విద్యుత్ కోతల సమయాలు మారిపోయాయి. విద్యార్థుల పరీక్షల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు.
నిజామాబాద్ నాగారం న్యూస్‌లైన్: విద్యుత్ కోతల సమయాలు మారిపోయాయి. విద్యార్థుల పరీక్షల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ యం తీసుకున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. వేసవి ప్రారంభం కాగానే విద్యుత్ సంక్షోభం ప్రారంభమైంది. దీంతో అధికారులు కొంత కాలంగా విద్యుత్ కోతలను విధిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నాలుగు గంటలు, మున్సి పాలిటీలలో ఆరు గంటలు, మండలాలలో ఎనిమిది గంటలు, గ్రామాలలో 12 గంటల పాటు విద్యుత్ కోతలు అమలవుతున్నాయి.
వ్యవసాయానికి మాత్రం నిరంతరా యంగా ఐదుగంటల విద్యుత్ అందిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు, మరికొన్ని ప్రాంతాలలో ఉదయం, మధ్యాహ్నం విద్యుత్‌ను వ్యవసాయ బోర్లకు సరఫరా చేస్తున్నారు. వ్యవసాయానికి సరఫరా సమయా న్ని పెంచాలని రైతులు కోరుతున్నారు. పరిశ్రమలకు ఆదివారం సెలవుతోపాటు, పవర్‌హాలిడే కింద అదనంగా ప్రతి సోమవారం విద్యుత్ సరఫరా చేయడం లేదు. ఇదిలా ఉం డగా పట్టణాలు, గ్రామాలకు విధిస్తున్న విద్యుత్ కోతల వివరాలను జిల్లా విద్యుత్ సాం కేతిక అధికారి(డీఈటీ) వెల్లడించారు.