ప్రైవేట్ ఆస్పత్రిపై దాడి | Private hospital attack | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ ఆస్పత్రిపై దాడి

Published Sun, Jul 13 2014 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM

ప్రైవేట్ ఆస్పత్రిపై దాడి

ప్రైవేట్ ఆస్పత్రిపై దాడి

ఖమ్మంక్రైం : వైద్యసేవలందించకుండా జాప్యం చేయడం వల్లే వ్యక్తి మృతిచెందాడని ఆరోపిస్తూ బంధువులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిపై దాడి  చేశారు. ఆగ్రహంతో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ సంఘటన ఖమ్మం నగరంలో శనివారం చోటుచేసుకోంది. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. కోదాడ మండలానికి చెందిన నరాల గోపాలరెడ్డి(45)సుతారీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. గ్యాస్టిక్ సమస్యతో బాధపడుతున్న అతడిని ఈ నెల 9వ తేదీన ఖమ్మం మయూరిసెంటర్‌లోని ఓ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరి శీలించిన వైద్యులు పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పి చేర్పించుకున్నారు.
 
 అప్పటి నుంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నుం చి గోపాలరెడ్డి పరిస్థితి బాగా విషమించింది. దీంతో శనివారం మృతిచెందాడు. కాగా ఆస్పత్రి సిబ్బంది సరైన వైద్యం అందించలేదని, వైద్యం అందించకుండా జాప్యం చేయడంతోనే గోపాలరెడ్డి మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రిపై దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో ఆ స్పత్రి సిబ్బంది భయంతో కేకలు పెడుతూ బయట కు పరుగెత్తారు. సమాచారం తెలుసుకున్న టూటౌన్ సీఐ సారంగపాణి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడికి పాల్పడినవారిని పోలీసుస్టేషన్‌కు తరలించారు.
 
 డాక్టర్ ఏమన్నారంటే...
 ఆస్పత్రి వైద్యులు సునీల్ మాట్లాడుతూ ఆస్పత్రికి తీసుకోని వచ్చినప్పుడే గోపాలరెడ్డి పరిస్థితి విషమంగా ఉందని, ఆస్పత్రిలో చేర్చుకునేందుకు తాము నిరాకరించామని తెలిపారు. అతని బంధువులు బతి మాలడటంతో చేర్చుకుని చికిత్స అందించామని చె ప్పారు. తమ ప్రయత్నం తాము చేశామని, మృతుడి బంధువులు ఆస్పత్రిపై దాడికి పాల్పడడం సరికాదని పేర్కొన్నారు.
 
 దాడికి నిరసనగా వైద్య సేవలు నిలిపివేత
 ఆస్పత్రిపై దాడి చేయడాన్ని నిరసిస్తూ నగరంలో అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో శనివారం వైద్య సేవలు నిలిపివేశారు. దీంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. దాడిచేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ స్పత్రులకు రక్షణ కల్పించాలని ఐఎంఏ ఆధ్వర్యంలో టూటౌన్ సీఐ సారంగపాణిని కలిసి కోరారు. అనంతరం ఐఎంఏ హాల్ అత్యవసర సమావేశం నిర్వహిం చి వైద్యులందరూ కలిసికట్టుగా ఉండాలని, దాడులకు పాల్పడే సంఘటనలపై  పోలీసు ఉన్నతాధికారులను కలిసి రక్షణ కోరాలని తీర్మానించారు. సమావేశంలో ఐఏంఎ అధ్యక్షకార్యదర్శులు సంధ్య,శ్రీని వాస్, ఖమ్మంలోని ప్రైవేట్‌వైద్యులు పాల్గొన్నారు.
 
 ఇరువర్గాలపై కేసు
 మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఆస్పత్రి వైద్యు డు సునీల్‌కుమార్‌పై, డాక్టర్ సునీల్‌కుమార్ ఫిర్యా దు మేరకు మృతుని బంధువు నారపరెడ్డి, మరి కొం తమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement