ఖమ్మం మార్కెట్లో శుక్రవారం కొనుగోలు నిలిచిపోయాయి.
ఖమ్మం అగ్రికల్చర్: ఖమ్మం మార్కెట్లో శుక్రవారం కొనుగోలు నిలిచిపోయాయి. లారీ ఓనర్లకు వ్యాపారులకు మధ్య వివాదం తలెత్తడంతో లావాదేవీలు ఆగిపోయాయి. వ్యాపారులు తెలంగాణాకు సంబంధించిన వాహనాలను మాత్రమే కిరాయికి తీసుకోవాలని తెలంగాణా లారీ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తమకు తెలంగాణా లారీలైనా, ఆంధ్రా లారీలైన ఒకటేనని ఎవరు కిరాయి తక్కువ తీసుకుంటే వారికే ఇస్తామని వ్యాపారులు చెబుతున్నారు. ఆందోళన కొనసాగుతోంది.