Private hospital attack
-
వైరల్ వీడియో: కొంప ముంచిన సిబ్బంది నిర్లక్ష్యం..
-
కొంప ముంచిన సిబ్బంది నిర్లక్ష్యం.. వీడియో వైరల్
సాక్షి, మియాపూర్: ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి చనిపోయాడని ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 15 రోజుల పాటు మదీనాగూడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారని, రూ.10 లక్షల వరకు ఖర్చు చేసినట్లు చెప్పారు. తన తండ్రి కోలుకున్న తర్వాత ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగా మృతి చెందాడని కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్–3కి చెందిన ప్రమోద్ ఆరోపించారు. బాధితుడి వివరాల ప్రకారం.. బీహెచ్ఈఎల్లో ఉద్యోగం చేసే ప్రమోద్ తండ్రి శంకర్‌పవార్ 57) కరోనా సోకడంతో గతనెల 11న మదీనాగూడలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఈనెల 3వ తేదీన పూర్తిగా కోలుకున్నాడు. దీంతో అతడికి ఆక్సిజన్ అందిస్తున్నారు. ఈనెల 4వ తేదీన ప్రమోద్ బయటకు వెళ్లి వచ్చేసరికి తన తండ్రికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ తొలగిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. వెంటనే సిబ్బందిని ప్రశ్నించగా వారు వచ్చి మాస్కు తొడిగేలోగా పల్స్ రేటు సున్నాకు పడిపోయింది. వెంటనే డాక్టర్లను పిలిచినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి మృతి చెందారని ప్రమోద్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
మరో మూడు గంటల్లో డిశ్చార్జి...ఇంతలోనే ఘోరం
ఖమ్మం క్రైం: మరో మూడు గంటల్లో డిశ్చార్జి కావాల్సిన ఆమె ఒక్కసారిగా ఆస్పత్రి భవనంపైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఖమ్మంలో చోటు చేసుకుంది. త్రీటౌన్ జహీర్‌పుర తండాకు చెందిన డుంగ్రోతు రాంబాబు రిక్షా పుల్లర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉపేంద్రమ్మ(20) కాగా..ఆమె డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. మూడు రోజులక్రితం కడపునొప్పితో పాటు, ఫిట్స్ రావడంతో ఎన్నెస్టీ రోడ్డులోని క్యూర్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం ఉపేంద్రమ్మ కోలుకున్నాక మంగళవారం కొన్ని గంటల్లో డిశ్చార్జ్ కావాల్సి ఉండగా..బాత్రూంలోకి వెళ్లి ఎంతసేపటికీ రాకపోవడంతో..తల్లి నాగమ్మ మందలించింది. మనస్తాపానికి గురైన ఆమె..బయటకు వచ్చి పరుగెత్తుకుంటూ ఆస్పత్రి భవనంపైకి వెళ్లి..కిందకి దూకింది. ఆ తర్వాత ఐసీయూకు తరలించగా.. అప్పటికే పరిస్థితి విషమించి చనిపోయింది. అయితే..కిందకు దూకాక బతికే ఉన్నా..సదరు ఆస్పత్రి వారు పట్టించుకోలేదని, వైద్యం చేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి బంధువులు ఆందోళనకు దిగగా టూటౌన్ సీఐ రాజిరెడ్డి అధ్వర్యంలో ఎస్సైలు కృష్ణ, రామారావు, సిబ్బంది అక్కడికి చేరుకొని..పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. -
ప్రైవేట్ ఆస్పత్రిపై దాడి
ఖమ్మంక్రైం : వైద్యసేవలందించకుండా జాప్యం చేయడం వల్లే వ్యక్తి మృతిచెందాడని ఆరోపిస్తూ బంధువులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిపై దాడి చేశారు. ఆగ్రహంతో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ సంఘటన ఖమ్మం నగరంలో శనివారం చోటుచేసుకోంది. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. కోదాడ మండలానికి చెందిన నరాల గోపాలరెడ్డి(45)సుతారీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. గ్యాస్టిక్ సమస్యతో బాధపడుతున్న అతడిని ఈ నెల 9వ తేదీన ఖమ్మం మయూరిసెంటర్‌లోని ఓ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరి శీలించిన వైద్యులు పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పి చేర్పించుకున్నారు. అప్పటి నుంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నుం చి గోపాలరెడ్డి పరిస్థితి బాగా విషమించింది. దీంతో శనివారం మృతిచెందాడు. కాగా ఆస్పత్రి సిబ్బంది సరైన వైద్యం అందించలేదని, వైద్యం అందించకుండా జాప్యం చేయడంతోనే గోపాలరెడ్డి మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రిపై దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో ఆ స్పత్రి సిబ్బంది భయంతో కేకలు పెడుతూ బయట కు పరుగెత్తారు. సమాచారం తెలుసుకున్న టూటౌన్ సీఐ సారంగపాణి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడికి పాల్పడినవారిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. డాక్టర్ ఏమన్నారంటే... ఆస్పత్రి వైద్యులు సునీల్ మాట్లాడుతూ ఆస్పత్రికి తీసుకోని వచ్చినప్పుడే గోపాలరెడ్డి పరిస్థితి విషమంగా ఉందని, ఆస్పత్రిలో చేర్చుకునేందుకు తాము నిరాకరించామని తెలిపారు. అతని బంధువులు బతి మాలడటంతో చేర్చుకుని చికిత్స అందించామని చె ప్పారు. తమ ప్రయత్నం తాము చేశామని, మృతుడి బంధువులు ఆస్పత్రిపై దాడికి పాల్పడడం సరికాదని పేర్కొన్నారు. దాడికి నిరసనగా వైద్య సేవలు నిలిపివేత ఆస్పత్రిపై దాడి చేయడాన్ని నిరసిస్తూ నగరంలో అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో శనివారం వైద్య సేవలు నిలిపివేశారు. దీంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. దాడిచేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ స్పత్రులకు రక్షణ కల్పించాలని ఐఎంఏ ఆధ్వర్యంలో టూటౌన్ సీఐ సారంగపాణిని కలిసి కోరారు. అనంతరం ఐఎంఏ హాల్ అత్యవసర సమావేశం నిర్వహిం చి వైద్యులందరూ కలిసికట్టుగా ఉండాలని, దాడులకు పాల్పడే సంఘటనలపై పోలీసు ఉన్నతాధికారులను కలిసి రక్షణ కోరాలని తీర్మానించారు. సమావేశంలో ఐఏంఎ అధ్యక్షకార్యదర్శులు సంధ్య,శ్రీని వాస్, ఖమ్మంలోని ప్రైవేట్వైద్యులు పాల్గొన్నారు. ఇరువర్గాలపై కేసు మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఆస్పత్రి వైద్యు డు సునీల్‌కుమార్‌పై, డాక్టర్ సునీల్‌కుమార్ ఫిర్యా దు మేరకు మృతుని బంధువు నారపరెడ్డి, మరి కొం తమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.