సాక్షి, హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. ఎల్‌బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, నిజాంపేట్, కేపీహెచ్‌బీ, సికింద్రాబాద్, కంటోన్మెంట్, కూకట్‌పల్లి, మూసాపేట్, ఈసీఐఎల్, అల్వాల్, బొల్లారం, పాతబస్తీ, రాజేంద్రనగర్, నాగారం, జవహార్ నగర్, కీసరలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
తూర్పు మధ్యప్రదేశ్ దానిని అనకుని ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని హైదరాబాద్ వాతారవణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో అక్కడక్కడ 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, మెదక్, సంగారెడ్డి, ఖమ్మం, జనగామ, యాదాద్రి భువనగిరి, మెహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, జోగులాంబ గద్వాల్ వనపర్తి, మెహబూబాబాద్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment