సీఎంను కలిసిన రాజేంద్రప్రసాద్
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నూతన అధ్యక్షుడు, నటుడు రాజేంద్రప్రసాద్ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ను ముఖ్యమంత్రి అభినందించారు. హైదరాబాద్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి, కళాకారుల సంక్షేమానికి కృషి చేయాలని, ఇందుకు తగిన సహకారం అందిస్తామని కేసీఆర్ చెప్పారు.
త్వరలోనే సినీ రంగ ప్రముఖులతో సమావేశం నిర్వహించి సినీ పరిశ్రమ అభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తామని సీఎం వెల్లడించారు. చిత్ర పరిశ్రమపై సీఎం ఎంతో చొరవ చూపిస్తున్నారని రాజేంద్రప్రసాద్ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతుందనే నమ్మకం ఉందన్నారు.