నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు అవకాశం కల్పించాలి | nominated posts should be assigned to BCs | Sakshi
Sakshi News home page

నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు అవకాశం కల్పించాలి

Published Mon, Oct 17 2016 8:10 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

nominated posts should be assigned to BCs

-బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
బాలానగర్

 బీసీలకు నామినేటెడ్ పదవులలో అవకాశం కల్పించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని హిల్‌పార్క్‌రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసున విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 69 సంవత్సరాలుగా అసెంబ్లీ, పార్లమెంట్‌ల్లో అడుగు పెట్టని బీసీలకు ఇతర దేశాల మాదిరిగా నామినేటెడ్ పదవులలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

 

ఆంగ్లో ఇండియన్లను ఎంపీ, ఎమ్మెల్యేలుగా నామినేట్ చేస్తున్నారని, అదే పద్ధతిలో బీసీలకు అవకాశం కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి విజ్ఞప్తి చేసామని తెలిపారు. భారతదేశం ప్రజాస్వామ్యదేశమని, అన్ని కులాలకు అధికారంలో వాటా ఇవ్వాలన్నారు. అప్పుడే ప్రజాస్వామ్యం బీసీలకు చేరినట్లవుతుందన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లుపెట్టి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అఖిల పక్షంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement