
ప్రచారంలో పాల్గొన్న కృష్ణయ్య
సాక్షి, మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రజా కూటమి బలపర్చన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం పట్టణంలోని రెడ్డికాలనీ, ముత్తిరెడ్డికుంట, శాంతినగర్, అశోక్‌నగర్, సీతారాంపురం, హనుమాన్‌పేట, ప్రకాశ్‌నగర్, వినోభానగర్‌లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు స్వాగతం పలికారు. పలు వార్డులలో ర్యాలీలో నిర్వహించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, టీడీపీ నాయకులు బంటు వెంకటేశ్వర్లు, సాధినేని శ్రీనివాస్‌రావు, కాంగ్రెస్ నాయకులు శంకర్‌నాయక్, గాయం ఉపేందర్‌రెడ్డి, రతన్‌సింగ్, తమన్న, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
పెరిక కుల ఉద్యోగుల సంఘం మద్దతు..
బీసీలకు రాజ్యాధికారం రావాలంటే మహాకూటమి బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్ధి ఆర్ కృష్ణయ్యకు పెరిక కుల ఉద్యోగుల సంఘం మద్దతు తెలియజేస్తున్నట్లు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సంగని మల్లేశ్వర్ పేర్కొన్నారు. సమావేశంలో విజయ్‌కుమార్, వెంకటేశ్వర్లు, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment