మృత్యువులోనూ వీడని బంధం
* రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థుల మృతి
* బోరున విలపించిన తల్లిదండ్రులు
రఘునాథపల్లి : వారిద్దరు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. ఒకే కాలేజీలో కలిసి మెలిసి చదువుకుంటున్న మిత్రులు అనుకోని రీతిలో మృత్యువాత పడడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. సెలవులను పురస్కరించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ సంఘటన రఘునాథపల్లి- కోమళ్ల జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి.
వరంగల్‌లోని గిర్మాజీపేటకు చెందిన దండు దీక్షిత్ (21), తెరుగోని మల్లిక్ (20) ఇద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారిద్దరు హైదరాబాద్‌లోని గీతం ఇంజినీరింగ్ కళాశాల లో సెకండియర్ చదువుతున్నారు. కాగా, కళాశాలకు సెలవులు ఇవ్వడంతో వారు సాయంత్రం హైదరాబాద్ నుంచి బైక్‌పై వరంగల్‌కు బయలుదేరారు. అయితే రఘునాథపల్లి స్టేజీ దాటిన త ర్వాత హన్మకొండ నుంచి జనగామ వైపునకు వస్తున్న కారు లైట్ల వెలుతురుకు తమ ముందు సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని గమనించలేదు.
ఈ క్రమంలో సైకిలిస్టును తప్పించబోయి ప్రమాదవశాత్తు వారు ఎదురుగా వస్తు న్న కారును ఢీకొట్టారు. ఈ సంఘటనలో దీక్షిత్ అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, తీవ్రంగా గాయపడిన మల్లిక్‌ను స్థానికులు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదిలా ఉండగా, ఇదే సంఘట నలో సైకిల్‌పై వెళ్తున్న వెంకటాయపాలెం కు చెందిన తాళ్లపల్లి అనిల్‌కు తీవ్ర గా యూలయ్యూయి. కాగా, జనగామ రూర ల్ సీఐ వాసాల సతీష్, ఏఎస్సై దామెర సురేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా, సెలవుల కు ఇంటికి వస్తున్న తమ కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.