transco officers
-
అన్యాయంగా కేసులు పెట్టారు
సాక్షి, మద్నూర్ (కామారెడ్డి): సోమూర్‌కు చెందిన పలువురిపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని ఆ గ్రామానికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం సోమూర్‌కు చెందిన 30 మంది మహిళలు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌కు వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు రోజుల క్రితం ట్రాన్స్‌కో సిబ్బంది గ్రామానికి వచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపించారు. విద్యుత్ మీటర్ల తనిఖీల పేరిట ఇళ్లలోకి విద్యుత్ అధికారులు చొరబడ్డారని ఆరోపించారు. రెండున్నర రోజుల పాటు గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారన్నారు. ట్రాన్స్‌కో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే గ్రామస్తులపైనే కేసులు పెట్టడం ఏమిటని వారు ప్రశ్నించారు. గ్రామానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినా, బుధవారం గ్రామానికి చెందిన పలువురి ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారన్నారు. దురుసుగా ప్రవర్తించారు బుధవారం 50 మంది ట్రాన్స్‌కో అధికారుల బృందం సోమూర్‌కు చేరుకొని ఇండ్లలో ఉన్న విద్యుత్ మీటర్లను ఇంటి బయట బిగిస్తామని దౌర్జన్యం చేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ క్రమంలో తోపులాట జరిగిందని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఏఎస్సై వెంకట్రావ్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామాన్ని సందర్శించిన డీఎస్పీ బాన్సువాడ డీఎస్పీ యాదగిరి బుధవారం సోమూర్ గ్రామాన్ని సందర్శించారు. ఐదు రోజుల క్రితం గ్రామంలో ట్రాన్స్‌కో అధికారులపై జరిగిన దాడి ఘటనపై విచారణ జరిపారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
కష్టపడితేనే..కరెంటిస్తాం!
మీ గ్రామాలకు కరెంటు కావాలా?.. అయితే శ్రమదానం చేయండి.. వాలిపోయిన స్తంభాలు నిలబెట్టండి.. చెట్లలో వైర్లు చిక్కుకున్నాయి.. చెట్లు కొట్టండి.. విద్యుత్ స్తంభాలు మోసుకెళ్లండి.. అప్పుడు కరెంటిస్తాం.. ఇదీ గిరిసీమలో ట్రాన్స్‌కో వారి దందా. విద్యుత్ పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆ నిధులు ఖర్చు చేయకుండా వెనకేసుకుంటున్నారు. గిరిజనులను శ్రమదోపిడీకి గురి చేస్తూ పనులు జరిపించేస్తున్నారు. నిధుల విషయం తెలియని అమాయక గిరిజనులు కరెంటు కోసం ట్రాన్స్‌కో సిబ్బంది చెప్పినట్లు చేస్తున్నారు. సీతంపేట:ఏజెన్సీలో తుపానుకు దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనుల ను గిరిజనులతో చేయిస్తూ.. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను జేబులో వేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీరు కష్టపడితేనే.. త్వరగా కరెంటు వస్తుందని మభ్యపెట్టి పైసా అయినా ఇవ్వకుండా వారితో స్తంభాలు మోయించడం, నిలబెట్టడం, చెట్లు కొట్టించడం వంటి పనులు చేయించారు. సీతంపేట ట్రాన్స్‌కో సబ్‌డివిజన్ పరిధిలో హుదూద్ తుపాను ధాటికి విద్యుత్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. పునరుద్ధరణ పనులకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే కూలీలతో చేయించాల్సిన పనులను గిరిజనులతో చేయిస్తూ కొందరికి నామమాత్రంగా కూలి చెల్లించారు. ఇంకొందరికి పూర్తిగా చెల్లించకుండా ఎగవేశారు. ఇలా ఈ సబ్‌డివిజన్ పరిధిలో రూ.13 లక్షల వరకు నిధులు పక్కదారి పట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇవీ లెక్కలు సీతంపేట సబ్‌డివిజన్ పరిధిలో సీతంపేట, పాలకొండ, బూర్జ, వంగర, వీరఘట్టం మండలాలున్నాయి. తుపాను దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ మరమ్మతులకు సబ్ డివిజన్‌కు సుమారు రూ.24 ల క్షలు మంజూరయ్యాయి. ఇందులో వీరఘట్టం మండలానికి రూ.1.50 లక్షలు కేటాయించగా మిగిలిన నాలుగు మండలాలకు రూ.5.5 లక్షలు చొప్పున విడుదల చేశారు. ఈ నిధులతో మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా సీతంపేట, బూర్జ, వంగర మండలాల్లో అధిక శాతం నిధులు దుర్వినియోగమైనట్లు తెలుస్తోంది. ఈ మండలాల్లో 211 విద్యుత్ స్తంభాలు పాడవ్వగా 104 కొత్త స్తంభాలు నిర్మించారు. ఈ నెల 13 నుంచి 21 వరకు పునరుద్ధరణ పనులు జరిపారు. కొండలపైనున్న గ్రామాలకు స్తంభాలు మోసుకెళ్లడం, ఇంకొన్ని గ్రామాలకు నాటుబళ్లతో పరికరాలు పట్టుకెళ్లడం వంటి పనులను గిరిజనులే చేశారు. ఇందుకోసం రోజుకు 60 నుంచి 70 మంది వరకు కూలీలను వినియోగించినట్లు లెక్కలు చూపి, 10 నుంచి 15 మందికి మాత్రమే కూలి చెల్లించినట్లు సమాచారం. సాధారణంగా ఇటువంటి పనులకు ఒక్కో కూలీకి రోజుకు రూ.500 చెల్లించాలి. అలాగే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెట్టాల్సి ఉంది. అయితే ఏ ఒక్కరికీ భోజనాలు పెట్టిన దాఖలాలు లేవు. వీరితో పనులు చేయించిన ట్రాన్స్‌కో కిందిస్థాయి సిబ్బందికి సైతం భోజనాలు పెట్టాల్సి ఉన్నప్పటకీ వారికి కూడా పెట్టలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే డిపార్ట్మెంటు వారితోనూ, ట్రాన్స్‌కో ఫ్రాంచైజీ సంస్థతోనూ కొన్ని పనులు చేయించినా, ప్రైవేట్ వారితో చేయించినట్లుగా బిల్లులు పెట్టారని తెలిసింది. ఇదిలా ఉండగా ఇప్పటికీ ఇంకా మారుమూల గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరణ జరగలేదు. ఈ విషయమై ట్రాన్స్‌కో ఏడీఈ అప్పారావు వద్ద ప్రస్తావించగా కూలీలందరికి ఒక కాంట్రాక్టర్ ద్వారా డబ్బులు చెల్లించామని చెప్పారు. శ్రమదానంతో చేయించారు అన్ని పనులు శ్రమదానంతో చేయించారు. కూలీలకు డబ్బులు ఇవ్వలేదు. పనులు పూర్తి అయితే గ్రామాలకు విద్యుత్ వస్తుందంటేనే మా గిరిజనులంతా సాయం చేశారు గానీ ఎవ్వరికి డబ్బులు ఇవ్వలేదు. - సవర గోపాల్, సర్పంచ్, సోమగండి పైసా ఇవ్వలేదు పైసా డబ్బులు ఇవ్వలేదు. కొండలపైకి స్తంభాలు మోసుకెళ్లాం. ఎవ్వరికీ కూలీ చెల్లించలేదు. కరెంటు వస్తాదన్న ఆశతో మా పనులు మానుకొని అనేక కష్టాలకు ఓర్చి పనులు చేశాం. - సవర తోటయ్య, గొయ్యిగూడ -
ముదిరిన ‘పంచాయతీ’
ట్రాన్స్‌కోకు, గ్రామపంచాయతీలకు మధ్య కరెంటు బకాయిల వివాదం ముదురుతోంది. బకాయిల వసూళ్లకోసం అధికారులు కరెంటు కట్ చేస్తున్న నేపథ్యంలో సర్పంచుల ధీటుగా స్పందిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బకాయిలు చెల్లించేది లేదని, అవసరమైతే వసూళ్లకు వచ్చే సిబ్బందిని నిర్భందిస్తామని సర్పంచుల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. ఈ వివాదానికి కారణమైన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తోంది. కరీంనగర్ సిటీ : గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా, వీధిదీపాలు తదితర ప్రజావసరాలకు ఆయా పంచాయతీలు విద్యుత్‌ను వినియోగిస్తుంటాయి. గతంలో ప్రభుత్వమే పంచాయతీల విద్యుత్ బిల్లులను నేరుగా చెల్లించేది. కొద్ది నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో జిల్లాలో 1207 గ్రామాలకు రూ.60 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ట్రాన్స్‌కో అధికారులు బకాయిలు చెల్లించాలని, లేన ట్లయితే విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని గత నెలలో గ్రామపంచాయతీలకు నోటీసులు జారీ చేశారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు నుంచి తప్పుకున్న ప్రభుత్వం ఆ భారాన్ని పంచాయతీలపై మోపింది. గ్రామాలకు వచ్చే 13వ ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ ని ధుల్లో 25 శాతం నిధులు బకాయిలు చెల్లించడానికి వెచ్చించాలని డీపీఓ ఈ నెలలో సర్క్యులర్ జారీ చేశారు. అసలే అరకొర నిధులతో నెట్టుకొస్తుంటే.. అందులోంచి 25 శాతం విద్యు త్ బిల్లులకు కేటాయించడాన్ని సర్పంచులు వ్యతిరేకించారు. గతంలో మాదిరిగా ప్రభుత్వమే నేరు గా విద్యుత్ బిల్లులతో పాటు బకాయిలు చెల్లిం చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, సర్పంచు ల నడుమ ఈ వ్యవహారం కొనసాగుతుండగానే ట్రాన్స్‌కో అధికారులు రంగంలోకి దిగారు. వారం రోజుల వ్యవధిలో జిల్లాలోని దాదాపు రెండువందల గ్రామపంచాయతీల్లో విద్యుత్ కనెక్షన్లు కట్ చేశారు. దీనిపై సర్పంచులు తీవ్రం గా స్పందించారు. విద్యుత్ బిల్లులు గ్రామపంచాయతీలు చెల్లించేది లేదని తీర్మానించారు. పై గా విద్యుత్ కనెక్షన్ తొలగించడానికి ట్రాన్స్‌కో సిబ్బంది వస్తే నిర్బంధించాలంటూ సర్పంచుల సంఘం పిలుపునిచ్చింది. దీంతో ట్రాన్స్‌కో, పంచాయతీల మధ్య ప్రతక్ష్యంగా వార్ మొదలైంది. ఈ మేరకు జిల్లా సర్పంచుల సంఘం నాయకులు శుక్రవారం పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ట్రాన్స్‌కో అధికారులను కలిసి వినతిపత్రాలు అందచేశారు. చర్యకు ప్రతిచర్య.. విద్యుత్ బకాయిలు వసూలు చేయడానికి ట్రాన్స్‌కో రంగంలోకి దిగగా, అందుకు ప్రతిచర్యకు పంచాయతీలు పూనుకుంటున్నాయి. గ్రామపంచాయతీల్లో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లకు పన్ను విధించేందుకు సర్పంచులు సమాయత్తమవుతున్నారు. గ్రామ అవసరాలకు వినియోగించిన విద్యుత్ బిల్లుల బకాయిల కోసం ట్రాన్స్‌కో కరెంట్ కట్ చేస్తే.. తాము తక్కువ కాదన్నట్లు ట్రాన్స్‌కోకు పన్నుల బకాయిల నోటీసులు పంపించాలని సర్పంచులు యోచిస్తున్నారు. నిబంధనల ప్రకారం గ్రామాల్లో ఉన్న ఒక్కో విద్యుత్ స్తంభానికి రూ.100, ట్రాన్స్ఫార్మర్కు రూ.వేయి, సబ్స్టేషన్లకు రూ.10 వేల చొప్పున తక్షణమే విద్యుత్ అధికారులు సంబంధిత గ్రామపంచాయతీలకు పన్నులు చెల్లించాలని సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. సర్కారు ప్రేక్షకపాత్ర.. ట్రాన్స్‌కో,గ్రామపంచాయతీల నడుమ చిచ్చుపెట్టిన రాష్ట్ర సర్కారు మాత్రం ఈ వ్యవహారంలో ప్రేక్షకపాత్ర వహిస్తోంది. సర్పంచుల ఆందోళనను పరిగణలోకి తీసుకొని సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఓవైపు ట్రాన్స్‌కో దూకుడు పెంచగా, మరోవైపు సర్పంచులు అదేస్థాయిలో ప్రతిఘటించేందుకు సిద్ధంకావడంతో జిల్లాలో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేచింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కరెంటు బిల్లుల ‘పంచాయతీ’ని పరిష్కరించాల్సిన అవసరముంది. -
బిల్లు చూసి ‘షాక్’య్యారు
డిచ్పల్లి : డిచ్పల్లి మండల కేంద్రంలోని పలు ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ వర్క్‌షాపులకు సంబంధించి ఎలాంటి తనిఖీలు నిర్వహించకుండానే వేలల్లో బిల్లులు వేశారని వర్క్‌షాపుల యాజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం తమకు ట్రాన్స్‌కో అధికారులు పంపించిన నోటీసులు, బిల్లులను వారు విలేకరుల చూపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతినెలా 1500 లోపు మాత్రమే విద్యుత్ బిల్లులు వచ్చేవని, అధిక లోడు వినియోగం పేరిట ట్రాన్స్‌కో అధికారులు 20 వేల నుంచి 70 వేల వరకు బిల్లులు కట్టాలని నోటీసులు పంపించారని వాపోయారు. తమ వర్క్‌షాపులను తనిఖీ చేయకుండానే అధిక బిల్లులు పంపించడం దారుణమని విమర్శించారు. రోజుకు *300 నుంచి *500 సంపాదన కలిగిన తాము వేల రూపాయలల్లో బిల్లులను ఎలా కట్టాలని వాపోయారు. ఇలా అయితే తాము వర్క్‌షాపులను మూసుకోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. షాపులో ఒక లేత్ మిషన్ మాత్రమే ఉంటే మూడు ఉన్నాయని, ఒక కటింగ్ మిషన్ ఉంటే నాలుగు ఉన్నాయని తప్పుడు నివేదికలు రాసి నోటీసులు పంపించం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. అలాగే 7 హెచ్‌పీ కరెంట్ అనుమతి ఉండగా, 41.98 హెచ్‌పీ వాడుకుంటున్నామంటూ తప్పుడు నోటీసులు పంపించారని ఆరోపించారు. అసలు 41 హెచ్‌పీ కరెంట్ వాడుకుంటే ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ సరిపోదనే విషయం అధికారులకు తెలియదా అంటూ ప్రశ్నించారు. 2012 డిసెంబర్, 2013 జనవరి నెలలకు సంబంధించిన నోటీసులు ఇప్పుడు పంపించారని భాధితులు వాపోయారు. ఈ విషయమై ట్రాన్స్‌కో అధికారులకు కలిసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నకు ట్రాన్స్‌కో అధికారులపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. విలేకరులతో మాట్లాడిన వారిలో బాధితులు మహబూబ్, నయీం, అర్షద్, కుర్షీద్, అన్వర్, సురేశ్ తదితరులు ఉన్నారు. -
మారిన కోతల వేళలు
నిజామాబాద్ నాగారం న్యూస్‌లైన్: విద్యుత్ కోతల సమయాలు మారిపోయాయి. విద్యార్థుల పరీక్షల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ యం తీసుకున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. వేసవి ప్రారంభం కాగానే విద్యుత్ సంక్షోభం ప్రారంభమైంది. దీంతో అధికారులు కొంత కాలంగా విద్యుత్ కోతలను విధిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నాలుగు గంటలు, మున్సి పాలిటీలలో ఆరు గంటలు, మండలాలలో ఎనిమిది గంటలు, గ్రామాలలో 12 గంటల పాటు విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. వ్యవసాయానికి మాత్రం నిరంతరా యంగా ఐదుగంటల విద్యుత్ అందిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు, మరికొన్ని ప్రాంతాలలో ఉదయం, మధ్యాహ్నం విద్యుత్‌ను వ్యవసాయ బోర్లకు సరఫరా చేస్తున్నారు. వ్యవసాయానికి సరఫరా సమయా న్ని పెంచాలని రైతులు కోరుతున్నారు. పరిశ్రమలకు ఆదివారం సెలవుతోపాటు, పవర్‌హాలిడే కింద అదనంగా ప్రతి సోమవారం విద్యుత్ సరఫరా చేయడం లేదు. ఇదిలా ఉం డగా పట్టణాలు, గ్రామాలకు విధిస్తున్న విద్యుత్ కోతల వివరాలను జిల్లా విద్యుత్ సాం కేతిక అధికారి(డీఈటీ) వెల్లడించారు. -
ఇ‘కట్’లే!
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం కోరి కష్టాలు తెచ్చుకుంటోంది. రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ విద్యుత్ కోతలకు తెగబడింది. ఉత్పత్తి కేంద్రాల్లో తలెత్తిన సమస్యతో ఏర్పడిన లోటు కారణమని చెబుతున్నా.. ఎన్నికల సమయంలో నిరంతరాయంగా విద్యుత్‌ను అందించేందుకు ఇప్పడు ‘వాత’లు పెడుతున్నట్లు చర్చ జరుగుతోంది. గత రెండు నెలలుగా ఎడాపెడా విద్యుత్ కోత విధిస్తుండగా.. ఆదివారం నుంచి అధికారిక కోతలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. జిల్లాలోని 10.53 లక్షల వినియోగదారులకు రోజుకు 1.10 కోట్ల యూనిట్ల విద్యుత్ అవసరం కాగా.. ఇటీవల కాలంలో 82 లక్షల యూనిట్ల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతోంది. ఇందులో 14 లక్షల యూనిట్ల విద్యుత్ లైన్లాస్గా లెక్కగట్టారు. ఈ కారణంగా రెండు నెలల నుంచి ట్రాన్స్‌కో అధికారులు హైదరాబాద్‌లోని డిశ్పాచ్, మానిటరింగ్ సెంటర్ నుంచి లోడ్ రిలీఫ్ పేరిట మెయిన్ లైన్ సబ్స్టేషన్లను స్తంభింపజేస్తున్నారు. ఫలితంగా కోతలతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. జిల్లా అవసరానికి తగిన విద్యుత్ రాకపోవడంతో కోతల సమయాన్ని పెంచుతూ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వివరాలను ఏపీసీపీడీసీఎల్ అధికారులు విలేకరులకు వెల్లడించారు. దీంతో లోడ్ రిలీఫ్, కోతల షెడ్యూల్స్‌తో ఇప్పటికే అల్లాడుతున్న జనం ఇకపై మరిన్ని కష్టాలను ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. కోతల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అంధకారం అలుముకోనుంది. ఈ కోతలు రానున్న ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులకు వాతలు కాక మానవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేటి నుంచే కోతల అమలు: రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ లోటు ఏర్పడడంతో కోతలు అనివార్యమయ్యాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచే ట్రాన్స్‌కో అధికారులు కోతలు విధిస్తూ వచ్చారు. ఇప్పుడు అధికారికంగా కోతల వేళలు ప్రకటించారు. వీటిని ఆదివారం నుంచే అమలు చేయనున్నాం. వినియోగదారులు సమస్యను అర్థం చేసుకొని అధికారులకు సహకరించాలి. ఎం.ఉమాపతి, డీఈ, కర్నూలు -
‘కట్’కటే
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: కరెంటు ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో ఆ శాఖ అధికారులకే తెలియని పరిస్థితి. జిల్లాలో అనధికార పవర్‌కట్‌లతో నెలన్నర రోజులుగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా గురువారం రాత్రి విజయవాడలోని థర్మల్ పవర్‌ప్లాంట్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఈ కారణంగా లోటు తీవ్రరూపం దాల్చి ట్రాన్స్‌కో అధికారులు కోతలకు తెరతీశారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించకపోవడంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళ ఐదారు గంటల పాటు సరఫరా నిలిపేస్తున్నారు. ప్రతి మండలంలో 8 నుంచి 10 గంటల పాటు.. జిల్లా కేంద్రంలో 4 గంటలు.. గ్రామీణ ప్రాంతాల్లో 12 గంటల పాటు విద్యుత్ కోత విధిస్తున్నారు. వీటీపీపీలో ఏర్పడిన సమస్య కారణంగా గురువారం రాత్రి కర్నూలు, ఆదోని, నంద్యాల డివిజన్లలో భారీగా కోతలు అమలయ్యాయి. ఎమర్జెన్సీ కారణంగా లోడ్ రిలీఫ్ కోసం హైదరాబాద్‌లోని ట్రాన్స్‌కో లోడ్ మానిటరింగ్, డిశ్పాచ్ సెంటర్ నుంచే ఈ వాతలు పెడుతున్నట్లు విద్యుత్ శాఖ జిల్లా అధికారులు వెల్లడిస్తున్నారు. అంధకారం ఇలా... గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం సబ్ డివిజన్లలోని అన్ని పల్లెల్లో గంట పాటు సరఫరా నిలిచిపోయింది. కర్నూలు, నంద్యాల డివిజన్లలో రాత్రి 9.30 గంటల నుంచి 11.40 గంటల వరకు కోత విధించడంతో కర్నూలు రూరల్, గూడూరు, నందికొట్కూరు, ఆత్మకూరు, బేతంచెర్ల, బనగానపల్లె, డోన్ సబ్ డివిజన్లలోని గ్రామాల్లో అంధాకారం అలుముకుంది. అర్ధరాత్రి దాటాక 3.10 నుంచి ఉదయం 6.20 వరకు బేతంచెర్ల సబ్‌డివిజన్‌లో, నంద్యాల డివిజన్లోని నంద్యాల, పాణ్యం, గోస్పాడు, మహానంది, దొర్నిపాటు తదితర మండలాల్లో అర్ధరాత్రి 3.45 నుంచి 6.52గంటల వరకు, బనగానపల్లె సబ్‌డివిజన్‌లోని గ్రామాల్లోనూ ఇదే సమయంలో కోతలు అమలయ్యాయి. ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ సబ్ డివిజన్లలోని పల్లెల్లో 3.12 నుంచి 6.33 గంటల వరకు.. డోన్ డివిజన్లో అర్ధరాత్రి 12.10 నుంచి 3.17గంటల వరకు కోత విధించడం గమనార్హం. శుక్రవారం ఉదయం కూడా జిల్లాలో ఇష్టారాజ్యంగా కోతలు విధించడంతో ప్రజలు అధికారుల తీరుపై పెదవివిరుస్తున్నారు. షెడ్యూల్ ఖరారు కాలేదు: వీటీపీపీలో 30వ తేదీన ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా 500 మెగావాట్ల విద్యుత్‌ను కోల్పోయాం. ఫలితంగా రెండు రోజుల నుంచి సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. కోతల షెడ్యూల్ వివరాలను తెలపాలని ఉన్నతాధికారులను కోరినా ఫలితం లేకపోతోంది. రాత్రి వేళల్లోనూ ఎమర్జెన్సీ పేరిట ట్రాన్స్‌కో అధికారులు కోతలు విధిస్తున్నారు. వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్‌లోనూ గంటన్నర కోత పడుతోంది. టి.బసయ్య, ఎస్ఈ -
కలెక్టరేట్‌కు మళ్లీ కరెంట్ కట్
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా పరిపాలన కేంద్రం కలెక్టరేట్‌కు మళ్లీ కరెంటు తిప్పలు వచ్చిపడ్డాయి. బకాయిలు భారీగా పేరుకుపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు కటింగ్ మంత్రం ఉపయోగించారు. కలెక్టరేట్లోని 42 ప్రభుత్వ శాఖలన్నీ కలిపి రూ.3 కోట్ల 78 లక్షల 94 వేలు బిల్లు బకాయి పడ్డాయి. ఏళ్లకేళ్లుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ట్రాన్స్‌కో విజ్ఞప్తి చేసినా ఆయా శాఖలు పట్టించుకోలేదు. వసూళ్లపై దృష్టి సారించిన ట్రాన్స్‌కో ఆయా శాఖలపై కన్నెర్ర చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం వరకు ఐదు ప్రభుత్వ శాఖల్లో అధికారులు కరెంట్ కట్ చేశారు. గతంలో మూడుసార్లు కరెంట్ కట్ చేసి బకాయిలపై హెచ్చరించారు. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో మాట్లాడి సముదాయించడంతో శాంతించిన అధికారులు ఈ ఒక్కసారికేనంటూ సరఫరా పునరుద్ధరించారు. ఆనక బిల్లుల చెల్లింపు ఊసే మరిచిపోవడంతో ట్రాన్స్‌కో కలెక్టరేట్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఆదివారం వ్యవసాయశాఖ, విద్యాశాఖ కార్యాలయాల్లో కరెంటు తొలగించగా.. సోమవారం ఉదయం నుంచి సిబ్బందికి తిప్పలు తప్పలేదు. చీకట్లోనే విధులు కొనసాగించారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు సీపీవో, జిల్లా పంచాయతీశాఖ, పశుసంవర్ధకశాఖలో కరెంటు తొలగించారు. ఇక ఉపేక్షించేది లేదని, బిల్లు కడితేనే కరెంటు సరఫరా పునరుద్ధరిస్తామని స్పష్టం చేస్తోంది. మంగళవారం కలెక్టరేట్లోని 42 ప్రభుత్వశాఖల్లో కరెంట్ కట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బకాయిల్లో కొన్ని.. శాఖ బకాయి (రూ.లక్షల్లో) సీపీవో రూ.11.80 డీపీవో రూ.4.44 పశుసంర్ధకశాఖ జేడీ రూ.13.24 డీఈవో రూ.26.22 వ్యవసాయశాఖ రూ.25.84