దాన్ని మగ కోడితో జత చేసినప్పుడు.. మగ కోడి పిల్లలు జన్మించవని నిరూపించారు. అదే సమయంలో ఆడ కోళ్ల పుట్టుకపై దీని ప్రభావం ఉండదు. మగ కోడిలోని జెడ్ క్రోమోజోమ్‌ను మాత్రమే అవి తీసుకుంటాయి. దీని వల్ల కేవలం గుడ్లు ఉత్పత్తి చేసే ఆడ కోళ్లు మాత్రమే పుడతాయి. -
నాటు కోడి గుడ్లు దొరక్క ఇబ్బందులు.. రంగంలోకి సాఫ్ట్వేర్ ఇంజనీర్.. లక్షల్లో సంపాదన
సాక్షి, అమరావతి బ్యూరో: చదివింది ఎంసీఏ. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్. బెంగళూరులో ఉద్యోగం. లాక్ డౌన్ సమయంలో వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యంతో సొంత ఊరికి వచ్చాడు. ఇక్కడ తన పిల్లలకు నాటు కోడి గుడ్లు పెట్టాలనుకున్నాడు. మార్కెట్లో ఎంత వెతికినా దొరకలేదు. పైగా, నాటు కోడి పేరుతో జరుగతున్న మోసాలను గమనించాడు. అసలైన జాతి కోళ్లను పెంచితే మంచి గిరాకీ ఉంటుందని గ్రహించాడు. తీరిక వేళల్లో కోళ్లు పెంచాలన్న ఆలోచన తట్టింది. కానీ, కోళ్ల పెంపకంపై అవగాహన లేదు. దీంతో పందెం కోళ్ల పెంపకంపై తెలిసిన వారి నుంచి కొంత, ఆన్లైన్లో మరికొంత సమాచారాన్ని సేకరించాడు. రూ.15 వేల పెట్టుబడితో కోళ్ల పెంపకాన్ని ప్రారంభించాడు. తెలుగు రాష్ట్రాల్లో లభించే మేలు జాతి దేశీయ రకం కోళ్లతో పాటు విదేశీ జాతులను సేకరించి వాటి సంకరంతో కొత్త జాతి కోళ్లను వృద్ధి చేస్తున్నాడు. ఇప్పుడు లక్షల్లో వ్యాపారం చేస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది పందెం రాయుళ్లు కోళ్ల కోసం ఇప్పుడు వడ్లమూడికి వస్తున్నారు. ఇలా సాఫ్ట్‌వేర్‌తో పాటు కోళ్ల పెంపకంలోనూ రాణిస్తున్నాడు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి యువకుడు ఘట్టమనేని శ్రావణ్‌కుమార్. పుంజుల వీర్యాన్ని సేకరించి కోళ్ల పందెంలో దూకుడుగా బరిలో దిగటానికి కొంతమంది విదేశీ మేలు జాతి కోళ్లను దిగుమతి చేసుకుంటారు. శ్రావణ్ మాత్రం దేశీయ రకం కోళ్ల జాతితో శాస్త్రీయ పద్ధతుల్లో మరింత మెరుగైన కోళ్ల ఉత్పత్తి చేస్తున్నాడు. ఎంపిక చేసుకున్న మేలు రకం పుంజుల వీర్యాన్ని సేకరించి నిల్వ చేస్తాడు. దాన్ని కొబ్బరినీళ్లు, సెలైన్ వాటర్‌లో కలిపి దేశీయ జాతి పెట్టలకు అందజేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల పెట్టలు త్వరగా అలసిపోవు. అధిక, నాణ్యమైన గుడ్లను పెట్టే శక్తి వస్తుంది. ఆశించినట్లే మేలు రకం దేశీయ కోళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. రెండేళ్లుగా కష్టపడి దేశీయ జాతిలో మంచి కోళ్లను సృష్టించానని, మరింత అభివృద్ధి చేసిన తర్వాత మార్కెట్లో అమ్మకానికి పెడతానని శ్రావణ్ చెబుతున్నాడు. ఆన్లైన్లో అమ్మకాలు నాణ్యమైన ఉత్పత్తితో పాటు మెరుగైన మార్కెటింగ్ ఉంటేనే అమ్మకాలు అధికంగా ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని శ్రావణ్ సోషల్ మీడియాలో ఘట్టమనేని ఫామ్స్ పేరిట ప్రత్యేక పేజీను తయారు చేసుకున్నాడు. తన వద్ద ఉన్న కోళ్ల ఫొటోలను అందులో పోస్ట్ చేస్తున్నాడు. వాటిని చూసి ఆర్డర్లు వస్తుండగా, మరికొంత మంది నేరుగా ఫామ్‌కి వచ్చి కొంటున్నారు. మోసానికి తావులేకుండా, కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్టు అమ్మకాలు చేస్తుండటంతో మార్కెట్లో మంచి పేరు వచ్చిందని శ్రావణ్ చెబుతున్నాడు. సంక్రాంతి టార్గెట్‌గా శ్రావణ్ దగ్గర కోడిగుడ్డు, అప్పుడే పుట్టిన పిల్ల మొదలు రెండేళ్ల వయసు గల కోళ్లు ఉంటాయి. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా వాటిని పెంచుతున్నాడు. తోక పుట్టుక, కోడి కాళ్లు, శరీరాకృతి ఆధారంగా రేటు వస్తుంది. వచ్చే సంక్రాంతి పండుగ టార్గెట్‌గా ఇప్పటి నుంచే కోళ్ల పెంపకం మొదలుపెట్టాడు. వడ్లమూడి, ఒంగోలు, బాపట్ల, వేటపాలెంలలో షెడ్లను ఏర్పాటు చేశాడు. తూర్పు జాతి, మెట్టవాటం, పచ్చకాకి, కాకిడేగ, సేతువు, నెమలి వంటి పలు రకాల కోళ్లు పెంచుతున్నాడు. ఒక్కొక్క గుడ్డు రూ.400 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నాడు. 15 రోజుల కోడి పిల్ల రూ.1,500, మూడు నెలల పిల్లలు రూ.3 వేలు, ఆరు నెలల పిల్లలు రూ.10 వేలు దాకా అమ్ముతున్నాడు. జాతిని బట్టి ఒక్కో కోడి రూ.3 లక్షల దాకా ఉంటాయని శ్రావణ్ చెబుతున్నాడు. అవసరంతో మొదలుపెట్టి... అదనపు ఆదాయంగా మార్కెట్లో అసలైన నాటు కోడి మాంసం, గుడ్లు లభించడంలేదు. దీంతో నేనే కోళ్ల పెంపకం మొదలుపెట్టాలన్న ఆలోచన మొదలైంది. తర్వాత ఇది అదనపు ఆదాయంగా మారింది. సాయంత్రం 5 నుంచి రాత్రి 2 రెండు గంటల వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తా. ఖాళీ సమయంలో కోళ్లను చూసుకుంటున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన నా భార్య, అమ్మ, నాన్న నాకు సహాయంగా ఉంటున్నారు. పందెం కోళ్లకు అడ్రస్ ఘట్టమనేని ఫామ్స్ అని చెప్పుకొనేలా చేయడమే నా లక్ష్యం. – ఘట్టమనేని శ్రావణ్‌కుమార్ -
ఎగ్ బోర్డు ఏర్పాటుపై అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్వహించే ఎగ్ బోర్డును ఏర్పాటుచేసి, కోడి గుడ్ల ధరను నిర్ణయించడంలోని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హామీ ఇచ్చారు. పౌల్ట్రీ రైతుల సమస్యలు పరిష్కరించేందుకు త్వరలో బ్రీడర్స్, హేచరీస్ రైతులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. కోడిగుడ్ల ధరను నిర్ణయించడంలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (ఎన్ఈసీసీ) తీరుతో తాము నష్టపోతున్నామని కొందరు పౌల్ట్రీ రైతులు గురువారం మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో 1,500 మంది లేయర్ పౌల్ట్రీ రైతులు ఉన్నారని, వీరికి గుడ్లు పెట్టే కోళ్లను సరఫరా చేసే బ్రీడర్ ఫార్మర్స్ వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యలో ఉన్నారు. తెలంగాణలో రోజూ మూడు కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా, రాష్ట్రంలోనే 70శాతం గుడ్లను వినియోగిస్తున్నారన్నారు. పెరిగిన దాణా ఖర్చుకు అనుగుణంగా గుడ్డు ధర పెరగక పోవడంతో లేయర్ పౌల్ట్రీ రైతులు నష్టపోతున్నారని తెలిపారు. సుమారు రెండు దశాబ్దాల క్రితం మనుగడలో ఉన్న ఎగ్‌బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారని, ఎగ్‌బోర్డు ఏర్పాటు సాధ్యాసా«ధ్యాలపై అధ్యయనం చేసి, పౌల్ట్రీ రంగం నిలదొక్కుకునేందుకు చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. కాగా గుడ్డు ధరను నిర్ణయించడంలో ఎన్ఈసీసీ వైఫల్యంతో ఒక్కో గుడ్డుపై సగటున రూపాయి చొప్పున నష్టపోతున్నట్లు పౌల్ట్రీ రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం దాణా, విద్యుత్‌పై సబ్సిడీ ఇస్తున్నా ఇతర సమస్యలు ఉన్నాయన్నారు. మంత్రిని కలిసిన వారిలో పౌల్ట్రీ రైతులు సమరసింహారెడ్డి, దిలీప్‌కుమార్, మనోజ్, రాకేష్, ఆనంద్, విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. -
కోళ్లపెంపకం..లాభదాయకం
స్థల(షెడ్) ఎంపిక ముందుగా కోళ్ల పెంపకం సంఖ్యను దృష్టిలో ఉంచుకొని, భవి ష్యత్‌లో పరిశ్రమ విస్తరణను బట్టి స్థల(షెడ్) ఎంపిక చేసుకోవాలి. ఫారానికి చుట్టుపక్కల ఉన్న స్థలం కంటే కొంచెం ఎత్తు, ఇతర కోళ్ల ఫారాల నుంచి 3-5 కిలోమీటర్ల దూరంలో ఉండే విధంగా స్థలాన్ని చూసుకోవాలి. ఎత్తై స్థలంలో ఫారాన్ని నిర్మించడం వల్ల వర్షాకాలంలో నీరు చుట్టుపక్కల నిల్వలేకుండా ఉండి గాలి, వెలుతురు లభిస్తాయి. షెడ్ వెడల్పు 25-30 అడుగులు ఉండాలి. నేల కాంక్రీటుతో నిర్మించినదైతే ఎలుకలు మొదలైన వాటి నుంచి రక్షణగా ఉంటుంది. షెడ్ ముఖద్వారం వద్ద లోపలికి ప్రవేశించే వారి కాళ్లు పాదాలు లోషన్ నీటిలో తడిసేలాగా ఫుట్‌పాత్ నిర్మించాలి. కోళ్ల జాతుల ఎంపిక బ్రాయిలర్ కోళ్లలో వెంకాబ్, హబ్బర్డ్, సామ్రాట్, కారిబ్ వంటి రకాలు, లేయర్ కోళ్లలో బీవీ.-300, హైసెక్ర, హెచ్‌హెచ్. 260 వంటి రకాలు లభ్యవుతున్నాయి. ఫారం ప్రారంభించేవారు ఎన్ని కోళ్లతో ప్రారంభించాలో నిర్ణయించుకోవాలి. కావలసిన వారు నెలరోజుల ముందుగా హెచరీస్ వారికి తెలిపి, డబ్బు చెల్లించా ల్సి ఉంటుంది. కోళ్ల ఫారం ప్రారంభించేందుకు ముందుగా ప్రాజెక్ట్ తయారు చేసుకొని, ఎన్ని కోళ్లతో ప్రారంభించాలో నిర్ణయించుకోవాలి. వాటికి అయ్యే ఖర్చు(కోడి పిల్ల ఖరీదు, దాణా, పనివారు, విద్యుత్, నీరు, షెడ్డు నిర్మాణం) వాటి ద్వారా సాలుకు వచ్చే రాబడి అంచనా వివరాలతో బ్యాంకువారి దగ్గరకు వెళ్లిన, వారు రైతు వద్ద ఉన్న ఆదాయ, వ్యయాలను, రైతు చేసిన పెట్టుబడిని దృష్టిలో ఉంచుకొని 75 శాతం వరకు రుణం మంజూరు చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన 4వ వంతు రైతు భరించాలి. రుణాన్ని నెలసరి వాయిదాల్లో చెల్లించే వీలుంది. బ్రూడింగ్ ఏర్పాటు చేయాలి కోడిపిల్లలు వచ్చే ముందుగానే షెడ్డు నిర్మాణం, బ్రూడింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలి. బ్రూడింగ్ అన గా కృత్రిమంగా వేడిని కల్పించడం. పిల్లలను తెచ్చిన వెంటనే నీటిని తాగించి బ్రూడర్లో వదిలిపెట్టాలి. వెచ్చని ఉష్ణోగ్రత కోసం సాధారణంగా విద్యుత్‌ను వినియోగిస్తారు. బ్రూడింగ్ అనేది సాధారణంగా బ్రాయిలర్, లేయర్ పిల్లలకు డీప్‌లిట్టర్ పద్ధతిలోనే ఏర్పాటు చేయాలి. బ్రాయిలర్స్ను 6 వారాల వయస్సు వచ్చే సరికి మార్కెటింగ్ చేయాలి. అప్పటివరకు వీటిని డీప్లిట్టర్లోనే పెంచాలి. లేయర్ కోళ్ల పెంపకంలో 2 పద్ధతులున్నాయి. ఒకరోజు వయసు ఉన్న పిల్లలను తెచ్చి గుడ్లు పెట్టడం వరకు పోషించాలి. అనగా 72 వారాల వయస్సు వచ్చే వరకు. 16 వారాల వయస్సు గల పిల్లలను తెచ్చుకొని, 72 వారాల వరకు పోషించడం రెండో పద్ధతి. సాధారణంగా లేయర్ కోళ్లను 9వ వారం లేదా 19వ వారం నుంచి కాని డీప్‌లిట్టర్ నుంచి కేజేస్లోకి మార్చి పెంచుతారు. డీప్‌లిట్టర్ అనగా ఆయా ప్రాంతాల్లో చౌకగా లభించే పదార్థాలైన వరి, వేరుశనగ, రంపపు పొట్టు, చెరకు పిప్పి వంటి వాటిని కింద పరచి పెంచుతారు. అయితే ఈ పొట్టు ఎల్లప్పుడూ పొడిగా ఉండేటట్లు చూడాలి. కోళ్ల దాణా బాయిలర్ కోళ్ల పోషణలో మొదటి 4 వారాల వయస్సు వచ్చేవరకు చిన్న పిల్లలకు 22 శాతం మాంసకృత్తులు, 2900 కిలో కెలరీల శక్తి అవసరం. అదే 5, 6 వారాల వయస్సు గల వాటికి 20 శాతం మాంసకృత్తులు, 3000 కిలో కెలరీల శక్తి అవసరం. నీరు కోళ్లు సాధారణంగా అవి తిన్న దాణాకు రెట్టిం పు నీటిని తాగుతాయి. అలా అందించే నీరు పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఉండాలి. నీటిలో అవసరమైతే అయోడిన్ లేదా వాటర్ శానిటైజర్లను వాడి నీటిని వినియోగించడం మేలు. వ్యాధులు సాధారణంగా డీప్‌లిట్టర్ పైన పెంచే కోళ్ల లో అంతర పరాన్న జీవుల బెడద ఎక్కువ గా ఉంటుంది. దాని నివారణకు ప్రతి 30 రోజులకు ఒకసారి డీవర్మింగ్ మందులు వాడాలి. కేజెస్‌లో పెంచే కోళ్లకు ప్రతి 3 నెలలకు ఒకసారి డీవర్మింగ్ మందు వా డాలి. వ్యాధులు రాకుండా ముందు జా గ్రత్తగా టీకాలను వేయాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి కొక్కెర తెగులు రాకుండా టీకా వేయించాలి.