
'22న ర్యాలీ నిర్వహించి తీరుతాం'
కరీంనగర్ : 'మా కొలువులు మాకు కావాలి' పేరుతో ఈ నెల 22న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం తెలిపారు. కరీంనగర్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ యువత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
( చదవండి : సతాయిస్తే వెనక్కి తగ్గుతామా? )
ప్రభుత్వం నుంచి అనుమతి రాకున్నా ర్యాలీ నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికే ఈ ర్యాలీ చేపడుతున్నామన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకు నిరసన ర్యాలీ నిర్వహించి.. ఇందిరాపార్కు వద్ద భారీ సభ నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు.