కరీంనగర్ జిల్లా వేములవాడ రూరల్ మండలం తిప్పాపూర్ గ్రామంలోని అయ్యప్ప ఆలయ ప్రధాన అర్చకుడు ఉమాకాంత్(50) మంగళవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. ఉదయం ఇంటి నుంచి ఆలయానికి ద్విచక్రవాహనంలో వస్తుండగా పంది అడ్డువచ్చింది. దాన్ని తప్పించబోయి.. వాహనం అదుపు తప్పి.. ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో ఉమాకాంత్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గమనించిన స్థానికులు 108లో కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన మృతిచెందారు. కాగా.. చాలా కాలంగా ఆయన అయ్యప్ప ఆలయం ప్రధాన అర్చకునిగా పనిచేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతికి అయ్యప్ప సేవా సంఘం సభ్యులు సంతాపం తెలిపారు.