రాహుల్ గాంధీ పర్యటన ఖరారు
Published Sat, May 27 2017 1:57 PM | Last Updated on Sat, Aug 11 2018 7:56 PM
హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. జూన్ 1న మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకోనున్న రాహుల్‌గాంధీ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సంగారెడ్డి చేరుకుంటారు. స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో సాయంత్రం 5 గంటల నుంచి 6 వరకు పార్టీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. అనంతరం అంబేడ్కర్ స్టేడియంలో జరిగే తెలంగాణ ప్రజాగర్జన సభలో ప్రసంగిస్తారు. సభ ముగిసిన అనంతరం రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు చేరుకొని తిరిగి ఢీల్లికి బయలుదేరుతారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement