BC Association President
-
ఆదర్శంగా తీర్చిదిద్దుతా : ఆర్.కృష్ణయ్య
సాక్షి, మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రజా కూటమి బలపర్చన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం పట్టణంలోని రెడ్డికాలనీ, ముత్తిరెడ్డికుంట, శాంతినగర్, అశోక్‌నగర్, సీతారాంపురం, హనుమాన్‌పేట, ప్రకాశ్‌నగర్, వినోభానగర్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు స్వాగతం పలికారు. పలు వార్డులలో ర్యాలీలో నిర్వహించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, టీడీపీ నాయకులు బంటు వెంకటేశ్వర్లు, సాధినేని శ్రీనివాస్‌రావు, కాంగ్రెస్ నాయకులు శంకర్‌నాయక్, గాయం ఉపేందర్‌రెడ్డి, రతన్‌సింగ్, తమన్న, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. పెరిక కుల ఉద్యోగుల సంఘం మద్దతు.. బీసీలకు రాజ్యాధికారం రావాలంటే మహాకూటమి బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్ధి ఆర్ కృష్ణయ్యకు పెరిక కుల ఉద్యోగుల సంఘం మద్దతు తెలియజేస్తున్నట్లు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సంగని మల్లేశ్వర్ పేర్కొన్నారు. సమావేశంలో విజయ్‌కుమార్, వెంకటేశ్వర్లు, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
బీసీలు రాజ్యాధికారం సొంతం చేసుకోవాలి
ఎదులాపురం (ఆదిలాబాద్): బీసీలు ఐక్యంగా ఉండి రాజ్యధికారం సొంతం చేసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బీసీల రాజకీయ చైతన్య యాత్రలో భాగంగా మంగళవారం ఆయన జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ విశ్రాంతి భవనం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 21 రోజులు పూర్తి చేసుకుని 22వ రోజు ఆదిలాబాద్‌కు చేరుకోవడం జరిగిందన్నారు. దేశంలో 56 శాతం, రాష్ట్రంలో 65 శాతం మంది బీసీలు ఉన్నారన్నారు. రాష్ట్రంలోని 2కోట్ల మంది బీసీలను ఏకం చేయడానికి 36 రోజులు, 80 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. జనాభా ప్రతిపాదికన రాష్ట్రంలో 34 సీట్లు బీసీలకు కేటాయించాల్సి ఉండగా, ఈ రోజు 24 సీట్లు కేటాయించేందుకు కుట్ర జరుగుతుందన్నారు. బీసీల ఓటు బీసీలకే సీటు, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీ వాటా బీసీలకే అనే నినాదంతో తాను రాజకీయ బస్సు యాత్ర ప్రారంభించానన్నారు. జనాభాలో మొదటి స్థానంలో ఉన్న బీసీలు పార్లమెంటు స్థానాల్లోచివరి వరుసలో ఉన్నారన్నారు. అత్యధిక జనాభా ఉన్న బీసీలకు అగ్రవర్ణాలను అధికారం కట్టబెట్టి ఏమైనా కావాలంటే వినతులు సమర్పించి వారిని ఆర్తించాల్సి వస్తోందన్నారు. రాయితీలతో రాజీపడకుండా రాజ్యధికారం సాధించడమే ధ్యేయంగా బీసీలు ఏకం కావాలని శ్రీనివాస్‌గౌడ్ పిలుపు నిచ్చారు. జనాభా ప్రకారం బీసీ రాజ్యాధికారం సొంత చేసుకుంటే వినతులు సమర్పించే చేతులతో రేపు వినతులు స్వీకరించే రోజులు వస్తాయన్నారు. డప్పు, చెప్పు తప్ప మిగిలిన అన్ని వృత్తులు బీసీలే చేస్తున్నారని, బీసీలు లేకుంటే ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈర్ల సత్యనారాయణ, కోరెడ్డి పార్థసారిథి, రాష్ట్ర కార్య నిర్వహణ అధ్యక్షులు దాటర్ల కిష్టు, బీసీ సంఘాల జిల్లా నాయకులు నర్సాగౌడ్, చిక్కాల దత్తు, సామల ప్రశాంత్, ప్రమోద్ ఖత్రి, మంచికట్ల ఆశమ్మ, పసుపుల ప్రతాప్, పి.కిషన్, శ్రీపాద శ్రీనివాస్, అనసూయ, జక్కుల శ్రీనివాస్, వెండి బద్రేశ్వర్‌రావు, శ్రీనివాస్, ప్రసాద్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు అవకాశం కల్పించాలి
-బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య బాలానగర్ బీసీలకు నామినేటెడ్ పదవులలో అవకాశం కల్పించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని హిల్పార్క్రెస్టారెంట్లో ఏర్పాటు చేసున విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 69 సంవత్సరాలుగా అసెంబ్లీ, పార్లమెంట్ల్లో అడుగు పెట్టని బీసీలకు ఇతర దేశాల మాదిరిగా నామినేటెడ్ పదవులలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆంగ్లో ఇండియన్లను ఎంపీ, ఎమ్మెల్యేలుగా నామినేట్ చేస్తున్నారని, అదే పద్ధతిలో బీసీలకు అవకాశం కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి విజ్ఞప్తి చేసామని తెలిపారు. భారతదేశం ప్రజాస్వామ్యదేశమని, అన్ని కులాలకు అధికారంలో వాటా ఇవ్వాలన్నారు. అప్పుడే ప్రజాస్వామ్యం బీసీలకు చేరినట్లవుతుందన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లుపెట్టి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అఖిల పక్షంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.