వర్షాభావ పరిస్థితులు రైతన్నను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దానికి తోడు భూగర్బజలాలు అడుగంటుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. రబీలో విద్యుత్ సమస్యలు ఏర్పడే అవకాశముందని ప్రభుత్వం మొదటి నుంచి రైతులను అప్రమత్తం చేస్తూ ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందిగా సూచిస్తోంది. ఇలా పలు కారణాలతో ఈ ఏడాది రబీ సీజన్‌కు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలో రబీ సాధారణ సాగు 2.09 లక్షల హెక్టార్లు కాగా రైతులు గతేడాది 2.42లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ఏడాది 1.28లక్షల హెక్టార్లలో మాత్రమే సాగుచేశారు. ప్రతి ఏటా రబీలో ప్రధానంగా వరి, వేరుశనగ, పప్పుశనగ పంటలు సాగు చేస్తారు. ఈ ఏడాది జూన్ నుండి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 569.3మిల్లీ మీటర్లు కాగా గతేడాది 742.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది వర్షపాతం గణనీయంగా పడిపోయింది. ఇప్పటి వరకు 480.6 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఈ సారి వర్షపాతం తగ్గడంతో చెరువులు, కుంటలు నిండలేదు. అంతేకాకుండా వర్షభావ పరిస్థితులతో రోజురోజుకు భూగర్బజలాలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
ఎరువుల వాడకం కూడా తక్కువే
జిల్లాలో పంటల సాగు సరళి తగ్గడంతో ఎరువుల వాడకం కూడా గణనీయంగా తగ్గిపోయింది. జిల్లాలో రబీ సీజన్ అన్ని రకాల ఎరువులప్రణాళిక లక్ష్యం91,737మెట్రిక్ టన్నులు. అందులో ఇప్పటివరకు కేవలం 32,500 మెట్రిక్ టన్నులు మాత్రమే అమ్మడుపోయాయి. అయితే, అక్కడక్కడాఎరువుల కొరత ఉన్నట్లు రైతులు చెబు తున్నారు. రబీలో 39,280 మెట్రిక్ టన్నుల యూ రియా అవసరం ఉండేది. కానీ, ఈ సీజన్‌లో ఇప్పటివరకు 19,319 మెట్రిక్‌టన్నులు మా6తమే రైతు లు కొన్నారు. ఇంకా 7,883 మెట్రిక్‌టన్నుల యూరియా మార్క్‌ఫెడ్, పీఏసీఎస్, ప్రైవేటుడీలర్ల వద్ద7,860మెట్రిక్ టన్నులు ఉన్నా కృతిమ కొరత సృష్టించి రైతులకు సకాలంలో అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృత్రి మ కొరతతో రైతుల నుండి ఎక్కువ డబ్బులు వసులు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ ఏజెన్సీ వద్ద ఎక్కువ ధరకు యూరియా అమ్ముతున్న విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
రబీ.. ఢమాల్
Published Tue, Feb 17 2015 3:08 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM
Advertisement
Advertisement